కోవిడ్ -19 యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై రేపు (గురువారం) జిల్లా సమీక్ష కమిటీ సమావేశం.
*జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ ఏర్పాటు*
*:జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*
అనంతపురము,మే12 (ప్రజా అమరావతి):
*కోవిడ్ -19 (సెకండ్ వేవ్) యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు, జిల్లా సమీక్షా కమిటీ చైర్మన్ అధ్యక్షతన ఈ నెల 13 వ తేదీన గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాలు నందు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు..
*రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోవిడ్ -19 యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై ప్రభుత్వం జిల్లా ఇంచార్జ్ మంత్రుల అధ్యక్షతన జిల్లా రివ్యూ కమిటీ ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీకి జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు చైర్మన్ గాను, జెడ్పీ చైర్ పర్సన్, జిల్లా మంత్రులు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ కార్పొరేషన్/మునిసిపాలిటీల చైర్ పర్సన్లు కమిటీ సభ్యులుగా, జిల్లా కలెక్టర్ మెంబర్/కన్వీనర్ గా నూ వ్యవహరిస్తారన్నారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు రాష్ట్ర పురపాలక మరియు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
అలాగే జిల్లా సమీక్ష కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు వారి వారి ప్రాంతాల నుండి జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షలో పాల్గొం టున్నారన్నారు.
పెనుకొండ సబ్-కలెక్టర్, జిల్లాలోని ఆర్డీఓలు, తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లు, ఎస్ఐలు కూడా తమ ప్రాంతాల నుండి వీసీ/జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తప్పకుండా హాజరుకావాల ని కలెక్టర్ ఆదేశించారు.*
*ఈ సమావేశానికి సంబంధిత నోడల్ అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అదేశించారు.*
........................................
*సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురము వారిచే జారీ...*
addComments
Post a Comment