జిల్లాలో 31 కేంద్రాల్లో మంగళవారం రెండవ మోతాదు కోవాక్సిన్ టీకా.

 


విజయవాడ (ప్రజా అమరావతి);

  

 జిల్లాలో 31 కేంద్రాల్లో మంగళవారం  రెండవ మోతాదు కోవాక్సిన్ టీకా. 


 *కలెక్టర్ ఏ.యండి.   ఇంతియాజ్* 



జిల్లా వ్యాప్తంగా   31 కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు ద్వారా   మంగళవారం  రెండవ మోతాదు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుందని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్  సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు. 


జిల్లాలో 31 వాక్సినేషన్ కేంద్రాల్లో  జూన్ ఒకటవ తేదీ మంగళవారం  ఉదయం  7.00 గంటల నుంచి సాయంత్రం 5.00  వరకు వరకు ఆయా  కేంద్రాల్లో  కోవాక్సిన్ వ్యాక్సిన్ వేస్తారనితెలిపారు.


 కావున  అర్హులైన వారు రెండవ విడత మోతాదు కోవాక్సిన్ టీకా తీసుకోవలసిందిగా కోరారు.ఈ అవకాశాన్నీ రెండవ విడత కోవాక్సిన్ టీకా పొందవలసిన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


విజయవాడ నగరంలో సత్యనారాయణపురం ఏకెటిపియం మునిసిపల్ హైస్కూలు ,అజిత్ సింగ్ నగర్ యం కె బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్,పటమట జీడీఈటి స్కూల్, పూర్ణనందపేట కౌతా సుబ్బారావు స్కూల్,గుణదాల బిషప్ గ్రాసి స్కూల్,ఓల్డ్ హెచ్ కాలనీ ఎమ్మెల్సీ మునిసిపల్ స్కూల్,కృష్ణలంక ఏపిఎస్ ఆర్ యంసి స్కూల్,మధుర నగర్ సద్గతి విద్యా నికేతన్,భవానిపురం షాధిఖానా, రాజీవ్ నగర్ సి హెచ్ సి,రాణిగారి తోట శాంపిల్ బిల్డింగ్,కొత్తపేట కెబిఎన్ కాలేజీ, విజయవాడ డివిజన్ లోని ఇబ్రహీంపట్నం జడ్పీ పాఠశాల, మైలవరం మండలం చంద్రాల పి హెచ్త్ సి(సివిసి), చంద్రర్లపాడు జడ్పీ పాఠశాల, మచిలీపట్నం డివిజన్ లోని మచిలీపట్నం పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్, తాళ్లపాలెం సైక్లోన్ షల్ట్ ర్,చిన్నపురం జడ్పీ పాఠశాల,పెడన మండలం చేవేంద్రపాలెం జడ్పీ పాఠశాల,గుడివాడ డివిజన్లోని గుడివాడ కైకాల సత్యనారాయణ కళ్యాణమండపం,గౌరీ శంకరపురం మాంటిసోరి ప్రైమరీ స్కూల్,ఎన్టీఆర్ కాలనీ ఇయుపిహెహెచ్ సి,బేతవోలు ఇయూపిహెచ్ సి,బాపూజీ నగర్ ఇయు పిహెచ్ సి, కైకలూరు మండలం కొల్లేటికోట పి హెచ్ సి,ఆటపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుడ్లవల్లేరు ఎస్వీఆర్ యం హైస్కూల్, పామర్రు జడ్పీ పాఠశాల, పామర్రు వాటర్ ట్యాంక్ వద్ద,పెదపారుపూడి యండివో ఆఫీస్ సమీపంలోని జడ్పీ పాఠశాల, ఉయ్యురు మండలం ఉయ్యురు జడ్పీ పాఠశాల లో రెండవ మోతాదు కోవాక్సిన్ టీకా వేయబడుతుందన్నారు.


 వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వచ్చే  వారు  కోవిడ్ సూచనలను తప్పక పాటించాలన్నారు. 


కోవిడ్ వ్యాక్సిన్  వేయించుకునేందుకు వచ్చేటప్పుడు , వేయించుకున్న తరువాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవడం తరచూ చేస్తుండలన్నారు. అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇంటిలో ఉన్నవారు కూడా మాస్కులు ధరించాలని కోవిడ్ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టరు అన్నారు.

Comments