సర్వే ద్వారా 11,504 జ్వరపీడితులను గుర్తించాం.


విజయవాడ (ప్రజా అమరావతి);


సర్వే ద్వారా 11,504 జ్వరపీడితులను గుర్తించాం.4,776 శాంపిల్స్ రిపోర్టు రాగా, వారిలో 385 మందికి పాజిటివ్ నిర్ధారణ


జిల్లా లో ఇప్పటి వరకు 6,66,576 వ్యాక్సిన్ వెయ్యడం జరిగింది


గత రెండు వారాల్లో 5,791 మంది హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాము.ఈరోజు 1565


4,410 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు - 


ఆక్సీజన్ బెడ్లు 745,నాన్ ఆక్సీజన్ 2,095,జనరల్ 1801


కలెక్టర్ ఇంతియాజ్


కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణ కోసం రెవిన్యూ, పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్నట్లు జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.


మంగళవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి  అశోక్ కుమార్ సింఘాల్  కృష్ణాలో కోవిడ్ పై జూమ్ ద్వారా సమీక్షించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ , జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, టెస్టులు, వ్యాక్సినేషన్ , బెడ్స్, ఆక్సిజన్ తదితర అంశాలపై వివరాలు అందచేశారు.  సర్వే ద్వారా 11,504 మంది జ్వర పీడితులను గుర్తించమన్నారు.ఈరోజు 4,776 నమూనా లు రిపోర్టు రాగా, వాటిలో 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. జిల్లాలోని 76 కోవిడ్ ఆసుపత్రులలో 4,410 బెడ్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వాటిలో 745 ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ , 2095 ఐసీయూ విత్  నాన్ ఆక్సిజన్ బెడ్స్ , 1801 సాధారణ బెడ్స్ పై భాదితులకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా జిల్లాలో 231 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.  వాటిలో నాన్ ఐసీయూ, జనరల్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు మొత్తం 5,791మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్నారని, వారికి ఉచితంగా కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.  ఈ రోజు 1565 మందికి హోమ్ ఐసోలెషేన్ కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. రెడ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా ప్రజలను గుర్తించే వ్యాక్సినేషన్  ప్రక్రియను వేగవంతం చెయ్యడం జరుగుతున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ ఓ డా.ఎం.సుహాసిని, జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.