నిన్నటితో పోలిస్తే 8 పర్సెంటేజీ పాయింట్లు తగ్గుదల'

 *' తగ్గు ముఖం పట్టిన కరోనా పాజిటివిటీ రేటు'* 


 నిన్నటితో పోలిస్తే 8 పర్సెంటేజీ పాయింట్లు తగ్గుదల'



 *'ఒకే రోజు కరోనా నుంచి కోలుకున్న 2025 మంది డిశ్చార్జ్'* 


 *జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు* 


అనంతపురము, మే 17 (ప్రజా అమరావతి);


ఒక్క రోజులో జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. రోజువారీ గణాంకాల ప్రకారం నిన్నటితో పోలిస్తే నేడు పాజిటివిటీ రేటులో 8 పర్సెంటేజీ పాయింట్ల తగ్గుదల కనిపించిందన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలలో 5 పర్సెంటేజీ పాయింట్లు, మొత్తంగా అన్ని రకాల పరీక్షలలో 8 పర్సెంటేజీ పాయింట్లు పాజిటివిటీ రేటు తగ్గిందన్నారు. 


నిన్న 45 శాతం పాజిటివిటీ రేటుతో టెస్టు నిర్వహించిన ప్రతి వంద మందిలో 45 మంది పాజిటివ్ గా తేలారని, నేడు వందలో 37 మంది మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారన్నారు. 


37.67 శాతం పాజిటివిటీ రేటుతో 2094 మందికి కరోనా పాజిటివ్  నిర్ధారణ అయిందన్నారు. అదే సమయంలో  పాజిటివ్ కేసులతో సమానంగా కరోనా నుంచి కోలుకున్న 2025 మంది బాధితులను ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారితో సమానంగా కోవిడ్ బాధితుల డిశ్చార్జ్ ఉండటం సానుకూలాంశామన్నారు. రానున్న రోజుల్లో పాజిటివిటీ రేటు మరింత తగ్గించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో తాడిపత్రి, అనంతపురము పట్టణాలలో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి 800 ఆక్సిజన్ పడకలు అదనంగా ఏర్పాటు చేయనున్నామని.. పడకల సంఖ్య పెరగనుండటం, అదే సమయంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు.



Comments