చంద్రబాబుపై రాళ్లదాడిని ఖండించిన యనమల తిరుప

 చంద్రబాబుపై రాళ్లదాడిని ఖండించిన యనమల తిరుపతి (prajaamaravathi);లో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుపై రాళ్లదాడిని టిడిపి పోలిట్ బ్యూరో మెంబరు యనమల రామకృష్ణుడు ఖండించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా వైసిపి రాక్షస మూకలు రెచ్చిపోవడంపై మండిపడ్డారు. ‘‘మాజీ ముఖ్యమంత్రికే రాష్ట్రంలో భద్రత కొరవడటం జగన్ దమన పాలనకు అద్దం పడుతోంది. చంద్రబాబుపై రాళ్లదాడిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి. తిరుపతిలో శాంతిభద్రతలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. ప్రచారంలోనే ఇలాంటి దమనకాండకు పాల్పడిన వైసిపి పోలింగ్ నాడు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. రాళ్లదాడికి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుపతి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని’’ యనమల డిమాండ్ చేశారు. 

Comments