నేడే (18.05.2021, మంగళవారం) వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలలో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


అమరావతి (ప్రజా అమరావతి);


నేడే (18.05.2021, మంగళవారం) వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలలో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


వరసగా మూడో ఏడాది, కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక భారం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతీ హమీని భాద్యతగా నెరవేరుస్తున్న ప్రభుత్వం


*మత్స్యకారులకు వేట నిషేద సమయంలో (ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు) ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సాయం*


*ఈ ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ. 119.88 కోట్ల ఆర్ధిక సాయం*


సముద్రంలో చేపల వేట నిషేద కాలంలో అర్హత గల మత్స్యకార కుటుంబాలకు గతంలో కేవలం రూ. 4వేలు అదీ కొందరికే, అది కూడా బకాయిలు పెడుతూ అరకొరగా చెల్లింపు


కానీ శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పధకం ద్వారా దీనీని రూ. 10 వేలకు పెంచి అర్హులైన మర, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకారులకు కూడా భృతి చెల్లిస్తుంది. 


2019 నుంచి ఇప్పటివరకు రూ. 211.70 కోట్ల భృతి చెల్లింపు, వరసగా మూడో ఏడాది నేడు అందిస్తున్న రూ. 119.88 కోట్లతో కలిపి మొత్తంగా దాదాపు రూ. 332 కోట్ల లబ్ది చేకూర్చిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


డీజిల్‌ ఆయిల్‌పై లీటర్‌కు సబ్సిడీ రూ. 6.03 నుంచి రూ. 9.00 కి పెంపు, ఆయిల్‌ పోయించుకునే సమయంలోనే రేట్‌ తగ్గించి పోసే ఏర్పాటు, వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రూ. 5 లక్షలనుంచి రూ. 10 లక్షలకు పెంపు


ఏడాదికి రూ. 780 కోట్ల వ్యయంతో 53,550 మంది ఆక్వారైతులకు ఇప్పటివరకూ రూ. 1,560 కోట్ల లబ్ది కలిగేలా యూనిట్‌ కరెంట్‌ కేవలం రూ. 1.50 లకే సరఫరా. రాష్ట్రవ్యాప్తంగా రూ. 50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటుతో నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు


దాదాపు రూ. 1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలిపట్నంలలో 4 ఫిషింగ్‌ హార్బర్‌ల నిర్మాణ పనులు ప్రారంభం


శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో రూ. 1,365.35 కోట్ల వ్యయంతో త్వరలో  మరో 4 ఫిషింగ్‌ హర్బర్‌ల ఏర్పాటుకు చర్యలు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ హార్బర్‌ల ద్వారా 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. 


వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకొచ్చి దేశీయ వినియోగం పెంచడం, పౌష్టికాహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి మత్స్య, ఆక్వా రైతులకు మరియు మత్స్యకారులకు కూడా గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 332. 9 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో ఆక్వాహబ్‌లు మరియు వాటికి అనుసంధానంగా రిటైల్‌ దుకాణాలు ఏర్పాటు దిశగా అడుగులు. మొదటివిడతగా 25 ఆక్వాహబ్‌లకు శ్రీకారం.


2019 నుంచి ఇప్పటివరకు మత్స్యకారుల సంక్షేమం కోసం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన వ్యయం. లబ్దిదారుల సంఖ్య – 2,12,535, లబ్ది రూ. 2,030.87 కోట్లు. ఇవేకాక జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ జగనన్న ఇళ్ళపట్టాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ఇంకా మరెన్నో పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.