104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థ బలోపేతంగా నడవాలి: సీఎం

 

అమరావతి (ప్రజా అమరావతి);.


*కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ çసమావేశం*

*కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సమీక్ష*


104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థ బలోపేతంగా నడవాలి: సీఎం


అ«ధికారులు ప్రతిరోజూ మాక్‌ కాల్స్‌ చేసి ఆ వ్యవస్థ పని తీరును పర్యవేక్షించాలి

రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచండి:

ఆక్సిజన్‌ సహా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించండి:

104కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలి:

అవసరమైన వారికి వెంటనే బెడ్‌ కల్పించాలి:

104కు కాల్‌ చేస్తే ఫోన్‌ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు:

104కు కాల్‌ చేసిన తర్వాత కోవిడ్‌ బాధితులకు కచ్చితంగా సహాయం అందాలి:

బెడ్‌ అవసరం లేదు అన్నవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలి:

నిర్ణయించుకున్న ఆస్పత్రుల్లో జర్మన్‌ హేంగర్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి:

దీని వల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తప్పుతాయి,

అంతే కాక సత్వరమే వారికి వైద్యం అందుతుంది:

కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:


104 వ్యవస్థ పటిష్టంగా పని చేయాలి, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి

ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలి:

ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి ఆస్పత్రిలో కూడా నంబర్‌ డిస్‌ ప్లే చేయాలి:


*వ్యాక్సినేషన్‌పై వాస్తవాలు చెప్పాలి:*

వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి:

వ్యాక్సినేషన్‌ అనేది అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది:

రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోంది:

ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంది:

కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అది కూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది:

వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు.*దురుద్దేశంతో దుష్ప్రచారం:*

అయినా, ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది.

దురుద్దేశంతో ఆ ప్రచారాలు చేస్తున్నారు. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని సృష్టిస్తున్నారు.

కాబట్టి వాస్తవ పరిస్థితులన్నింటినీ ప్రజలకు వివరించాలి.

అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి:


*వ్యాక్సిన్‌ సేకరణ కోసం:*

నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోంది:

ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయి:

వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలన్న సీఎం

అధికారులు అంతా కూర్చుని దీనిపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశం.


*వ్యాక్సీన్ల సరఫరా:*

వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు:

వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్పష్టంగా చెప్పాలి:

దీనివల్ల వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు:

వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునే వారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి:

45 ఏళ్లకు పైబడి మొదటి డోస్‌ తీసుకుని, రెండో డోస్‌కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలి:

అలా చేయకపోతే (వారికి రెండో డోస్‌ అందకపోతే) తొలి డోస్‌ వేసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి, 45 ఏళ్లు పూరై్తన వారిలో తొలి డోస్‌ వేసుకున్న వారందరికీ, తప్పనిసరిగా రెండో డోస్‌ ఇవ్వాలి.

అందువల్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ఇప్పుడు వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.

వారందరికీ వ్యాక్సిన్‌ పూరై్తన తర్వాత 18 ఏళ్లకు పైబడిన వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ ఇవ్వాలి.


కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చిన వ్యాక్సీన్లు, రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న వ్యాక్సిన్ల వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు.


*రాష్ట్రానికి కొవీషీల్డ్‌ డోస్‌లు మొత్తం 60,60,400 రాగా, తొలి డోస్‌ కింద 43,99,802, రెండో డోస్‌ కింద 16,87,315 ఇచ్చామని, ఆ విధంగా    మొత్తం 60,87,117 డోస్‌లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.*

*అదే విధంగా కొవాక్సిన్‌ మొత్తం 12,89,560 రాగా. వాటిలో   తొలి డోస్‌ కింద 9,23,296 వ్యాక్సీన్లు, రెండో డోస్‌ కింద 2,90,047 వ్యాక్సీన్లు.. మొత్తం 12,13,343 కోవాక్సిన్‌ డోస్‌లు ఇచ్చామని అధికారులు చెప్పారు.*


