వాలంటీర్ల వ్యవస్థ.. ప్రభుత్వానికి కళ్లు చెవులు!*
వాలంటీర్ల సేవలకు విశిష్ట పురస్కారాలు* *గ్రామ స్వరాజ్యం.. వాలంటీర్ల వ్యవస్థ తో సాధ్యం!* పులివెందుల ఏప్రిల్ 12 (prajaamaravathi): సచివాలయ వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అభివర్ణించారు. వలంటీర్ల స్వచ్చంద సేవలను గుర్తిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది పర్వదినాన్ని ముందు రోజే.. వారికి "సేవా మిత్ర" "సేవా రత్న" "సేవా వజ్ర" విశిష్ట సేవా పురస్కారాలు అందజేయడం ఆనందదాయక విషయం అన్నారు. సోమవారం స్థానిక పులివెందుల శివారులోని సీఎస్ సిఆర్ కళ్యాణమండపంలో... పులివెందుల నియోజకవర్గ వాలంటీర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న "సేవా మిత్ర" "సేవా రత్న" "సేవా వజ్ర" పురస్కారం వేడుకలను... ఆహ్లాదకరమైన వాతావరణంలో... అత్యంత వేడుకగా... కన్నుల పండువగా జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్, ఎంపి వై ఎస్ అవినాష్ రెడ్డిలు ప్రారంభించారు. అంతకు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి.. కడప జిల్లాతో పాటు ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అత్యంత శ్రద్ధ వహించారన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు... శ్రీకారం చుట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా అత్యంత కీలకమైన వాలంటీర్ల నియామకం చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 15 వేల మంది వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఐదు వేలమంది మొత్తంగా మన జిల్లాలో 20 వేల మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు .. గ్రామ / వార్డు సచివాలయానికి , ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించినందుకు .. ' నవశకం ' సర్వే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి , అవినీతి , పక్షపాతం లేకుండా గడప వద్దకే సంక్షేమ ఫలాలు , అందించినందుకు.. వారి సేవలను గుర్తించి విశిష్ట సేవ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పింఛన్లు రంఛన్ గా ప్రతి నెల ఒకటో తారీఖునే అందిస్తున్నందుకు .. పెన్షన్ లతో పాటు రేషన్ డోర్ డెలివరీ , బియ్యం కార్డు , ఆరోగ్యశ్రీ కార్డు , ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితిలో అందిస్తున్నందుకు ... 5 సార్లు కోవిడ్ సర్వే నిర్వహణతో పాటు , ప్రజలకు మాలు , మందులు , ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి కరోనా కష్టాల నుంచి ప్రజలను కనుపాపలా కాపాడినందుకు .. వరదలు , విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకొనడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు “ దిశ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు వాలంటీర్ల సేవలను ప్రభుత్వం గుర్తించింది అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో ప్రజలకు అందించగలుగుతోందంటే.. కేవలం సచివాలయ వాలంటీర్ల ద్వారానే అని చెప్పవచ్చు. అంతే కాకుండా కోవిడ్ వ్యాప్తి సమయంలో.. ఫ్రెంట్ లైన్ సిబ్బందిగా.. అత్యంత క్లిష్టమైన సమయాల్లో కూడా.. సాహసోపేతమైన సేవాలందించారన్నారు. వాలంటీర్ల విశిష్ట సేవల ద్వారా.. జిల్లాలో 95% పైగా సంక్షేమ పథకాల అమలులో సఫలత సాధించడం జరిగిందన్నారు. అందుకే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కి వాలంటీర్లంటే.. అంత అభిమానం, అంత నమ్మకం, అంత గౌరవం అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా.. వాలంటీర్లు చేస్తున్న స్వచ్చంద సేవలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వారి శ్రమను ప్రశంసిస్తూ.. మూడు రకాలయిన గౌరవ, ప్రోత్సాహక పురస్కారాలను అందించి సత్కరించటం జరుగుతోందన్నారు. ఇందుకోసం.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.55 కోట్లు వెచ్చించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలతో గౌరవిస్తున్నారన్నారు. ఈ రోజు పురస్కారాలు పొందిన వాలంటీర్లు మరింత భాద్యతయుతంగా సేవలను అందిస్తారని, అంతేకుండా ఇప్పుడు అవార్డులు అందులోలేకపోయిన వారు.. అవార్డులు స్వీకరించిన వారిని ఆదర్శనంగా తీసుకొని వచ్చే ఏడాదిలో అవార్డులను అందుకోగలరని ఆశిస్తున్నానన్నారు. ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ లో మన వైఎస్ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని... ఇందుకు కృషి చేసిన వాలంటీర్ల అందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా గ్రామీణ ప్రాంతంలో ముగ్గురికి, పట్టణ ప్రాంతంలో ముగ్గురు చొప్పున 1వ తేదీన త్వరగా పింఛన్లను పంపిణీ చేసిన వాలంటీర్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి కింద పది వేలు, ఐదువేలు, మూడు వేలు రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వాలంటీర్ల అందరూ మరింత బాధ్యతాయుతంగా నిస్వార్థంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం.. సచివాలయ వాలంటీర్లు అని ప్రశంసించారు. రాష్ట్రంలో సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా.. ఒక విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసేదైనా... మంత్రులు విడుదల చేసినా... ఆ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న కీలకమైన వారధులు సచివాలయ వలంటీర్లు అన్నారు. వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. నాయకులు లేని అసలైన సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుని లక్షణం అని... ఆ నానుడిని ఈ రోజు వలంటీర్ల ద్వారా నిజం చేసిన నాయకుడు... మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను ఇంత పటిష్టంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే.. స్వచ్చందంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో వలంటీర్ల కృషి అభినందనీయం అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుని జిల్లా యంత్రాంగం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈనెల 14వ తేదీ నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నానని చెప్పారు. వాలంటీర్లకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి వస్తే.. ముఖ్యమంత్రి కి చేరవేసి.. న్యాయం చేస్తామని ఈ సందర్బంగా ఎంపీ ఆవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కేఎం అన్బురాజన్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ద్వారా గ్రామస్థాయి పన్నులు జరిగేవని, మన ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారం దిశగా అడుగులు పడడం జరుగుతోందని చెప్పారు. గతంలో ఏదైనా సమాచారం కోసం రెవిన్యూ పోలీసు శాఖల పై ఆధారపడే వారని ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా ఆధారపడాల్సి వస్తోంది అన్నారు. మహిళా పోలీసులు, విలేజ్ వాలంటీర్లు సొసైటీలో ఒక మార్పు తేవడానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల పనితీరు ఎంతో గొప్పగా ఉందని, కోవిడ్ వ్యాక్సినేషన్ లో కూడా వాలంటీర్ల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. వాలంటీర్ల ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల వాలంటీర్ల బాధ్యత మరింత పెరిగిందని వారి పరిధిలో విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జీ .చిన్నప్ప లు మాట్లాడుతూ... ఒక మంచి నాయకునికి వచ్చిన గొప్ప ఆలోచనే వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. సమాజంలో మార్పు కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న జగనన్న వారియర్స్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని, ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయం ఐదున్నర గంటలకే అవ్వాతాతలకు పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లు వారి ఆశీస్సులతో మరింత బాగా పని చేయాలని... సమాజంలో మంచి మార్పుకు వాలంటీర్ల వ్యవస్థ ఒక నాంది కావాలన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలో... పులివెందుల మునిసిపాలిటీ, 7మండలాలను కలుపుకొని పనిచేస్తున్న 1491 మంది వాలంటీర్లలో... కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్పి కెకెఎన్ అన్బు రాజన్, మునిసిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ చిన్నప్ప ల చేతుల మీదుగా "సేవా మిత్ర" "సేవా రత్న" "సేవా వజ్ర" విశిష్ట సేవా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఇందులో... “సేవా మిత్ర ' తొలి కేటగిరిలో ఏడాదిపాటు నిరంతరంగా ఎలాంటి ఫిర్యాదు లేకుండా సేవలు అందించిన 1244మంది వాలంటీర్లకు "సేవా మిత్ర" పురస్కారం, బ్యాడ్జ్ తో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందించారు. *"సేవా రత్న" రెండో కేటగిరీలో నియో ప్రతి మండలంలో ఐదుగురు వాలంటీర్ల చొప్పున "సేవారత్న" పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాడ్జ్ , మెడల్ రూ. 20 వేల నగదు బహుమతి అందించారు. "'సేవా వజ్ర" మూడో కేటగిరీలో నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు "సేవా వజ్ర" పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాడ్జ్, మెడల్ తోపాటు రూ.30 వేల నగదు బహుమతి అందజేశారు. చివరగా పులివెందుల మున్సిపాలిటీ అవసరాల నిమిత్తం పాడా నిధులు.. 39 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన వాటర్ సక్షన్ గల్ఫర్ మిషన్ వాహనాన్ని, రూ.17 లక్షల ఖర్చుతో కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను కలెక్టరు, ఎంపి, మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గ గ్రామ వార్డు వాలంటీర్లకు నిర్వహించిన ఈ సత్కార వేడుకలలో పాల్గొన్న ఓఎస్ అనిల్ కుమార్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ నరసింహా రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి మధుసూదన్ రెడ్డి, జెడ్పి సీఈఓ శ్రీనివాసులు రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, అధికారులు, అనధికారులు, గ్రామ వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment