ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సం. లు అయిన సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయ చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు:

 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సం. లు అయిన సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయ చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి) :

     ఈరోజు అనగా ది.30-05-2021 న గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా పదవీభాద్యతలు చేపట్టీ 2 సంవత్సరములు అయిన సందర్భముగా వారి పరిపాలన లో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుచుటకు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తదనుగుణంగా ముఖ్యమంత్రి వర్యుల వారికి మరియు ప్రభుత్వంనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు శ్రీ అమ్మవారికి వేదపండితులు మరియు అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కుంబాల గోత్రం శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేరు పై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నందు ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి పరిస్థితుల నుండి త్వరగా బయటపడుటకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి త్వరితగతిన తొలగిపోయి, రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొనాలని శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించి, ప్రార్థించినట్లు తెలిపారు.