కర్నూలు -(prajaamaravathi); *పరిషత్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
ఓటర్లూ...ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా.. స్వేచ్ఛగా, నిర్భయంగా పవిత్ర ఓటు హక్కును వినియోగించుకోండి.. :- సంయుక్త ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప* *8-4-2021 న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ :-* *ప్రశాంత వాతావరణంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు కు 5 వేల మందితో గట్టి బందోబస్తు :-* *ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోండి :-* *సంయుక్త ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప :-* *కర్నూలు, ఏప్రిల్ 07 :-* *రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏకగ్రీవం పోను, జిల్లాలో మిగిలిన 44 మండలాలలో 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ను స్వేచ్ఛగా, పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ..తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫెరెన్సు హాల్లో 'పరిషత్' ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై నిర్వహించిన సంయుక్త ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డి ఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, సమాచార శాఖ ఉపసంచాలకులు పి. తిమ్మప్ప తదితర అధికారులు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు*. *ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఈ నెల 8న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా, ప్రశాంతంగా, విజయవంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పటిష్టమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశామని, పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బంది బుధవారం రాత్రి 8 గంటలకు అంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటరన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరూ ఎస్ఈసీ నిర్దేశించిన ఏదేని ఒక ఫోటో గుర్తింపు కార్డును చూపించి లేదా ఫోటో ఓటరు స్లీప్ ను పోలింగ్ అధికారులకు చూపించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 1785 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. దాదాపు 11,600 మంది జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో విధులు నిర్వహిస్తారన్నారు. 1785 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీతో క్షుణ్నంగా వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఏ విధంగా ప్రశాంతంగా జరిగాయో అలాగే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు అధికారులకు సహకరించాలని కోరారు. ఓటర్లు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లాస్ట్ వన్ అవర్ లో పీపీఈ కిట్టు ధరించి అంబులెన్స్ లో తీసుకెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.* *అదే విధంగా జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల బందోబస్తుకు లో 1 కమాండెంట్ , 3 అడిషనల్ ఎస్పీలు, 17 డిఎస్పీలు, 105 సిఐలు, 143 మంది ఎస్సైలు, 508 ఎఎస్సై లు / హెడ్ కానిస్టేబుల్స్, 1,038 సివిల్ పోలీసులు, 28 ఎఆర్ ఎస్సైలు / ఎఆర్ హెడ్ కానిస్టేబుల్స్, 64 ఎఆర్ పోలీసులు, 150 స్పెషల్ పార్టీ పోలీసులు, 145 మంది ఇతర శాఖల చెందిన సిబ్బంది, 374 మంది హోంగార్డులు, 7 ప్లటూన్ల ఎపిఎస్పీ, 2 పట్లూన్ల ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది 900 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు, 1,752 గ్రామ సచివాలయ పారా స్టాఫ్ (డిజిటల్ సిబ్బంది) 5,386 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారన్నారు. ఇందులో 20 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 20 స్ట్రైకింగ్ ఫోర్సులు, 238 పోలీసు రూట్ మొబైల్స్ తో పోలీంగ్ కేంద్రాల వద్ద నిరంత నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు. ఏప్రిల్ 3 వ తేది నుండి ఎన్నికల కోడ్ అమలులో వచ్చినప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని, నేర చరిత్ర గల వారిపై మొత్తం 612 మందిని బైండోవర్ చేసి 88 కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో నగదు 10 లక్షల 67 వేల 4 వందలు, 11 కేజిల 200 గ్రాముల వెండి ( విలువ 3 లక్షల 70 వేలు), 15 కేజిల గంజాయి, (విలువ 1 లక్ష), 1,725 గుట్కా ప్యాకెట్లు, జిల్లా వ్యాప్తంగా 1,306 లైసెన్సులు కలిగిన తుపాకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువగా గుమికూడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
addComments
Post a Comment