నాడు-నేడు కార్యక్రమంలో ద్వారా రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలు బాగు చేయాలి...బొప్పరాజు


ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, విజయవాడ.

(ప్రజా  అమరావతి);


 నాడు-నేడు కార్యక్రమంలో ద్వారా రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలు బాగు చేయాలి...బొప్పరాజు


నిధులు లేక నిర్మాణాలు నిలిచిపోయిన తహశీల్దార్/RDO కార్యాలయాలకు తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేయాలి...బొప్పరాజు.

         


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన తహశీల్దార్ కార్యాలయాలు కొన్ని శిథిలావస్థకు చేరి ఉన్నందున మరీ ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాలు పూర్తిగా దెబ్బతిని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నందున తక్షణమే సంబంధిత జిల్లా కలెక్టర్లు ద్వారా నివేదికలు తెప్పించుకుని నాడు - నేడు కార్యక్రమం ద్వారా.... పూర్తిగా దెబ్బతింటే నూతన భవనాలు, పాక్షికంగా దెబ్బతింటే తగిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని బొప్పరాజు, కృష్ణ మూర్తి కోరారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శిథిలావస్థలోవున్న ప్రభుత్వ పాఠశాలలకు సంభందించిన భవనములను నాడు నేడు కార్యక్రమము ద్వారా జీర్ణోద్దారణ చర్యలు చేపట్టే సాహసోపేతమైన ఒక మంచి నిర్ణయమును గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని ఇది అత్యంత అత్యంత శుభపరిణామమని అదే విధముగా ప్రభుత్వ పథకాల రూపకల్పనలో గాని , అమలులో గాని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రెవిన్యూ శాఖకు సంభందించిన శిథిలావస్థలో వున్న కలెక్టర్, RDO ప్రత్యేకంగా తహశీల్దార్ కార్యాలయాలు కూడా చాలా ఉన్నాయని వీటివల్ల వర్షా కాలములలో కురిసే వర్షాలు, తుఫానులు వలన;


 అత్యంత విలువ కలిగిన రెవిన్యూ రికార్డులు తుడిచిపెట్టుకొనిపోయే ప్రమాదం 


 భవనాలు కూలిపోయి అటు రెవిన్యూ ఉద్యోగులకు ఇటు పనుల నిమిత్తము నిత్యమూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ప్రాణ నష్టము జరిగే ప్రమాదం


 మరీ ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతంలో తుఫానులు సమయంలో తీర ప్రాంతం ప్రజలను (సైక్లోన్ షెల్టర్ బాగా లేనప్పుడు) కూడా తుఫాను తీరం దాటే వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే వారందరిని rescue చేసి ఉంచినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.


కావున ప్రభుత్వం తక్షణమే....


 గత ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టి నిధులు లేక construction  ఆగిపోయిన దాదాపు 65 తహశీల్దార్, RDO కార్యాలయాలకు తగిన నిధులు వెంటనే విడుదల చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని...


 శిథిలావస్థకు/మరమ్మతులు చేయవలసిన అనేక తహశీల్దార్ కార్యాలయాలు ఉన్నందున ప్రత్యేకంగా తీర ప్రాంతంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాలు లిస్ట్ సంబంధిత జిల్లా కలెక్టర్లు నుండి తక్షణమే తెప్పించి నాడు - నేడు కార్యక్రమం క్రింద చేపట్టి రెవెన్యూ ఉద్యోగులు మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాము.


 

Comments