నలుగురు డాక్టర్లు వారికి సహయకారిగా 4 గురు మేల్, 4 గురు ఫీమేల్ నర్సులు పనిచేస్తారని తెలిపారు.





విజయవాడ (ప్రజా అమరావతి);



కోవిడ్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు యదార్ధ పరిస్థితి అంచనా కోసం డాక్టర్లు, నర్సులతో కూడి ప్రత్యేక కమిటీ వెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.

కరోనా స్ట్రెయిన్ వలన ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు కోసం వస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. 


నలుగురు డాక్టర్లు వారికి సహయకారిగా 4 గురు  మేల్, 4 గురు ఫీమేల్ నర్సులు పనిచేస్తారని తెలిపారు.



ఈ కమిటీ లో ఆర్థోపెడిక్ డాక్టర్లు వెంకటేశ్వరరావు,శ్యామ్,ఆప్తమాలిజిస్ట్ డా.విజయలక్ష్మి,న్యూరో సర్జన్ హాయగ్రీవా రావు లను నియమించమన్నారు.వీరు ప్రతిరోజు బెడ్ల ల ఆక్యుపెన్సీ నీ ఎప్పటి కప్పుడు సమీక్షిస్తు,ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా పారదర్శకంగా బెడ్ల కేటాయింపు జరిగేలా పూర్తి బాధ్యత లను ఇవ్వడం జరిగిందన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన వారిని గుర్తించి బెడ్ల కేటాయింపు చేస్తారన్నారు.


కోవిడ్ బారిన పడిన వారికి మరింత మరింత భరోసా కలిపించేందుకు సిద్దార్థ మెడికల్ కాలేజి ఆవరణలో జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు వేసి 30 బెడ్ల తో కూడిన ట్రైయేజ్ కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొకునేందుకు కొత్త ప్రభుత్వ ఆస్పత్రికి అనుసంధానం గా వేన్యూ కన్వెన్షన్ లో ఆక్సీజన్ కూడిన 100 బెడ్ల ను ఏర్పాటు చేస్తున్న మని,వాటిలో ఇప్పటికే కొన్ని బెడ్ల ను అందుబాటులో కి తీసుకువచ్చామన్నారు.


కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కమిటీ వేయడం ద్వారా జవాబుదారీతనన్ని తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

Comments