కుటుంబ సమేతంగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని 

  కుటుంబ సమేతంగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని  ఆలయ మర్యాదలతో , పూర్ణకుంభంతో ఘనస్వాగతం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామికి ప్రత్యేక పూజలు  వేద పండితుల ఆశీర్వచనం , శేష వస్త్రాలతో సత్కారం శ్రీశైలం, ఏప్రిల్ 19 (prajaamaravathi) : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సోమవారం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైల క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భార్య అనుపమ, కుమార్తెలు కనకదుర్గ , విజయదుర్గలతో కలిసి మంత్రి కొడాలి నాని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం శ్రీమల్లిఖార్జుని పవిత్ర క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాన్ని అందజేశారు . అభేద్యమైన ప్రాకారం లోపల నాలుగు మండపాలతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే శ్రీ మల్లిఖార్జున దేవాలయంలో కుటంబ సమేతంగా మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అలాగే అద్భుతమైన శిల్పకళతో , అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్థంభాలతో విశిష్టమైన శిల్పకళ కల్గిన భ్రమరాంబికా అమ్మవారి దేవాలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ భూమిపై వెలసిన కైలాసంగా పేరొందిన శ్రీశైల క్షేత్రం దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటని , శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు . క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు . శాతవాహనులు , విష్ణుకుండినులు , పల్లవులు , విజయనగర సామ్రాజ్యాధీసులు , కాకతీయులు , రాష్ట్ర కూటులు , చాళుక్యులు , రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని దర్శించి ఆలయ ప్రాకారాలను నిర్మించారన్నారు . శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనం మనోహరమని , ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని మంత్రి కొడాలి నాని విశ్వాసం వ్యక్తం చేశారు . అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు ఆలయ విశిష్ఠతను మంత్రి కొడాలి నానికి వివరించారు . ధ్వజ స్తంభం , నంది విగ్రహాలకు పూజలు చేయించారు . కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి కొడాలి నానికి స్వామి , అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించి తీర్ధప్రసాదాలను అందజేశారు .

Comments