*ఆ మేరకు కోవీషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి మొత్తం 73,49,960 రాగా, తొలి డోస్‌ కింద 53,23,098 వ్యాక్సిన్లు, రెండో డోస్‌ కింద 19,77,362 వ్యాక్సిన్లు.. రెండూ కలిపి ఇప్పటి వరకు మొత్తం 73,00,460 వ్యాక్సీన్లు ఇచ్చినట్లు వారు వివరించారు.* 


*ఇక 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 1,33,07,889 మంది నమోదు చేసుకోగా వారిలో తొలి డోస్‌ను 41,08,917 మందికి, రెండో డోస్‌ను 13,35,744 మందికి ఇవ్వడం జరిగిందన్న అధికారులు*


*ఇంకా ఈ మే నెలలో తొలి 15 రోజులకు సంబంధించి కోవిషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం, ఇప్పటి వరకు 7,65,360 వాక్సిన్‌ డోస్‌లు ఇచ్చిందని, ఇంకా 1,52,490 డోస్‌లు రావాల్సి ఉందని చెప్పారు.*


*మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కింద కేంద్ర నిర్ణయించిన ప్రకారం 16,85,630 వ్యాక్సీన్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 4,93,930 మాత్రమే ఇచ్చారని, ఇంకా 11,91,700 వ్యాక్సీన్లు రావాల్సి ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు.*


*మందుల కిట్‌లు:*

జ్వరం వస్తే దాన్ని కోవిడ్‌ లక్షణంగా చూసి, వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్న వైద్య నిపుణులు

ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

ఇంట్లో చికిత్స పొందాల్సిన రోగికి 3 గంటల్లోగా కిట్‌ పంపాలని సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.


*ఆక్సీజన్‌:*

కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు. 

ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం. సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.

కాగా, రాష్ట్రానికి 590 మెట్రిక్‌ టన్నుల కేటాయించగా, ఈనెల 8న 571 టన్నులు తీసుకున్నామని

కనీసం 10 ఐఎస్‌ఓ క్రయోజనిక్‌ ట్యాంకర్లు కేటాయించాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరామని, తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా ఆక్సీజన్‌ కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

తమిళనాడు నుంచి కనీసం 60 మెట్రిక్‌ టన్నులు, కర్ణాటక నుంచి 130 మెట్రిక్‌ టన్నులు ఆక్సీజన్‌ వస్తే కనీస అవసరాలు తీరుతాయని వారు వివరించారు.


*బ్లాక్‌ మార్కెటింగ్‌ అరికట్టాలి:*

రెమ్‌డిసవెర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మాక్కెటింగ్‌ను అరికట్టాలని సీఎం ఆదేశం

దీనిపై ఆడిట్‌ తప్పనిసరిగా ఉండాలన్న సీఎం

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్‌ ఉండాలన్న సీఎం

ఆస్పత్రుల్లో అవసరమైన ఇంజక్షన్లు రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట రోగులను దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట  వేయాలని సీఎం ఆదేశం


*కోవిడ్‌ – కర్ఫ్యూ:*

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం ఆదేశం

నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం ఆదేశం

జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం ఆదేశం

క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతున్నందన్న సీఎం

ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలన్న సీఎం 


కాగా, రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు.


*ఆస్పత్రులు–బెడ్లు:*

రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్‌ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా, వాటిలో 39,271 బెడ్లు ఆక్యుపైడ్‌ అని అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఇక ఐసీయూలో 6789 బెడ్లు ఉండగా, 6317 ఆక్యుపైడ్‌ అని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అన్నది లేదని, అన్నీ ఎంప్యానెల్‌ లేదా తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రులు అని సమీక్షలో అధికారులు చెప్పారు. 

102 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా, వాటిలో 15,107 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని వారు వివరించారు.


*హ్యూమన్‌ రిసోర్స్‌ (హెచ్‌ఆర్‌):*


కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ కోసం మొత్తం 20,793 మంది నియామకానికి ఆమోదం తెలపగా, ఇప్పటి వరకు 17,901 మంది నియామకం జరిగిందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌కు చెందిన దాదాపు 3500 మందిని తాత్కాలికంగా విధుల్లో నియమిస్తున్నామని వారు తెలిపారు.


డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Comments