విజయవాడ (ప్రజా అమరావతి);
జిల్లా లో శనివారం 22,575 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది
వెన్యూ కేంద్రంగా జిజిహెచ్ కోవిడ్ వైద్య సేవలు విస్తరణ.
జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్
కృష్ణా జిల్లాలో కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మరింత మెరుగై వైద్య సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి కోవిడ్ వైద్య సేవలు పెంచే దిశలో అడుగులు వేస్తున్నమని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.
కృష్ణా జిల్లాలో కోవిడ్ నియంత్రణ, వైద్య సేవలపై అమలు చేస్తున్న వివరాలను శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఏ.కె.సింఘాల్ కు జూమ్ కాన్ఫెరెన్సు ద్వారా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 14,91,680 మందికి కరోనా టెస్టు లు నిర్వహించమన్నారు.జిల్లాలో పాజిటివ్ శాతం సగటున 5.03 గా వుందన్నారు. ఫిబ్రవరి మాసంలో 0.4 శాతం ఉండగా మార్చి నాటికి 1.46 శాతం కు పెరిగిందన్నారు అది మే నెల నాటికి 11.71 శాతానికి చేరిందని,గత 4 రోజులుగా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల ఉందన్నారు.
ఈ రోజు మరో 1038 మంది హోమ్ ఐసోలేషన్ ఉండగా, వారిలో 671 మందికి కిట్స్ అందించాము
4,452 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు -
ఆక్సీజన్ బెడ్లు 729 ,నాన్ ఆక్సీజన్ 2,066, జనరల్ వార్డుల్లో 1657-
కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అవసరమైన ఆక్సిజన్ ఆవశ్యకత నిరంతరం పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వార్ రూమ్ నిర్వహణ తీరును శనివారం రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారని జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ , జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, టెస్టులు, వ్యాక్సినేషన్ , బెడ్స్, ఆక్సిజన్ తదితర అంశాలపై వివరాలు అందచేశారు. సర్వే ద్వారా ఈరోజు 5,463 నమూనా లు రిపోర్టు రాగా, వాటిలో 412 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. జిల్లాలోని 76 కోవిడ్ ఆసుపత్రులలో 4,452మంది ఆసుపత్రిల్లో బెడ్స్ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. వాటిలో 729 ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ , 2066 ఐసీయూ విత్ నాన్ ఆక్సిజన్ బెడ్స్ , 1657 సాధారణ బెడ్స్ పై భాదితులకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా జిల్లాలో 215 బెడ్స్ వాటిలో నాన్ ఐసీయూ, జనరల్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు మొత్తం 8,136 మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నారని, వారికి ఉచితంగా కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఆక్సిజన్ సరఫరా, ఆవశ్యకత, అనుబంధ అంశాలపై జాయింట్ కలెక్టర్ కె.శివశంకర్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ వార్ రూమ్ వలన ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ వినియోగిస్తున్న తీరును నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.
addComments
Post a Comment