జగన్ రెడ్డి కి లోకేష్ సవాల్...

 సూళ్ళూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట (prajaamaravathi); నారా లోకేష్... *జగన్ రెడ్డి కి లోకేష్ సవాల్...


* *14 న జగన్ రెడ్డి తిరుపతి వస్తున్నారు అని తెలిసింది.ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా* *వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మేము హత్య చేయించాం అని జగన్ రెడ్డి ఆరోపించారు* *14 న వెంకన్న సాక్షిగా ఆ హత్యతో నాకు,నా కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం* *అదే రోజు జగన్ రెడ్డి కి,ఆయన కుటుంబానికి వివేకా గారి హత్యతో సంబంధం లేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసే దమ్ము ఉందా?* జగన్ రెడ్డి 28 తోలుబొమ్మలను పార్లమెంట్ కి పంపారు. మోదీ గారు కనపడగానే ఈ తోలు బొమ్మలు కాళ్ళ మీద పడతాయి 22 తోలు బొమ్మలు లోక్ సభలో,6 తోలు బొమ్మలు రాజ్యసభలో పుదిచ్చేరి కి ప్రత్యేకహోదా ఇస్తాం అని బీజేపీ ప్రకటిస్తే వైకాపా తొలుబొమ్మలు పుదిచ్చేరికి వెళ్లి బిజెపి ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు 28 మంది ఎంపీలు ఎం పీకారు? రాష్ట్ర సమస్యల పై ఎలాగో పోరాడరు.కనీసం నెల్లూరు జిల్లా సమస్యల పై ఒక్క రోజైనా పార్లమెంట్ లో మాట్లాడారా? కృష్ణపట్నం,దుగ్గిరాజపట్నం,రామాయపట్నం పోర్ట్లు,నెల్లూరు ఎయిర్ పోర్ట్ గోవిందా...గోవింద పార్లమెంట్ లో ప్రత్యేకహోదా,విశాఖ ఉక్కు కోసం పోరాడుతుంది ఒక్క టిడిపి ఎంపీలు మాత్రమే మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం గురించి పోరాడే సుదీర్ఘ అనుభవం ఉన్న మన ఇంటి లక్ష్మి గారిని గెలిపించండి జగన్ రెడ్డిది జేసిబి ప్రభుత్వం... జే అంటే జే ట్యాక్స్ ,సి అంటే కటింగ్,బి అంటే బాదుడే బాదుడు నిత్యావసర సరుకులు,రేషన్ సరుకులు,ఇసుక,సిమెంట్,విద్యుత్,పెట్రోల్,డీజిల్,గ్యాస్,ఆర్టీసీ ఛార్జీలు,ఇంటి పన్ను...ఆఖరికి చెత్త,జగన్ బ్రాండ్ లిక్కర్ ధరలు కూడా పెంచేసాడు 1)బాబు గారి హయాంలో సన్ ఫ్లవర్ లీటర్ నూనె రూ. 86 బాదుడు రెడ్డి హయాంలో సన్ ఫ్లవర్ నూనె రూ.200. 2)బాబు గారి హయాంలో కిలో కందిపప్పు రూ. 74 బాదుడు రెడ్డి హయాంలో కిలో కందిపప్పు రూ.140. 3)బాబు గారి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ. 40 బాదుడు రెడ్డి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.67. 4)బాబు గారి హయాంలో రేషన్ షాపులో కిలో పంచధార రూ. 20 బాదుడు రెడ్డి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.34. 5)బాబు గారి హయాంలో కిలో చింతపండు రూ. 114 బాదుడు రెడ్డి హయాంలో కిలో చింతపండు రూ.251. 6)బాబు గారి హయాంలో పెట్రోల్ ధర రూ. 76 బాదుడు రెడ్డి హయాంలో పెట్రోల్ ధర రూ.97 త్వరలో సెంచరీ కొడతాడు. 7)బాబు గారి హయాంలో డీజిల్ ధర రూ. 68 బాదుడు రెడ్డి హయాంలో డీజిల్ ధర రూ.93 8)బాబు గారి హయాంలో గ్యాస్ ధర రూ. 754 బాదుడు రెడ్డి హయాంలో గ్యాస్ ధర రూ.900 త్వరలో వెయ్యి కొడతాడు. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రజల్ని దోచేస్తున్నారు. ఇసుక ని పందికొక్కుల్లా మింగుతున్నారు.బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకదు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1500 ఉంటే ఇప్పుడు జగన్ రెడ్డి గ్యాంగ్ ట్రాక్టర్ ఇసుక రూ.5000 వేలు చేసింది. పేద వాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఎత్తేసాడు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కంపెనీకి ఇసుక అమ్మేసారు.