గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం

పోరంకి, విజయవాడ (prajaamaravathi); గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం



‘వలంటీర్లకు వందనం’ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *ఉగాది పర్వదినం సందర్భంగా వలంటీర్లకు పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, అదే మండలంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి:లాంఛనంగా 9 మంది వలంటీర్లను సత్కరించి, సేవా పురస్కారాలు అందజేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:ఇకపై ప్రతి ఏటా వలంటీర్లకు సత్కారం వారి సేవలకు మరింత ప్రోత్సాహం* *గ్రామ, వార్డు వలంటీర్లది నిస్వార్థమైన సేవ. 32 రకాల సేవలను వారు అందిస్తున్నారు. ఎండ, వాన, చలిని కూడా లెక్కచేయకుండా వలంటీర్లు త్యాగనిరతితో సేవ చేస్తున్నారు. సూర్యోదయానికి ముందే, సూర్యాస్తమయం తర్వాత కూడా విధి నిర్వహణలో 2.60 లక్షల వలంటీర్లు.వారు చూపుతున్న చొరవ, చేసిన సేవలకు గుర్తింపు. అందుకే ఇప్పుడు ఈ సత్కారం, ఇక ఏటా ఈ కార్యక్రమం. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి. ఇలాంటి సేవా భావంతో పని చేస్తున్న వలంటీర్ల మీద ఈ వ్యవస్థ మీద ఎల్లో మీడియా, విపక్ష నేతల విమర్శలు. మీకు ఒక విషయం చెబుతున్నాను, క్రమశిక్షణ వీడకండి. ఎలాంటి విమర్శలకు మీరు వెరవొద్దు. పండ్లు పండే చెట్టు మీదే రాళ్లు పడతాయి. *ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి* *మిమ్మల్ని వారేదో అంటున్నారని చెప్పి వెరవొద్దు* *వారి పాపానికి, వారి ఖర్మకు వారిని వదలేయండి* *మీ ధర్మాన్ని నెరవేర్చండి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది* *మానవ సేవే మాధవసేవ అని మనందరికీ తెలుసు* *దీన్ని మీరు కచ్చితంగా గుర్తు పెట్టుకోండి* *మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు సేవ అని గుర్తించండి* *వలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌* *పోరంకి, విజయవాడ:* మూడు కేటగిరిలలో మొత్తం 2,22,990 గ్రామ, వార్డు వలంటీర్లకు మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు, అవార్డులతో సత్కారం చేయనున్నారు. ఉగాది మర్నాటి నుంచి అన్ని జిల్లాలలోని ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. *వలంటీర్ల సత్కార కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం:* *దేశమంతా మనవైపు చూసేలా..:* ‘దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చే సరికి జూన్‌ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేశాం. దాని తర్వాత ఆగస్టు, సెప్టెంబరు నాటికి వలంటీర్‌ వ్యవస్థ తీసుకురావడం, అక్టోబరు నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఈ రెండింటిని తీసుకువచ్చి గ్రామాలు, మునిపాలిటీ వార్డులు స్థాపించామో, ఆరోజు నుంచి ఈరోజు దాకా దాదాపు 20 నెలలు, రాష్ట్రంలో పరిపాలన అంటే ఇలా అన్నట్లు దేశమంతా మన వైపు చూసేలా పని చేస్తున్నారు నా చెల్లెమ్మలు, నా సోదరులు’. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సహాయపడే మంచి మనుషులు, మనసున్న మనుషులందరికీ నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లకు నిండు మనసుతో అభినందనలు తెలియజేస్తున్నాను. మానవత్వాన్నే మంచితనంగా, మంచితనాన్నే కులంగా మార్చుకుని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు’. *మనసారా సెల్యూట్‌:* ‘పథకాలకు రాష్ట్రంలో గ్రామ, గ్రామాన వాడ వాడనా సంధానకర్తలా ఒక వైపు సచివాలయాలు, మరోవైపు వలంటీర్లు ఎక్కడా వివక్ష, లంచానికి తావు లేకుండా, కులం, మతం, పార్టీ, రాజకీయం చూడకుండా, చివరికి వారు తమ పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్న నా చెల్లెమ్మలు, నా తమ్ముళకు మనసారా సెల్యూట్‌ చేస్తున్నాము’. *తాపత్రయ పడే సైనికులు:* ‘‘ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌. అదే అర్బన్‌లో అయితే దాదాపు 100 ఇళ్లకు ఒక వలంటీర్‌. వారంతా ఆయా గ్రామాలు, వార్డులలో ఏర్పాటైన సచివాలయాలతో అనుసంధానమై రాష్ట్రంలో దాదాపు 2.60 లక్షల మంది వలంటీర్లు ప్రతి చోటా మనకు కనిపిస్తున్నారు. వలంటీర్లలో 97 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. యువకులు, సేవాభావం ఉన్న వారని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇందులో 53 శాతం నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నాను. మొత్తం వలంటీర్లలో దాదాపు 83 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పేదవర్గాలకు చెందిన వారే. పేదరికం అంటే తెలిసిన వారు. వారి బాధలు అర్ధం చేసుకున్న వారు. ఎప్పుడైతే పేదల బాధను అర్ధం చేసుకుంటారో, వారికి ఆ బాధలు రాకూడదని తాపత్రయపడే సైనికులు వారు’. ‘వారందరికీ తోడు దాదాపు మరో 1.40 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో, గ్రామానికి 10 మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో కూడా దాదాపు 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారున్నారు’. *గర్వంగా చెబుతున్నాను:* ‘పొద్దున్నే సూర్యోదయం కాకముందే అవ్వాతాతల దగ్గరకు వెళ్లాలి. వారికి పెన్షన్‌ చేతిలో పెట్టాలి అన్న దృక్పథం, ఆ మనసుతో మన వలంటీర్లు పని చేస్తున్నారు. దాదాపు 61.73 లక్షల అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీన, అది ఆదివారం అయినా, సెలవు రోజైనా సరే, సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ చేతుల్లో పెడుతున్నారు. వారి నుంచి ఒక చిరునవ్వు, దీవెనలు పొందుతూ నిస్వార్ధంగా పని చేస్తున్న గొప్ప సైనికులు, నా వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నాను’. *32 రకాల సేవలు:* ‘దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు తమ పాత్రను పోషిస్తున్నారు’. ‘బియ్యం కార్డు, వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల జారీ కావొచ్చు, పెన్షన్‌ కానుక, ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడం, జగనన్న తోడు, వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా, వైయస్సార్‌ కంటి వెలుగు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయస్సార్‌ మత్స్యకార భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, గోరు ముద్ద, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న చేదోడు, వైయస్సార్‌ వాహనమిత్ర, వైయస్సార్‌ నేతన్న నేస్తం.. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా, కొన్నింటిలో పూర్తిగా, మరి కొన్నింటిలో అవసరం మేరకు వలంటీర్లు పని చేస్తున్నారు’. ‘మరీ ముఖ్యంగా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వలంటీర్లు చేసిన పని అంతా ఇంతా కాదని గర్వంగా చెబుతున్నాను’. *రుజువు చేశారు:* ‘ఒక వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ఒక కార్యక్రమం చేయగలమా? అని గతంలో సందేహాలు ఉండేవి. కానీ అవి ఇప్పుడు లేవు. అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ అవుతుందని, అవినీతి, వివక్ష లేకుండా అవి అందుతాయని మన వలంటీర్లు రుజువు చేశారని గర్వంగా చెబుతున్నాను’. *నిస్వార్ధ సేవకులు:* ‘ఎండ, వాన, చలిని కూడా లెక్కచేయకుండా