వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు.
*సతులు చాలా బాగున్నాయి
బెడ్ల సామర్థ్యాన్ని 350కి పెంచాం.
మరో 150 బెడ్ల వరకు పెంచేందుకు కృషి.
*మందుల కొరత రానీకుండా చూస్తున్నాం*
*భోజనం నాణ్యత, పరిమాణం పెరిగేలా చేశాం*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు*
*టిడ్కో గృహాల్లోని కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలన*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
స్థానిక టిడ్కో గృహాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే విడదల రజిని గారు డీఎస్పీ విజయభాస్కర్, వైద్యాధికారి గోపినాయక్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకలూరిపేటలోకి కోవిడ్ కేర్ సెంటర్‌లో వైద్యులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. తాను గతంలో కోవిడ్ కేర్ సెంటర్‌కు వచ్చిన సమయంలో వైద్య సిబ్బంది కరోనా పరీక్షా సామగ్రి కావాలని అడిగారని, ఆ సమస్యను పరిష్కరించామని ఇప్పుడు సరిపడా కరోనా నిర్ధారణ కిట్లు ఉన్నాయని చెప్పారు. భోజనం నాణ్యత ఉండటం లేదని, రోగులకు సరిపడా భోజనం అందడం లేదనే సమస్యలు కూడా గతంలో తన దృష్టికి వచ్చాయని, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైందని చెప్పారు. భోజనం రోగులకు సరిపడా పెడుతున్నారని, నాణ్యత కూడా బాగా పెరిగిందని వెల్లడించారు. గతంలో కోవిడ్ కేర్ సెంటర్‌కు తాను వచ్చినప్పుడు తన దృష్టికి పలు సమస్యలు వచ్చాయని, ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయో తెలుసుకునేందుకు మరలా వారం రోజుల వ్యవధిలో కోవిడ్ కేర్ సెంటర్‌కు వచ్చి పరిశీలించానని చెప్పారు. గతంలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారమయ్యాయని తెలిపారు.
*సరిపడా వైద్య సిబ్బంది*
తొలుత 200 బెడ్ల సామర్థ్యంతో కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించామని, ఉన్నతాధికారులతో మాట్లాడి విడతల వారిగా బెడ్ల సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు 350 బెడ్లు ఈ సెంటర్‌లో ఉన్నాయని, ప్రస్తుతం 320 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అవసరమైతే బెడ్లను 500 వరకు పెంచుతామని చెప్పారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, కోవిడ్ సెంటర్‌లో మెరుగైన వైద్యం, పారిశుద్ధ్యం అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. రోగులందరికీ మంచి వైద్యం అందించేందుకు గాను సిబ్బందిని నియమించామని, అవసరమైతే ఇంకా వైద్య సిబ్బందిని నియమించుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయభాస్కర్,ఇంచార్జి కమిషనర్ ఫణి కుమార్,డాక్టర్ గోపి నాయక్,వైద్య సిబ్బంది,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,కౌన్సిలర్ విడదల గోపి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,మరియు పలువురు నాయకులు ఉన్నారు.
addComments
Post a Comment