చదువుతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం.
* బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సభలో కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్
విజయనగరం, ఏప్రిల్ 05 (ప్రజా అమరావతి) ః ఉన్నత చదువులు చదవటం... జ్ణాన సముపార్జన చేయటం ద్వారానే సమాజంలో చైతన్యం వస్తుందని తద్వారా వివిక్షతలు లేని సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా అధికారులతో కలిసి బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ భావితరాలకు మార్గదర్శకుడని, ఎందిరిలోనో స్ఫూర్తి నింపిన మహానభావుడని కొనియాడారు. చదువునే నమ్ముకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశంలోని వెనుకబడిన వర్గాల వారికి, దళిత జాతికి ఒక వెలుగు దివ్వెలా నిలిచారన్నారు. అనతికాలంలోనే ఉన్నత పదవులు చేపట్ట దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఆయన జీవితంలో ప్రగతి సాధించడానికి చదువునే నమ్ముకున్నారని.. మనం కూడా చదువునే నమ్ముకొని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బాగా చదివించాలని అప్పుడే సమాజంలో ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వివిక్షతలు, విభేదాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి కృషి చేయాలని సూచించారు.
*ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం*
బాబూ జగ్జీవన్రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా దేశ వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన కాలంలోనే హరితవిప్లవం కూడా వచ్చిందని గుర్తు చేశారు. అలాగే జగ్జీవన్‌రామ్ కి ప్రకృతి వ్యవసాయం అంటే చాలా మక్కువ అని పేర్కొన్నారు. మన జిల్లా ప్రకృతి వ్యవసాయానికి చాలా అనుకూలమని.. కావున ఆయన ఆలోచనల బాటలోనే మనమూ నడిచి జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దామని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. చెరువులన పరిరక్షించుకోవటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించ వచ్చని.. తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అనంతరం సంయుక్త కలెక్టర్లు కిశోర్ కుమార్, వెంకటరావు, డీపీవో సునీల్ రాజ్ కుమార్, ఎస్సీ కార్పోరేష్ ఈడీ జగన్నాధం, డ్వామా పీడీ నాగేశ్వరరావులు మాట్లాడారు.
కార్యక్రమంలో సీపీవో విజయలక్ష్మి, డీఈవో నాగమణి, డిప్యూటీ డీహెం&హెచ్‌వో ఛామంతి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి అప్పలనాయుడు, వివిధ విభాగాల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment