సిఎస్ కలిసిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధుల బృందం
అమరావతి,8 ఏప్రిల్ (prajaamaravathi):న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల నుండి 20 సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సమావేశం అయింది.అండర్ స్టాండింగ్ ఇండియా అండ్ ఎకనమిక్ స్టడీ టూర్(UI&ESST)లో భాగంగా ఈబృందం రాష్ట్రానికి రావడం జరిగింది.ఈటూర్ లో భాగంగా 4వతేదీన విశాఖపట్నంలో పర్యటించి తూర్పు నావికాదళంతో పాటు పలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను సందర్శించడం జరిగింది.సచివాలయంలో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ తో సమావేశమైన ఈప్రతినిధి బృందం రాష్ట్ర విభజన అనంతరం ఎపి ఏవిధమైన సమస్యలను ఎదుర్కొంటోంది,రాష్ట్ర పరిస్థితులు ఏవిధంగా ఉందనే వివరాలు అడిగి తెల్సుకున్నారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ 2014 విభజన చట్టం ప్రకారం ఎపి విభజన జరిగిందని విభజన తర్వాత ఆనేక ఆర్దికపరమైన ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కొంటోందని చెప్పారు.60యేళ్ళుగా అభివృద్ధి చేసిన అధిక ఆదాయం వచ్చే కమర్షియల్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాదు తెలంగాణాకు వెళ్ళిపోగా అధిక ఖనిజ వనరులున్న రాయలసీమ ప్రాంతం ఎపిలో ఉండడం రాష్ట్రానికి కొంత ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు.దేశంలో గుజరాత్ తర్వాత పొడవైన తీర ప్రాంతం కలిగి మెరుగైన బయోడైవర్సిటీ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు.అంతేగాక గోదావరి,కృష్ణా వంటి డెల్టా ప్రాంతాలు కలిగి సారవంతమైన భూములు కలిగి ఉండడంతోపాటు రాయలసీమ జిల్లాలు అధిక ఖనిజ వనరులను కలిగి ఉన్నాయని తెలిపారు.అపారమైన జల సంపద కలిగిన రాష్ట్రం ఎపి అని ఇన్ లాండ్ జలరవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.ఎపి మారిటైం బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.రాష్ట్రం వ్యవసాయం, ఉద్యానవన,మత్స్య,పాడి పరిశ్రమాబివృద్ధి రంగాల్లో మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.అంతేగాక పర్యాటక,సాంస్కృతిక, ఆధ్యాత్నిక రంగాల్లో రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని వివరించారు. రాష్ట్ర విభజన కష్టాలను అధికమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఈప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అనేక వినూత్న పధకాలు,కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని సిఎస్ నేషనల్ ఢిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందానికి వివరించారు.ఈచర్యల్లో భాగంగానే అమరావతిలో శాసన రాజధాని,విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని,కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటుకు ప్రదిపాదించడం జరిగిందని తెలిపారు.ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా సామాజికాభివృద్ధికి మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యావ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి దశలవారీగా సిబిఎస్సి సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.అమ్మ ఒడి పేరిట పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహకంగా ఏడాదికి 15వేల రూ.లు అందించడం జరుగుతోందని సిఎస్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా దీని నిర్మాణం శరవేగంగా సాగుతోందని వచ్చే ఏడాదిలో ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నటు సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ వివరించారు.ప్రభుత్వ పాలనను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి ప్రభుత్వ పధకాలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో పాటు అర్హులైన పేదలందరికీ ఆయా పధకాలు సకాలంలో సక్రమంగా చేరేందుకు వీలుగా ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని సిఎస్ చెప్పారు. రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అలాగే విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక కారిడార్ ద్వారా పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధికి కృషి జరుగుతోందని తెలిపారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదాను సాధించేందుకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతోందని వివరించారు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఏవిధంగా ఉన్నాయని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సిఎస్ స్పందించి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పరస్పరం చర్చించుకుని వివిధ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పారు.సామాజిక భద్రతకు ఏవిధమైన భరోశాను ఇస్తున్నారన్న దానికి అందుకు ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను సిఎస్ వివరించారు. నేషనల్ డిఫెన్సు కళాశాల ఫ్యాకల్టీ ఇన్చార్జి మేజర్ జనరల్ మనోజ్ కుమార్(సేవా మెడల్) మాట్లాడుతూ ఈస్టడీ టూర్ లో భాగంగా విశాఖపట్నం,అమరావతిల్లో బృందం పర్యటించడం జరిగిందని తెలిపారు.నేషనల్ ఢిపెన్స్ కళాశాలలో త్రివిధ దళాలకు సంబంధించి 4వేల మంది వరకూ అధికారులు శిక్షణ పొందుతున్నారని 69 దేశాలకు తన కార్యకలపాలు అందిస్తోందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నేషనల్ డిఫెన్స కళాశాల టూర్ కోఆర్డినేటర్ అమన్ దీప్ చత్తా(Aman Deep Chatha)బ్రిగేడియర్లు గగన్ దీప్,ఆశిశ్ భరద్వాజ్,నవరాజ్ ధిల్లాన్,రవరూప్ సింగ్,జెపిసి పెర్రిస్,ఎఎ సాధే,సమీర్ శ్రీవాస్తవ,కెఎస్ గ్రేవాల్,ఇండియన్ కోస్టుగార్డు డిఐజి అనురాగ్ కౌసిక్, ఎయిర్ కమడోర్లు వికాస్ ద్వివేది,వికాస్ శర్మ ఇంకా నేపాల్,కజకిస్తాన్,బంగ్లాదేశ్ లకు చెందిన ఆర్మీ,ఎయిర్ ఫోర్సు,నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment