కేంద్ర హోం శాఖ నుండి *సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ను సొంతం చేసుకున్న కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది,

డిజిపి కార్యాలయం (prajaamaravathi);కేంద్ర హోం శాఖ నుండి *సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ను సొంతం చేసుకున్న కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది,


జిల్లా ఎస్పీని అభినందించిన డిజిపి గౌతం సవాంగ్ IPS* *మంగళగిరి పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS కి *సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు, 25,000 రూపాయల రివార్డ్ ను అందించిన డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్.* ఇటీవల జరిగిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డిజిపి ల కాన్ఫరెన్స్ లో 2020 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యత్తమ, ఏకైక పోలీసు స్టేషన్ గా కర్నూలు జిల్లా, ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని పెద్దకడుబూరు పోలీసుస్టేషన్ ను ఎంపిక చేసి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంధర్బంగా సోమవారం ఎపి హెడ్ క్వార్టర్స్ విజయవాడ / మంగళగిరిలో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు, 25000 రూపాయల రివార్డ్ ను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారికి అందజేయడం జరిగింది. జాతీయ స్ధాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కర్నూలు జిల్లా పోలీసుశాఖకు గర్వకారణమని, ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ పోలీసింగ్ లో ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి శాంతిబద్రతలను సమార్దవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవలను అందిస్తూ వారి రక్షణ కు బరోసా కల్పించాలని జిల్లా పోలీస్ శాఖను కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డి‌జి శాంతిబద్రతలు రవి శంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు. *ఉత్తమ పోలీసుస్టేషన్ గా ఎంపిక చేయడానికి క్రింద పేర్కొన్న విషయాలను పరిగణలోనికి తీసుకుని ఉత్తమ పోలీసు స్టేషన్ గా అవార్డుకు ప్రకటించిన కేంద్ర హోం శాఖ* 1) నేరాలను ముందస్తుగా నిరోధించడం. 2) నేరాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం. 3) నేరాలను వేగవంతంగా దర్యాప్తు చేసి పరిష్కరించడం. 4) నేరాలను త్వరితగతిన చేధించడం 5) కమ్యూనిటి పోలీసింగ్ . 6) శాంతిభద్రతలను పరిరక్షించడం. 7) శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క వ్యవహార శైలి గురించి మరియు ప్రజల నుండి రాబడిన స్పందన ( ఫీడ్ బ్యాక్) గురించి. 8) నేర సమాచారం ను ఎప్పటికప్పుడు CCTNS నందు అప్ లోడ్ చేసి డేటా ను భద్రపరచడం. 9) మహిళలపై జరిగే నేరాల గురించి మరియు షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగల ప్రజల పై మరియు ఆస్తులకు సంబందించిన నేరాలపై ప్రజలలో కనీస అవగాహన కల్పించడం , వాటిని నియంత్రించడం. 10) పై విషయాలన్నింటిని పరిగణలోనికి తీసుకుని వాటికి సంబందించి ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడం, చార్జీషీట్ లు దాఖలు చేయడం వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పెద్దకడుబూర్ పోలీసుస్టేషన్ ను ఉత్తమ పోలీసుస్టేషన్ గా ఎంపిక చేయడం జరిగింది.

Comments