వలంటీర్లు సేవ చేస్తున్నారు. సూర్యోదయానికి ముందే, సూర్యాస్తమయం తర్వాత కూడా విధి నిర్వహణలో ఈ 2.60 లక్షల వలంటీర్లు చూపిన చొరవ, చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సత్కారం. వారిని ప్రజలు గుర్తించడమే కాదు, ప్రజలు ఆశీర్వదించడమే కాదు, ప్రభుత్వం కూడా గుర్తిస్తూ ఈ సత్కారం చేస్తోంది. సేవా దృక్పథంలో మంచి పని చేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం కూడా గుర్తించాలన్న ఆలోచనతో ఈ అవార్డుల కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది’. ‘కొందరు వలంటీర్లు చేసిన పనులను చాలా మంది చూసే ఉంటారు. పేపర్లలో కూడా చూసే ఉంటారు. వారు ఎంత నిస్వార్థంగా, సేవా దృక్పథంలో పని చేశారో చెప్పడానికి.. *కొన్ని ఉదాహరణలు:* – శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురంకు చెందిన ఒక అవ్వ తన కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంటే, ఆమె కొడుకు దగ్గర ఆస్పత్రిలో ఉంటే, వలంటీర్‌ రమణ, అక్కడికి వెళ్లి ఆమెకు పెన్షన్‌ ఇచ్చి వచ్చాడు. – ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం, చిలకపాడుకు చెందిన బి.వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రిలో ఉంటే, మన వలంటీర్‌ సిద్ధారావు హైదరాబాద్‌ వెళ్లి మరీ పెన్షన్‌ ఇచ్చి వచ్చాడు. – చిత్తూరు జిల్లా కంబంవారిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి పక్షవాతంతో బెంగళూరు వెళ్లి చికిత్స పొందుతుంటే, మన వలంటీర్‌ భానుప్రకాష్‌ అక్కడికి వెళ్లి పెన్షన్‌ ఇచ్చి వచ్చాడు. – విజయనగరం జిల్లా గజపతినగరంలో గ్యాస్‌ స్టవ్‌ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక గాయపడితే, వలంటీర్లు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడమే కాకుండా, తమ జేబు నుంచి రూ.2 వేలు ఇచ్చారు. – గుంటూరు జిల్లా రొంపిచర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, మన వలంటీర్‌ తమ్ముడు శివకృష్ణ పిల్లలు, వృద్ధులను కాపాడాడు. *ఎలా సాధ్యం?*: ‘వలంటీర్లు ఇన్ని ఎలా చేయగలుగుతున్నాంటే, ఆ 50 ఇళ్లతో వలంటీర్లకు అనుబంధం ఏర్పడింది. వారిని తమ కుటుంబ సభ్యులగా వారు భావిస్తున్నారు. అందుకే ఆ విధంగా సేవలందిస్తున్నారు’. *అందుకే ఈ సత్కారం:* ‘కులం, మతం, రాజకీయం, వర్గం చూడకుండా, వివక్ష చూపకుండా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, చివరకు మన పార్టీకి ఓటు వేయకపోయినా మనం చేసే మంచి ఆగిపోకూడదన్న తపనతో సేవలందిస్తున్న వలంటీర్లకు సత్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర కింద మొత్తం 2,22,990 మంది వలంటీర్లకు సత్కారం’. *లెవెల్‌ (కేటగిరీ)–1 * *సేవామిత్ర:* ఈ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా 2,18,115 మంది వలంటీర్లకు సత్కారం. రూ.10 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి ప్రదానం ఇచ్చి, ప్రభుత్వం మీరు చేసిన మంచి పని గుర్తిస్తోంది అని చెప్పి, వారిని ప్రోత్సహించే కార్యక్రమం ఇది. *లెవెల్‌ (కేటగిరీ)–2* *సేవా రత్న:* ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి 5గురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందికి సేవా రత్న అవార్డుతో సత్కారం. సేవా రత్న అవార్డు గ్రహీతలకు రూ.20 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి ఇస్తారు. ఆ తర్వాత వీరందరి కంటే ఇంకా ఎక్కువ కష్టపడిన వారికి మూడో కేటగిరీలో సత్కారం. *లెవెల్‌ (కేటగిరీ)–3* *సేవా వజ్ర:* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5గురు చొప్పున ఎంపిక చేసి మొత్తం 875 మంది వలంటీర్లకు సేవా వజ్ర ప్రదానం. సేవా వజ్ర అవార్డు గ్రహీతలకు రూ.30 వేల నగదు, పతకం, సర్టిఫికెట్, శాలువాతో పాటు, బ్యాడ్జిని ప్రదానం చేస్తారు. *ప్రతి ఏటా ఈ కార్యక్రమం:* ‘ఇందు కోసం ప్రభుత్వం దాదాపు రూ.241 కోట్లు వ్యయం చేస్తోంది. ఇక్కడ మరో విషయం ఇది ఈ ఏడాదితోనే ఆగిపోదు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి సేవా మిత్ర పొందిన వారు, సేవా రత్న కోసం, సేవా రత్న పొందిన వారు సేవా వజ్ర కోసం ప్రయత్నించాలి’. *ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు:* ‘రేపు (మంగళవారం) ఉగాది పండగ కాబట్టి, అధికారులు ఒక్కరోజు సెలవు తీసుకోవచ్చు. ఆ మర్నాటి నుంచి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు చొప్పున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వలంటీర్లను సత్కరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ప్రజా ప్రతిని«ధులు పాల్గొంటారు. అలా అందరూ ఆ కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. నేను కూడా స్వయంగా ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాయలసీమలో ఒక చోట హాజరవుతాను’. *పండ్ల చెట్టు మీదే రాళ్లు:* ‘ఇలాంటి సేవా భావంతో పని చేస్తున్న వలంటీర్ల మీద, ఈ వ్యవస్థ మీద కొన్ని సందర్భాలలో ఎల్లో మీడియా కానీ, కొందరు విపక్ష నేతలు కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు. మీకు ఒకటే విషయం చెబుతున్నాను. మీరు క్రమశిక్షణతో ఉండండి. విమర్శలకు వెరవొద్దు. పండ్లు పండే చెట్టు మీదే రాళ్లు పడతాయని గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వారేదో అంటున్నారని చెప్పి వెరవొద్దు. వారి పాపానికి, వారి ఖర్మకు వారిని వదలేయండి. మీ ధర్మం మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని గట్టిగా చెబుతున్నాను’. ‘మానవ సేవే మాధవసేవ అని మనందరికీ తెలుసు. దీన్ని మీరు కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు సేవ అన్నది గుర్తు పెట్టుకోండి. ఇవాళ మీరు ఇంత నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు కాబట్టే, ఆ 50 కుటుంబాల వారు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మీపై ఆప్యాయత చూపిస్తున్నారు’. ‘ఈ పని ద్వారా మీరు సాధించేది, మీకు జరిగే మంచి ఏమిటంటే.. ఆ 50 ఇళ్లలోని ఆ అవ్వా తాతల దీవెనలు. ఆ 50 ఇళ్ల వారి ఆశీర్వాదం’. *ఆల్‌ ది బెస్ట్‌:* ‘ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న వలంటీర్లు, నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తూ, దేవుడి దయ మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి అందేలా, మీ అందరి పనితీరు మరింత గొప్పగా ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ.. మరోసారి మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత 9 మంది వలంటీర్లను సత్కరించి, లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, తొలి రోజు జరిగే సత్కార కార్యక్రమానికి సంబంధించి 18,576 మంది వలంటీర్ల ఖాతాల్లోకి రూ.18,93,36,000 నగదు బహుమతిని ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్సఫర్‌ చేశారు. అనంతరం వలంటీర్ల విజయాలను వివరిస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, సింహాద్రి రమేష్‌, మేకా ప్రతాప అప్పారావు, డి నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మల్లాది విష్ణుతో పాటు, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, అధికారులు, కృష్ణా జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments