బెంగళూర్ నుండి తిరుపతి వచ్చిన 16 టన్నుల ఆక్సీజన్ ట్యాంకర్ వాహనానికి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు.

 తిరుపతి (ప్రజా అమరావతి) :


- బెంగళూర్ నుండి తిరుపతి వచ్చిన 16 టన్నుల ఆక్సీజన్ ట్యాంకర్ వాహనానికి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు.- జిల్లా సరిహద్దునుండి ఎలాంటి ఆటంకం కలగకుండా వాహనానికి ఎస్కార్ట్ తో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి తీసుకొచ్చిన జిల్లా పోలీసులు.- కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా ఎయిర్ వాటర్ ఫ్యాక్టరీ నుండి తిరుపతి చేరిన ఆక్సీజన్ ట్యాంకర్ వాహనం- తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకటప అప్పల నాయుడు ప్రత్యేక చొరవతో నిరంతర పర్యవేక్షణలో మార్గమధ్యంలో అంతరాయం కల్గకుండా, ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం.- తిరుపతి నగరంలోని  ప్రభుత్వ స్విమ్స్ ఆసుపత్రికి  సరఫరా కావాల్సిన ఆక్సీజన్ ట్యాంకర్ ను కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా ఎయిర్ వాటర్ ఫ్యాక్టరీ నుండి వచ్చిన వాహనానికి పోలీసులు ఎస్కార్ట్ తో ఆదివారం మద్యాహ్నం స్విమ్స్ ఆసుపత్రికి  తీసుకొచ్చారు


. మార్గ మధ్యంలో ఎలాంటి అంతరాయం కల్గకుండా, ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం అందించారు. 


జి.పి.ఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్ తో ఆక్సిజన్ ట్యాంకర్ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

 

- వాహనానికి ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తూ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి సకాలంలో స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే విదంగా జిల్లా యస్ పి గారు ప్రత్యేక శ్రద్ద తీసుకోని బద్రతా ఏర్పాట్లు చేసారు, చెక్ పోస్ట్ ల వద్ద ముందస్తు గా సిబ్బంది ని అప్రమత్తం చేస్తూ బారికేడ్ లను తొలగించడం ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనం వేగంగా వెళ్లేందుకు పోలీసులు ముందస్తు జాగ్రతలు తీసుకున్నారు. 


అలాగే తిరుపతి అర్బన్ జిల్లా మీదుగా ఇతర జిల్లాలకు వెళ్ళే ఆక్సీజన్ ట్యాంకర్లకు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సురక్షితముగా సంబందిత జిల్లాలకు చేరే విదంగా ఏర్పాట్లు జిల్లా పోలీసులు చేస్తున్నారు.