శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);.
ప్రతి రోజూ 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం.
రాబోయే 45 రోజుల్లో 300 నుంచి 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుతాం.
ఆక్సిజన్ తయారు చేసే పరిశ్రమలకి కొత్త ప్రోత్సాహకాలు అందిస్తాం.
ఆక్సిజన్ యూనిట్లను నెలకొల్పే పరిశ్రమలకు ఫీజులలో రాయితీలు.
ఆక్సిజన్ పాలసీ తీసుకువస్తాం.
గూడూరు ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి గౌతమ్ రెడ్డి.
త్వరలో నెల్లూరు జిల్లాలో ఆక్సీజన్ ఉత్పత్తిచేసే కొత్త ప్లాంట్.
ఇప్పటికే మనుగడలో లేని రెండు ఆక్సిజన్ ప్లాంట్ లను పునరుద్ధరించాం.
పెరుగుతున్న కరోనా కేసులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు, చర్యలు.
కొత్త టెక్నాలజీ ద్వారా కోవిడ్- 19 ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం.
హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కొత్త టెక్నాలజీ.
హెచ్2ఓ2 ద్వారా ఆక్సిజన్ ని తయారు చేయబోతున్న విశాఖలోని మెడిటెక్ జోన్.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన.
జిల్లా జిజిహెచ్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 50 జర్మన్ హాంగర్స్ బెడ్లను ప్రారంభించిన మంత్రి మేకపాటి
ఈ 50 పడకలకూ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లనూ అమర్చగలిగాం.
ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల సౌజన్యంతో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆక్సిజన్ రథచక్రాలను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మరో ఆక్సిజన్ రథచక్రాల బస్సును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.
ఆక్సిజన్ రథచక్రాల పేరు తో తయారైన బస్సుని పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి.
ఉచిత కోవిడ్ పరీక్షలను నిర్వహించే కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా మంత్రులు మేకపాటి ,అనిల్ కుమార్ యాదవ్.
ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మహిళ ఇబ్బందికర పరిస్థితిని గమనించి ఏమైందమ్మా? అని పలకరించిన మంత్రి మేకపాటి.
మంత్రి స్పందనతో తన భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఉందని, చికిత్సకు బెడ్ కూడా అందుబాటులో లేదని విలపిస్తూ విన్నవించిన మహిళ.
మహిళా ఆవేదనకు చెల్లించిన జిల్లా మంత్రులు వెంటనే ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి అప్పటికప్పుడు బెడ్ సౌకర్యం అందించే ఏర్పాటు చేసిన వైనం.
ఆపద సమయానికి స్పందించి ఆదుకున్న మంత్రులకు కృతజ్ఞతగా దండం పెట్టి వెళ్లిన మహిళ.
అనంతరం అక్కడి నుంచి గూడూరు మండలం చెన్నూరు గ్రామ పర్యటనకు వెళ్ళిన పరిశ్రమల శాఖ మంత్రి.
గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
వ్యాక్సిన్ ఇస్తున్న తీరును దగ్గరుండి పరిశీలించిన మంత్రి మేకపాటి.
మంత్రి మేకపాటితో పాటు కార్యక్రమానికి హాజరైన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ మరియు డీఎమ్ హెచ్ఓ అచ్యుతకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.*
అనంతరం చిల్లకూరు మండలం బోదనం వద్ద ఆక్సిజన్ ప్లాంట్ ని ప్రారంభించిన జిల్లా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.
ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతున్న తీరును పరిశీలించిన పరిశ్రమల శాఖ మంత్రి.
గూడూరు ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరు జిల్లాకి హార్ట్ బీట్.
గూడూరు ఆక్సిజన్ ప్లాంట్ ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు.
ఇవాల్టి నుంచి గూడూరు ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 440 సిలిండర్లు అందుబాటులోకి.
కొవిడ్-19 సోకిన వారిని కాపాడుకోవడంలో ప్రతిక్షణం అప్రమత్తత ముఖ్యమని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే స్ఫూర్తి.
addComments
Post a Comment