ఫోన్ ద్వారా వినతుల స్వీకరణ సోమవారం నాటి స్పందన కార్యక్రమం రద్దు విజయనగరం, ఏప్రెల్ 16 (prajaamaravathi) ః కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా, ఈ నెల 19న సోమవారం నుంచి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. దీనికి బదులుగా ఆరోజు ఫోన్ ద్వారా వినతుల స్వీకరణ జరుగుతుందని, నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. అందువల్ల అర్జీదారులు కలెక్టర్ కార్యాలయానికి రాకుండా, ఆరోజు ఉదయం 10 నుంచి 1 గంట మధ్య 08922-276712, 08922-276713 నెంబర్లకు ఫోన్ చేసి, తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. ఫోన్‌లో తెలియజేసిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. .
ఫోన్ ద్వారా వినతుల స్వీకరణ సోమవారం నాటి స్పందన కార్యక్రమం రద్దు
addComments
Post a Comment