తిరుపతి, మే 15 (ప్రజా అమరావతి);
మే 23 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు లోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 23 నుంచి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
మే 22న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
మే 23వ తేదీ ఉదయం 9.30 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
31వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
జూన్ 1వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
addComments
Post a Comment