కర్నూల్ (ప్రజా అమరావతి);
జిల్లాలో ఖరీఫ్-21 ప్రణాళికపై వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేసిన జాయింట్ కలెక్టర్(రెవెన్యూ&రైతు భరోసా) ఎస్.రామసుందర్ రెడ్డి.
జేడీఏ, డీడీఏలు, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులతో ఈ రోజు ఉదయం తన క్యాంప్ కార్యాలయం నుండి ఖరీఫ్-21 వ్యవసాయ కార్యకలాపాలపై వెబ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష చేసిన జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ& రైతు భరోసా) రామసుందర్ రెడ్డి.
ఖరీఫ్-21 ప్రణాళిక అమలు, రైతులకు ఖరీఫ్ పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వడం, రైతు భరోసా ఆర్థిక లబ్ది పంపిణీని రేపు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తున్న సందర్భంగా బ్యాంకర్లతో మాట్లాడి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా ఆర్థిక లబ్దిని వెంటనే జమ చేయించడం, ఆర్.బి.కె. లలో రైతులకు ఖరీఫ్ విత్తనాల పంపిణీ, తదితర అన్ని కార్యక్రమాలను పగడ్బందీగా చేపట్టాలి : జేడీఏ, వ్యవసాయ అధికారులకు జేసీ రామసుందర్ రెడ్డి అదేశం.
addComments
Post a Comment