రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీమతి నీలం సాహ్ని, IAS (Rtd) గార్ని మర్యాదపూర్వకంగా వారిని రాష్ట్ర ఎన్నికల

 AP JAC అమరావతి (ప్రజా అమరావతి);


నేడు 01/04/21 న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీమతి నీలం సాహ్ని, IAS (Rtd) గార్ని మర్యాదపూర్వకంగా వారిని రాష్ట్ర ఎన్నికల


కమిషన్ గారి కార్యాలయంలో AP JAC అమరావతి పక్షాన ఛైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వై వి రావు, కోశాధికారి వి వి మురళీకృష్ణ నాయుడు, కో ఛైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్, బి కిషోర్ కుమార్ తదితరులు కలిసి నూతనంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వం సమన్వయం తో పనిచేసి ఇటీవల పంచాయతీ మరియు మునిసిపల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.


అదేవిధంగా ఈ రోజు నుంచి 45 సం11లు దాటిన వారందరికీ వార్డు సచివాలయాల ద్వారా కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ గౌ11ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన సందర్భంలో, మరల MPTC/ZPTC (గ్రామ స్థాయిలో) ఎన్నికల నిర్వహణ చేయవలసి ఉన్నందున, గ్రామ సచివాలయాల ద్వారా కూడా వేగవంతంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికి త్వరితగతిన వాక్స్సేషన్ ప్రక్రియ పూర్తి చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయవలసినదిగా SEC గారిని AP JAC అమరావతి పక్షాన కోరడమైనది..


బొప్పరాజు & వై వి రావు..

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image