ఒక్క ఇసుక లోనే వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. ఆఖరికి సిమెంట్ ధర కూడా పెంచేసాడు టిడిపి హయాంలో బస్తా సిమెంట్ రూ.250,జగన్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ సిమెంట్ ధర రూ.370కి పెంచింది. మద్యపాన నిషేధం అని సొల్లు కబుర్లు చెప్పి నకిలీ మద్యం అమ్ముతున్నాడు.కేంద్రం మెడలు వంచి హోదా తెస్తా అంటే నిజం అనుకున్నాం తెచ్చాడు స్పెషల్ స్టేటస్ చీప్ లిక్కర్ బాటిల్,బూమ్ బూమ్,గోల్డ్ మెడల్ తెచ్చి అన్ని సాధించాం అంటున్నాడు. మధ్యపాన నిషేధం అంటూ ఏడాదికి 10 వేల కోట్లు దోచేస్తున్నాడు. చెత్త మందు అధిక ధరలకు అమ్ముతూ మహిళల మెడలో పుస్తెలు తెంచుతున్నాడు. కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు. యువకులకు ఉద్యోగాలు వచ్చాయా?ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు.క్యాలెండర్ లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఉద్యోగాల క్యాలెండర్ మాత్రం రావడం లేదు.పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసాడు. టిడిపి హయాంలో 5 లక్షల 16 వేల ఉద్యోగాలు,ఐటీ శాఖ ద్వారా 35 వేలు ఉద్యోగాలు వచ్చాయి అని వైకాపా ప్రభుత్వమే ప్రకటించింది యువకులకు ఒక్క ఉద్యోగం రాలేదు వైకాపా కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు ఆఖరికి నిరుద్యోగ భృతి కూడా తీసేసారు కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తా!కంపెనీలు తెస్తా యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు.జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ వచ్చిందా?ఒక్క ఉద్యోగం ఇచ్చాడా. టిడిపి హయాంలో రాయలసీమ ని ఎలెక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ హబ్ గా మార్చాము.ఫ్యాక్స్ కాన్ ,సెల్ కాన్,డిక్షన్,రిలయన్స్ జియో ,టిసిఎల్,అపోలో టైర్స్,హీరో మోటార్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. మహిళల్ని అర్ధ ఒడి తో మోసం చేసాడు.ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అమ్మ ఒడి అన్నారు.ఇప్పుడు ఒక్క బిడ్డకే అంటున్నారు.అది కూడా కోతలు 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అన్నారు.దాని ఊసే లేదు. అవ్వా,తాతలకు 3 వేల పెన్షన్ అన్నాడు.250 పెంచి ఏడాదికి 9 వేలు,ఐదు ఏళ్లలో 45 వేలు అవ్వా,తాతలకు చెందాల్సిన దొబ్బుతున్నాడు జగన్ రెడ్డి వల్ల సొంత చెల్లెళ్ళకే న్యాయం జరగలేదు. ఒక చెల్లెమ్మ ఢిల్లీ లో న్యాయం కోసం పోరాడుతుంది.ఇంకో చెల్లెమ్మను తెలంగాణకు తరిమేశారు.వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. జగన్ సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ను దారుణంగా చంపేస్తే ఈరోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళలకు జగన్ న్యాయం ఎలా చేస్తాడు. రైతులకు భరోసా అంటూ దగా చేసాడు.12,500 అని 7,500 మాత్రమే ఇస్తున్నాడు.ఏడాదికి 5 వేలు కోత,ఐదేళ్లలో 25 వేలు కోత. విత్తనాలు దొరకవు,ఎరువుల ధరలు పెరిగిపోయాయి.పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు. ముస్లిం సోదరులను దగా చేసాడు జగన్ రెడ్డి.రంజాన్ తోఫా,ఇమామ్, మౌజామ్లకు ఇచ్చే గౌరవ వేతనం,పెళ్లికానుక,విదేశీ విద్య తొలగించారు. జగన్ రెడ్డి కి దళితులు అంటే చిన్న చూపు జగన్ రెడ్డి పేరు మార్చా ఆయన పేరు సైకో రెడ్డి.ఎందుకో తెలుసా ఆయనకు దళితులు అంటే కోపం.5 తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు.దళితుడనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన మీడియా ద్వారా బాధని వ్యక్తం చేసారు. దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్లని సైకో రెడ్డి ఆయన సామజిక వర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్ లో క్షణాల్లో వాలిపోయాడు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబయ్య దళిత నేత చనిపోతే అక్కడికి వెళ్లి శవం పక్కన నిలబడి నవ్వుతున్నాడు. ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు నిలబడాలి,మంత్రి పెద్ది రెడ్డి దర్జాగా కూర్చుంటాడు. అక్రమ మద్యం మాఫియా ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు ఓం ప్రతాప్ ని చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదు అంటూ చీరాల లో దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ ఇసుక మైనింగ్ ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు వర ప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. విశాఖ లో మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్ గారిపై పిచ్చివాడనే ముద్ర వేసారు. చిత్తూరు జిల్లా లో డాక్టర్ అనితా రాణి గారు వైకాపా నాయకుల అవినీతి కి సహకరించలేదు అని బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు. ఇప్పుడు చెప్పండి దళితులను వేధిస్తున్న జగన్ రెడ్డిని సైకో రెడ్డి అనడం తప్పా? సూళ్లూరుపేటలో చిన్న తోలుబొమ్మ ఉంది ఆ బొమ్మ పేరు కిరికిరి సంజీవయ్య గారు.రెండేళ్లలో ఆయన పీకింది ఏంటి?ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు.కనీసం ఒక్క రోడ్డు వెయ్యలేదు సూళ్లూరుపేటలో ల్యాండ్,స్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది టిడిపి హయాంలో నిధులు కేటాయించి 90 శాతం పూర్తయిన తాగునీటి పథకాన్ని కమీషన్ కోసం రెండేళ్ల నుండి ముందుకి కదలకుండా ఆపేసాడు కిరికిరి సంజీవయ్య ఆఖరికి అధికారుల బదిలీల్లో కూడా కమిషన్ కొట్టేస్తున్నాడు కిరికిరి సంజీవయ్య కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు.ఎస్ఈజడ్ లోని కంపెనీలను బెదిరించి 30 కోట్లు కరోనా పేరుతో వసూలు చేసారు 190 కోట్ల తో గ్రామగ్రామానా సిసి రోడ్లు వేసింది టిడిపి ప్రభుత్వం పేదలకు 4 వేల టిడ్కో ఇళ్లు నిర్మించాం. కొంతమంది అధికారులు వైకాపా కి తొత్తులుగా మారి మున్సిపల్ ఎన్నికల్లో బెదిరించి టిడిపి అభ్యర్థులు పోటినుండి తప్పుకునేలా చేసారు. దళిత నాయకుడు రాజేంద్రర్ ని కొట్టి,చొక్కా విప్పి పోలింగ్ రోజు పోలీసులు ఎండలో నిలబెట్టారు చట్టాన్ని అతిక్రమించిన అధికారులు తీవ్రపరిణామాలు ఎదుర్కుంటారు కార్యకర్తలును ఇబ్బంది పెడుతున్నారు.అధికారంలోకి వచ్చాకా వడ్డీతో సహా చెల్లిస్తాం పసుపు జెండా చూస్తే జగన్ కి ప్యాంట్ తడిచిపోతుంది టిడిపి 10 రోజుల ప్రచారానికే జగన్ తిరుపతి పరిగెత్తుకొని వస్తున్నాడు ఇక ఉపఎన్నికల్లో టిడిపి కి ఓటు వేస్తే జగన్ భూమ్మీదకి వచ్చి జనాల కష్టాలు వింటాడు. టిడిపి గెలిస్తే పెట్రోల్ ధరలు ఎలా తగ్గుతాయని దోంగ పత్రిక ఎద్దేవా చేస్తుంది. టిడిపి గెలిస్తే జగన్ అహంకారం తగ్గుతుంది.పెట్రోల్ పై ఆయన విధిస్తున్న 28 రూపాయిల పన్నుని సగానికి తగ్గిస్తాడు. టిడిపి గెలిస్తే ప్రజల పై జగన్ మోపిన పన్నుల భారం తగ్గుతుంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించండి మీ సమస్యల పై పార్లమెంట్ లో పోరాడే శక్తి ఆమెకు ఇవ్వండి.

Comments