కరోనా కట్టడి కి భాద్యాతా యుతమైన పౌరులు గా విధి గా మాస్క్ ధరిద్దాం* *మాస్కే కవచం, 

 కరోనా కట్టడి కి భాద్యాతా యుతమైన పౌరులు గా విధి గా మాస్క్ ధరిద్దాం* *మాస్కే కవచం,


మాస్కు సరిగా పెట్టు- కరోనా ఆట కట్టు* *ఆరడుగుల దూరం కరోనా నీకు దూరం* *చేతులు శుభ్రం -ఆరోగ్యం భద్రం:జిల్లా కలెక్టర్* చిత్తూరు, ఏప్రిల్ 7 (prajaamaravathi): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 15 రోజుల పాటు చేపట్టిన మాస్కే కవచం ఐ.ఈ.సి అవగాహన ముగింపు కార్యక్రమాల సంధర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంను చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. బుదవారం సాయంత్రం స్థానిక జిల్లా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మార్చి 24 నుండి 15 రోజుల పాటు చేపట్టిన మాస్కే కవచం ఐ.ఈ.సి అవగాహన ముగింపు కార్యక్రమం లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 24 నుండి 15 రోజుల పాటు చేపట్టిన మాస్కే కవచం ఐ.ఈ.సి అవగాహన కార్యక్రమం లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరూ కోవిడ్ కట్టడికి తమ వంతుగా మాస్కు ను ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ సానిటైజేషన్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియలాగా ప్రతి ఒక పౌరుడు బావించాలని భవిష్యత్తులో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. కొవ్వొత్తులు వెలిగించి కరోనా వైరస్ కట్టడి చేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్( సంక్షేమం) రాజశేఖర్, డి.ఎం&హెచ్.ఓ డా.పెంచలయ్య,డి ఐ ఓ హనుమంత రావు, డెమో నిర్మలమ్మ, స్వయంసహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. 

Comments