పనిచేసే లక్ష్మీని పార్లమెంటుకు పంపుదాం.

 సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు (ప్రజా అమరావతి);


పనిచేసే లక్ష్మీని పార్లమెంటుకు పంపుదాం.


సైకోరెడ్డి ప్రభుత్వంలో పేదోడికి ఇళ్లిచ్చే పరిస్థితి లేదు.

పెరిగిన విద్యుత్ చార్జీలు,పన్నులు,నిత్యవసరాల ధరలు  తగ్గాలంటే సైకిల్ ఓటేయాలి.

మా కార్యకర్తల పై కేసులు పెట్టి వేధిస్తే వడ్డీతో సహా తీరుస్తాం

-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్


సైకోరెడ్డి ప్రభుత్వంలో పేదోడికి ఇళ్లు ఇచ్చే  పరిస్థితి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర ధరలు తగ్గాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పెద్దపిల్లి వుంది..దానికి తోడు ఢిల్లీలో 28 చిన్న పిల్లులున్నాయి. 22 పిల్లులు లోక్ సభలో, 6 పిల్లులు రాజ్యసభలో ఉన్నాయి. మోడీని చూస్తే మ్యావ్ అని అంటాయి. రాష్ట్రంలో ఉన్న పెద్దపెల్లి మోడీ దగ్గర వంగి మ్యావ్ అని తలవంచుతుంది. మరో పిల్లిని ఢిల్లీకి పంపిస్తామా? పుదుచ్చేరిలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా పెట్టారు. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పుదుచ్చేరిలో బీజేపీ అభ్యర్థిని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి వెన్నుపోటు కాదా? ఈ 28 పిల్లులు ఏపీకి ఒక్క పనైనా చేశాయా? కృష్ణపట్నం, దుగరాజుపట్నం, రామాయపట్నం పోర్టు, నెల్లూరు ఎయిర్ పోర్టు గోవింద అయింది. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పనబాక లక్ష్మీ పని చేశారు.  మన ఇంటి లక్ష్మి, పని తెలిసిన లక్ష్మీని పార్లమెంటుకు పంపుదాం. ఇంటికి ఎవరైనా వస్తే బాగున్నారా? అని అడగటం బదులు.. బతికున్నారా? అని అడగాల్సిన స్థితి రాష్ట్రంలో ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేజీ నూనె రూ.86 ఉంటే బాదుడురెడ్డి సీఎం అయ్యాక రూ.200, వేరుశనగ నూనె గతంలో రూ.90 వుంటే బాదుడురెడ్డి సీఎం అయ్యాక రూ.175  అయింది. రూ.70 లు ఉన్న కందిపప్పు రూ.140 అయింది. రేషన్ షాపులో కందికప్పు చంద్రబాబు రూ.40లకే ఇస్తే బాదురురెడ్డి రూ.67లు చేశాడు. చింతపండు ఒకప్పుడు కిలో రూ.170 వుంటే ఇప్పుడు రూ.250 చేశారు. నాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి నుండి రెండువేలు ఉంటే.. బాదుడురెడ్డి సీఎం అయ్యాక రూ.5 వేలు అయింది.  ఏపీలో ఇసుక దొరకని పరిస్థితి వుంది. ఏపీ ఇసుక చెన్నై, బెంగళూరులో, హైదరాబాదులో దొరుకుతోంది. జగన్ ప్రత్యేక హోదా తెచ్చాడని ఓ యువకుడు చెప్తే అవునా అనుకున్నా.. క్వార్టర్ బాటిల్ పేరు ప్రత్యేక హోదా. బూమ్ బూమ్ బీరు, ప్రెసిడెంట్ మెడల్ రాష్ట్రానికి తెచ్చారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేదం అని ఇప్పుడు ఏటా పదివేల కోట్లు పేదల నుండి దోచుకుంటున్నారు. సిమెంట్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. అర్థవడి, పెన్షన్ పేరుతో ఎడమ చేత్తే రూ.10 ఇచ్చి కుడిచేత్తో వందలాక్కుంటున్నాడు. ఒక్క ఉద్యోగమైనా, పరిశ్రమైనా వచ్చిందా.? చంద్రబాబు ప్రతివారం ఒక పరిశ్రమను తెచ్చారు. హీరో, సెల్కాన్, ఫాక్స్కార్న్ వంటి సంస్థలను తెచ్చి వందలాది ఉద్యోగాలు కల్పించారు. ప్రతి ఏటా డీఎస్సీ పెడతానని జగన్ రెడ్డి ఒక్కటన్నా పెట్టారా? విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వని బాదుడు రెడ్డిని ఏంచేయాలి.? అమ్మఒడి అందరికీ ఇస్తానని ఒక్కరికే ఇస్తున్నారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మాట దాటేశారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్ రెడ్డి సామాన్యులకు న్యాయం చేస్తారా? పాదయాత్రలో రైతు భరోసా రూ.12,500 ఇస్తానని గద్దెనెక్కాక రూ.7,500 ఇస్తున్నాడు. ఐదేళ్లలో ప్రతి రైతు దగ్గర రూ.25 వేలు దొబ్బుతున్నారు. విత్తనాలు దొరకడం లేదు, పొలం మందులు విపరీతంగా పెరిగాయి. అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతూ వెళ్తానని ప్రతి అవ్వాతాతల దగ్గర ఐదేళ్లలో రూ.45వేలు ఎగ్గొడుతున్నాడు. బాదుడురెడ్డికి దళితులంటే గౌరవం లేదు. బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం వారి ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. సొంత సామాజికవర్గానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే ప్రత్యేక విమానంలో వెళ్లి పరామర్శించారు. బద్వేలులో దళిత ఎమ్మెల్యే చనిపోతే నవ్వుతూ దండం పెట్టాడు. టీటీడీ కార్యక్రమంలో నారాయన స్వామి చేతులు కట్టుకుని నిల్చోబెట్టారు. ఇదేనా మీరు దళితులకు ఇచ్చే గౌరవం.? విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చోడిని ముద్ర వేశారు. గంగాధర్ నెల్లూరులో అనితారాణి మెడికల్ స్కామ్ జరుగుతుందంటే ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. మద్యం మాఫియాపై పుంగనూరులో దళిత యువకుడు ప్రశ్నిస్తే దారుణంగా చంపారు. కిరణ్ అనే దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపితే స్పందనే లేదు. అందుకే జగన్ రెడ్డిని.. సైకోరెడ్డి అని పిలవాలి. ఈ సైకోరెడ్డికి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చంది. నెల్లూరులో ఎంపీలు, మంత్రులు వైన్, మైన్ తో పందికొక్కుల్లా తింటున్నారు. అవినీతికి కన్న కొడుకు జగన్ అయితే..పెంచిన కొడుకు కాకాని గోవర్థన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో రూ.500 కోట్లు వైసీపీ నాయకులు కాజేశారు. జైపాల్ అనే దళిత రైతు పారాడితే అట్రాసిటీ కేసు పెట్టి జైళ్లో పెట్టారు. గెలిచిన వెంటనే తీసుకొస్తానన్న ఫిషింగ్ హార్బర్ ఏమైంది గోవర్థన్ రెడ్డి? పోర్టు నిర్వాసితులకు ఇచ్చే డబ్బులు రానివ్వకుండా నాడు అడ్డుపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది... ఇప్పటి దాకా ఏం చేశారు.? దొంగ పనులు, కేసుల్లో నెంబర్ వన్ గా మారారు. అక్రమ కేసులతో మమ్మల్ని ఏమీ చేయలేరు. రూ.43 వేల కోట్లు అక్రమంగా దోచుకుని 16 నెలలు జైళ్లో ఉన్నారు. 2014 నుండి 19 వరకు టీడీపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.  ఒక్క సూల్లూరుపేటలోనే 13,526 ఎన్టీఆర్ గృహాలను నిర్మించాం. పేదోడికి ఇళ్లిచ్చే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా వున్నప్పుడు సీఎం రిలీఫ్ పండ్ పది కోట్లు తీసుకొచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.235 కోట్లు తీసుకొచ్చి సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి రోడ్లు వేయించారు. పెరిగిన విద్యుత్ చార్జీలు, నిత్యవసర వస్తువులు  తగ్గాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. తిరుపతి ఉప ఎన్నిక నుండి మార్పు రావాలి. తిరుపతిలో పనబాక లక్ష్మీ గెలిస్తే జగన్ రెడ్డి కిందకు దిగొస్తారు. అధికారులకు ఇస్తానన్న డీఏ, పీఆర్సీ, సీపీఎస్ రద్దు ఏమయ్యాయి.?  చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అతిక్రమిస్తే వడ్డీతో సహా తిరిగి ఇస్తాం. చంద్రబాబుకు పెద్దమనుసు వుండి వదిలేసినా.. మేము మాత్రం వదిలిపెట్టం. కార్యకర్తలపై దొంగ కేసుల పెడితే పోలీస్ స్టేషన్ కు వచ్చి నేనే పోరాడతా. సింహం లాంటి పనబాక లక్ష్మీని పార్లమెంట్ కు పంపించాలని కోరుతున్నా’’ అని ప్రసంగించారు.

Comments