తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ బెడ్ల ఆస్పత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి.

 తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ బెడ్ల ఆస్పత్రి నిర్మాణం త్వరితగతిన  పూర్తి కావాలి.


 ఆస్పత్రి పనుల పర్యవేక్షణకు టీమ్ లు ఏర్పాటు చేయాలి.


హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.


కోవిడ్ మరణాలను తగ్గించాలి'. 


టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.


అనంతపురం, మే 10 (ప్రజా అమరావతి);


కరోనా నేపథ్యంలో తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ  వద్ద 500 ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేస్తున్న  తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా  వేగంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.


సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ బెడ్ల ఆస్పత్రి ఏర్పాటు, హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్ పనుల్లో పురోగతి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, ఆర్ డిఓ లు, పరిశ్రమల శాఖ జిఎం, డిఎంఅండ్హెచ్ ఓ తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రికి సంబంధించి టెండర్లు ఫైనలైజ్ అయ్యాయన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు భూమి చదును పనులు పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించిన ఫోటోలు పంపించాల ని ఆర్డీవో ఆదేశించారు.


ఆస్పత్రి పనులు ప్రణాళికా బద్ధంగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులతో  టీములు ఏర్పాటు చేయాలన్నారు.. ఆ మేరకు ఉత్తర్వులు తయారు చేయాలని డీ ఆర్వో ను ఆదేశించారు.


ఆర్డీవో, పరిశ్రమల శాఖ జీ ఎం, AP HMIDC EE,  SE RWS, SE ELECTRICTY, DMHO, DRIGS AD, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు అందరూ ఈ కమిటీల్లో ఉండాలన్నారు.


ల్యాండ్ లెవెలింగ్ క్లియరెన్స్ , భోజనం  సరఫరా, రెండు నెలల పాటు వసతి ని ఆర్డీవో, తహశీల్దార్ చూసుకోవాలన్నారు.డాక్టర్లు, నర్సుల నియామకం, వారికి శిక్షణ,   DMHO చూసుకోవాలన్నారు.


పైప్లైన్ కలెక్షన్లు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలకు సంబంధించి పరిశ్రమల శాఖ జిఎం చూసుకోవాలని, డ్రగ్స్ పర్మిషన్లు డ్రగ్స్ ఎడి తీసుకోవాలని, ఆస్పత్రి లోపల ఆక్సిజన్ పైప్ లైన్, ఇతర యాక్టివిటి లను చేపట్టేందుకు ఏపిఎంఎస్ఐడిసి ఈ ఈ సిద్ధంగా ఉండాలన్నారు.  నిర్మాణం సమయంలోనూ, పూర్తయిన తర్వాత  విద్యుత్ సరఫరాను  చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ ని ఆదేశించారు. 


నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. రాత్రిపూట కూడా పనులు చేపట్టేందుకు వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయాలని, నీటి సరఫరా చేయాలని, భోజన ఏర్పాట్లు అన్ని సిద్ధంగా ఉండాలన్నారు.  కేసులు తక్కువ వున్న మండలాల  ఎంపీడీఓ లు, తహసీల్దార్ లకు కూడా విధులు కేటాయించాలన్నారు.  రాత్రి, పగలు  పనులు చేయాలని, త్వరితగతిన ఆసుపత్రి సిద్ధమయ్యేలా చూడాలన్నారు.


ఈ పనులన్నీ పర్యవేక్షణ చేసే విధంగా టీమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ పైపులైన్ కోసం ఒక టీం, పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుని ఆస్పత్రి లోపల పెద్ద ఆక్సిజన్ పైప్లైన్ వేయడానికి ఒక టీమ్, చిన్న ఆక్సిజన్ పైప్లైన్ వేయడానికి ఒక టీమ్, నీటి సరఫరా, రహదార్ల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి ఒక టీమ్, భోజనం సరఫరా, డాక్టర్లకు, నర్సుల కు సంబంధించి వసతి ఏర్పాట్ల కోసం ఒక టీమ్, ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక్కో టీంలను ఏర్పాటు చేయాల ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్ పనుల్లో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్ పనులు వేగంగా  పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కు సూచించారు. పనులు మొదలుకావడంతో పురోగతిని పరిశీలించాలని, ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన వివరాలను అందించాలన్నారు.


'కోవిడ్ మరణాలను తగ్గించండి'


జిల్లాలో కోవిడ్ మరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్  కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అదేశించారు.


మానవ తప్పిదం వల్ల  కోవిడ్ మరణాలు సంభవించకూడదన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ ప్రజల ప్రాణాలు కాపాడటానికేనన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణమూ విలువైందేనన్నారు. ముఖ్యంగా సివియర్ పేషంట్లకు వైద్యం అందించడంపై దృష్టి సారించాలన్నారు. వార్డుల వారీగా సివియర్ పేషంట్లను గుర్తించి వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.


వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కాగా కొనసాగాలని డీఎంహెచ్వోను అదేశించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఏయే కేంద్రాల్లో ఎంతమందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారో ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఆ మేరకు పత్రికా ప్రకటన జారీ చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని డీఐవోను ఆదేశించారు.

 

ఆక్సిజన్ సప్లై విషయంలో ఎక్కడనుంచి ఎంత ఆక్సిజన్ సప్లై అవుతుందనే వివరాలు అందించాలని డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ ను అదేశించారు.


 ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు, వారాసి, లింగ్డో, చక్రయపేట, హిందూపూర్, అనంతపురం ఆక్సిజన్ ప్లాంట్ల నుండి వచ్చే వాహనాల వివరాలను ఇవ్వాలని  డిప్యూటీ ట్రాస్పోర్ట్ కమిషనర్ ను  కలెక్టర్ ఆదేశించారు.ఆక్సిజన్. సరఫరా కు సంబంధించి ఎక్కడ దుర్వినియోగం జరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


ఆక్సిజన్ పర్యవేక్షణతో పాటు  రెమిడిసివేర్  పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు.


హిందూపురం జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులపై పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతితో చర్చించారు. ఆసుపత్రి నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలని సబ్ కలెక్టరును కోరారు.Comments