విద్యతో వెలుగులు నింపుతున్న జగనన్న'* - *జగనన్న విద్యాదీవెన పొందిన విద్యార్థులు

 *'విద్యతో వెలుగులు నింపుతున్న జగనన్న'* - *జగనన్న విద్యాదీవెన పొందిన విద్యార్థులు* ఏప్రిల్ 19, అనంతపురము (prajaamaravathi);  సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాదీవెన పథకంపై నిర్వహించిన వీసీలో స్థానిక కలెక్టరేట్ ఆవరణంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. జగనన్న విద్యాదీవెన పొందిన విద్యార్థులు తమ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. *1. విద్యతో వెలుగులు నింపుతున్న జగనన్న* - _వర్షిణి, బీటెక్, ఈసీఈ, ద్వితీయ సంవత్సరం, ఎస్కే యూనివర్సిటీ_ నా పేరు వర్షిని. దురదృష్టవశాత్తూ నేను గత కొన్ని సంవత్సరాలుగా అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నాను. దాంతో పాటు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబ పోషణే ఇబ్బందిగా ఉండటంతో ఇక నేను చదువు మానేయాల్సి వస్తుందేమోనని భయపడ్డాను. అయితే జగనన్న విద్యాదీవెన నాకు వరంలా మారింది. సచివాలయాల ద్వారానే దరఖాస్తు చేసుకుని సులభతరంగా, పారదర్శకంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తుండటంతో నా చదువు గురించి మా తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన తగ్గింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వాలంటీర్లు వచ్చి అందిస్తున్న వికలాంగుల పింఛను ఆర్థికంగా ఎంతో భరోసాగా ఉంటోంది. ఈ ప్రోత్సాహంతో ఇంకా బాగా కష్టపడి చదువుతాను. సమాజంలో ఒక మంచి స్థానంలో నిలబడడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సదా రుణపడి ఉంటాను. *2. దేశంలో ఎక్కడా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు* - _ఎస్.సర్ఫరాజ్, బీటెక్, పీవీవీకే కాలేజీ_ బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు పిల్లల చదువుతోనే అన్ని సమస్యలు తీరుతాయని భావిస్తారు. అందుకే వారి చదువుకోసం స్థాయికి మించి ఖర్చు చేసి అప్పుల పాలవుతారు. చదువుకోవాలనే ఆశ ఏ ఒక్క కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేయకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకం తీసుకొచ్చారు. ప్రతి ఏటా నాలుగు విడతలుగా విద్యాదీవెన ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ అందించటంతో పాటు అమ్మఒడి, నాడు-నేడు, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను ప్రవేశ పెట్టారు. ఈ పథకాల ద్వారా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ కుటుంబాల్లోని పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది. *3. భవిష్యత్తు మీద భరోసా కలిగింది* - _అమృతా బాయ్, డిగ్రీ మొదటి సంవత్సరం, కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ_ . నాది మారుమూల తాండా. మా తాండాలో అమ్మాయిలు పై చదువులు చడవడమంటే చాలా పెద్ద విషయం. నన్ను చదివించాలని మా తల్లిదండ్రులకు ఆశ ఉన్నా వారి స్తోమత సరిపోతుందో, లేదో అని ఆందోళన చెందేవారు. అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టలేక నేను కూడా ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసి ఇంటికి పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నా. అలాంటి నాకు జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలు భరోసానిచ్చాయి. ఇంటర్మీడియట్ లో ఉండగానే అమ్మఒడి ఇచ్చారు. డిగ్రీలో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారు. వసతి దీవెన కింద నగదు అందజేస్తున్నారు. ఇప్పుడు నా చదువు బరువని నా తల్లిదండ్రులు భావించడం లేదు. జగనన్న పథకాలతో నాకు భవిష్యత్తు మీద భరోసా కలిగింది. *4. విద్యకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు* - _శిరీష, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురము_ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవి చేపట్టినప్పటి నుండి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అర్హులైన వారందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా విద్య విషయంలో మధ్యాహ్న భోజన పథకం, నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన కార్యక్రమం తదితర పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా కృతజ్ఞతలు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నడు ఎక్కడ జరగలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన పథకం ఒక వరంలా అందిస్తున్నారు. చదువుతున్న పిల్లల కాలేజీలకు తల్లిదండ్రులు వెళ్లి వారి బాగోగులతో పాటు కాలేజీ లోని సమస్యలు, వసతులు లాంటివి గుర్తించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మాలాంటి వారిని ఎందరినో ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. *5. తల్లులకు గుర్తింపు, గౌరవం లభిస్తోంది* - _శ్రీమతి లలిత కుమారి, ఓ తల్లి_ గతంలో స్కూల్లో గానీ కాలేజీలో గానీ పిల్లలను చేర్పిస్తే తండ్రి పేరు మాత్రమే అడిగేవారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లి పేరు అడుగుతున్నారు. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుండటంతో తల్లులకు గుర్తింపు, గౌరవం దక్కుతోంది. సమాజంలో తండ్రులతోపాటు తల్లులకు కూడా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా కుమార్తె మేఘన ఎస్కేయూలో ఎంఏ ఎకనామిక్స్ చదువుతోంది. ఆర్థిక శాస్త్రంలో పాఠాలు నేర్చుకుంటున్న కొద్దీ జగనన్న ప్రవేశ పెట్టిన పథకాలు ఎంత విప్లవాత్మకమైనవో తనకు అర్థమవుతోందని చెబుతూ ఉంటుంది. నవరత్నాల ద్వారా పేదరికాన్ని రూపు మాపేందుకు మానవ చరిత్ర ఎన్నడూ చూడని ఒక మహా యజ్ఞాన్ని జగనన్న చేస్తున్నారని గుర్తు చేస్తూ ఉంటుంది. 

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image