రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ పరంగా 16 వైద్య కళాశాలలు శంఖుస్థాపన చేసుకోవడం చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.

        అమలాపురం, 31 మే (ప్రజా అమరావతి);

   రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ పరంగా 16 వైద్య కళాశాలలు శంఖుస్థాపన చేసుకోవడం చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.


       సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం నుండి ఉపముఖ్యమంత్రివర్యులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి 14 మెడికల్ కళాశాలలతో పాటు, నర్సింగ్ కళాశాల భవనాలకు సంబంధించి వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు, పండుల రవీంద్రబాబు, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, మాల కార్పొరేషన్ చైర్మన్ పి.అమ్మాజీ, ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ, అమలాపురం సబ్ హిమాన్షు కౌశిక్ లు మెడికల్ కళాశాల శంఖుస్థాపన చేసే ఆవరణ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ కేవలం రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్న తరుణంలో పేదవాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందించాలని సత్ సంకల్పంతో 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శంఖుస్థాపన చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించడమే కాకుండా వాటికి వేగంగా టెండరింగ్, స్థల సేకరణ లాంటివి పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. డిసెంబర్ 2023 నాటికి ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల స్థాపన అనేది ఈ ప్రాంత వాసులకు చిరకాల స్వప్నమన్నారు. అలాంటి చిరకాల స్వప్నాన్ని కోనసీమ ప్రజానీకానికి అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల మనసుల్లో నిలుస్తారన్నారు. కోనసీమ ప్రాంతవాసులు అత్యవసర చికిత్సలకు కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి వుండేదన్నారు.  475 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఈ వైద్య కళాశాల రావడం వలన ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, గన్నవరం, కొత్తపేట ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఎక్కువగా ఎస్సి, ఎస్టీ, మత్స్యకారులు నివాసం వుండే కోనసీమ ప్రజానీకానికి మంచి వైద్య సేవలు అందడంతో పాటు  వర్తక, వాణిజ్య కేంద్రంగా కోనసీమ అభివృద్ధి చెందుతుందని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.

        వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో విద్య, వైద్యం,వ్యవసాయ, సంక్షేమ రంగాలకు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను పైనుండి కిందిస్థాయి వరకు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తెచ్చే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాలతో బాటు నర్సింగ్ కళాశాలను నిర్మించి ఆ ప్రాంత వాసులకు కార్పోరేట్ తరహా వైద్యం అందించాలనే సంకల్పంతో ఒకేసారి 14 వైద్య కళాశాలలకు శంఖుస్థాపన చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఇప్పటికే రెండు కళాశాలలకు శంఖుస్థాపన చేసుకుని, పనులు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. రాజకీయాలకు కుల, మతాలకు అతీతంగా గత రెండు సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు కింద ఒక లక్ష 25 వేల కోట్ల రూపాయలను ఆయా వర్గాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక లబ్దిని వేయడం ముఖ్యమంత్రి పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

         జిల్లా ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ 15 లక్షల జనాభా కలిగిన కోనసీమ ప్రాంత వాసులకు వైద్య కళాశాల శంఖుస్థాపన  చేయడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ ప్రాంతాలకు మెడికల్ కళాశాల రావడం కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్ళవలసిన అవసరం ఉండదని జాయింట్ కలెక్టర్ అన్నారు.

       కోనసీమలో నివసించే కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాల కోసం ముందుచూపుతో వైద్య కళాశాలకు శంఖుస్థాపన చేయడమనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలుస్తోందని కోనసీమవాసి లోవ లక్ష్మీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. సరియైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వైద్య కళాశాలల నిర్మాణానికి పూనుకోవడం ఆయన సహజమైన శైలికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చేస్తున్న పనులను లోవ లక్ష్మీ కొనియాడారు.

               ఈ సందర్భంగా అమలాపురం రూరల్ ప్రాంతంలో  నిర్మాణం చేయనున్న వైద్య కళాశాల శంఖుస్థాపన శిలా ఫలకాన్ని మంత్రులు, శాసన మండలి, శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆవిష్కరించారు.

           ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి, వైస్ ఛైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, తోట త్రిమూర్తులు,  ఏపీఎంఎస్ఐడిసి ఈఈ కె.సీతారామ రాజు, డీఈఈ ఎం. సత్యప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, తహశీల్దార్ ఆర్ఎన్ ఠాగూర్, ఎంపిడివో ఎం. ప్రభాకర రావు,    స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

                          

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image