విజయవాడ/ ఇబ్రహీంపట్నం (ప్రజా అమరావతి);
జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్ ద్వారా 12.7 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి...
ఎల్. శివశంకర్
జిల్లాలో నిరుపయోగంగా ఉన్న రెండు ఆక్సిజన్ ప్లాంట్స్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి కి చొరవ చూపుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, కోవిడ్ నోడల్ అధికారి ఎల్. శివశంకర్ పేర్కొన్నారు.
ఆదివారం కొండపల్లి వద్ద ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశ్రమ శాఖ ఇంచార్జి జీఎం జి. సుదర్శన్ తో కలిసి జేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ మాట్లాడుతూ, కరోన స్ట్రెయిన్ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే జిల్లాలో గతంలో పనిచేసి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న వాటి వివరాలుజిల్లా పరిశ్రమ శాఖ ద్వారా గుర్తించడం జరుగుతోందన్నారు. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో కృష్ణా మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంట్, హరి గ్యాస్ ప్లాంట్ లను సందర్శించా మన్నారు. వీటిని ఉపయోగంలోకి తీసుకుని రావడం వల్ల స్థానిక అవసరాలను కొంతమేర పూడ్చుకోవచ్చని తెలిపారు. కృష్ణా ప్లాంట్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించడానికి తక్షణమే రిపేర్లు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం సాంకేతిక సిబ్బంది తో పనులను చేపట్టడం ప్రారంభించామని, రెండు మూడు రోజుల్లో ఈ ప్లాంట్ ద్వారా 2.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి రానున్నది తెలిపారు.
ఇదే ప్రాంతంలో మూసివేసి ఉన్న హరి గ్యాస్ ఏజెన్సీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు ప్రారంభిస్తున్నామని జేసి శివశంకర్ తెలిపారు. హరి గ్యాస్ సంస్థ ద్వారా ప్రతి రోజు 10 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ రెండు ప్లాంట్ లను అందుబాటులో తీసుకుని వొచ్చేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారన్నారు. జిల్లా యంత్రాంగం కృషి వలన గత 4 రోజుల్లో వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్ ను
ఈ పర్యటన లో జేసి ఇంబ్రహీంపట్నం కొండపల్లి లో జెసి పర్యటించి సంబంధించిన అధికారులకు ఆదేశాల ను జారీచేశారు.
addComments
Post a Comment