ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు.



అమరావతి (ప్రజా అమరావతి);


అకడిమిక్ రిసోర్స్ సెంటర్" ని వర్చువల్ గా ప్రారంభించిన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


ఐ.టీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి సహా అధికారులందరికీ అభినందనలు తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి.


ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు.



యువతను ఆకర్షించే టెక్నాలజీ, ఐ.టీ, సాఫ్ట్ వేర్ సంబంధిత పుస్తకాలకు పెద్దపీట.


కంప్యూటర్ల ద్వారా చదువుకునేందుకు, ఇతర పనులకు వినియోగించుకునే వీలుగా ఏఆర్ సీ(అకడమిక్ రిసోర్స్ సెంటర్).


వర్చువల్ లో పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీని పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి.


ఇంజనీరింగ్ పుస్తకాలు, దిన పత్రికలు, పరిశ్రమలు, ఐ.టీ రంగ మ్యాగజైన్లు, ఇంగ్లీష్ డిక్షనరీ, ప్రాంతీయ భాషల డిక్షనరీలు, సాఫ్ట్ స్కిల్స్ వంటి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీకి మంత్రి సూచనలు.


అనంతరం అధికారిక ఐ.టీ వెబ్ పోర్టల్ డిజైనింగ్ని పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి.


త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించే అవకాశం.


ఇప్పటికే విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీని వెబ్ సైట్ లో పొందుపరచినట్లు వెల్లడి.


ఐ.టీ సేవలకు సంబంధించిన సలహాలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి పరిష్కరించేలా తీర్చిదిద్దిన వెబ్ సైట్ పోర్టల్ ను నిశితంగా పరిశీలించిన మంత్రి మేకపాటి.


ప్రభుత్వ సేవలన్నింటినీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామం : మంత్రి గౌతమ్ రెడ్డి.


నిరక్ష్యరాస్యులకు చదువుకున్న వారు సహకరించేలా ఈ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు, పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఇచ్చినా పరిశీలించి వారికి అవసరమైన సేవలందించే వీలుగా వెబ్ సైట్ రూపొందించిన ఐ.టీ శాఖ.


ఏపీఐఐసీ అధికార వెబ్ సైట్ ని కూడా ఐ.టీ శాఖ రూపొందించిన అదే వెబ్ సైట్ లో అనుసంధానించాలని మంత్రి ఆదేశం.


ఐ.టీ శాఖలో జరిగే కార్యక్రమాలు, ఫోటో గ్యాలరీ, పత్రికా ప్రకటనలు, ఈవెంట్స్, ప్రకటనలకు వీలుగా సమాచారం అందుబాటులో ఉండేలా పోర్టల్ డిజైన్.


వెబ్ సైట్ లోకి ఎంటర్ అయిన ప్రతి వినియోగదారునికి అవసరమైన  అన్ని రకాల సేవలందేలా సంబంధిత ఏజెన్సీల అనుసంధానం.


ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ ఛేంజ్ ప్రక్రియను ఆగస్ట్ 15 లోగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశం.


35 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను అందించనున్న సుమారు 10 కంపెనీలు ఏపీలో పెట్టబోయే రూ.800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి డీపీర్ పూర్తి చేసిన కంపెనీలపై  ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి మేకపాటి.


కోవిడ్ సహా ఇతర సాంకేతిక కారణాల వల్ల డీపీఆర్ అందించలేకపోయిన కంపెనీలు, కోరిన గడువులు సహా ప్రస్తుత పరిస్థితిపై మంత్రి మేకపాటి ఆరా.


సంబంధిత కంపెనీల సీఈవో, ఎండీలతో  త్వరలో సమావేశమవుతానని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి.


తాజాగా జరిగిన ఐ.టీ కాన్ క్లేవ్ అనంతరం ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ఐ.టీ కంపెనీలు, చర్చల దశలో ఉన్నవి, మౌలిక సదుపాయాలు అందిస్తే ఏపీకి రానున్న సంస్థల గురించి మంత్రికి వివరించిన ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్.


ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల అనంతరం విధి విధానాలు, తదితర చర్యలపై మంత్రి దిశానిర్దేశం.


డేటా సెంటర్ల స్థాపనకు ముందుకు వచ్చిన 3 ప్రతిపాదనలను మంత్రికి వెల్లడించిన ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి.


ఐ.టీ శాఖలో ఏపీటీఎస్ ద్వారా ఆదాయ మార్గాలను , అందించాల్సిన సేవలపై చర్చ.


రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్, నెట్ వర్క్ కనెక్టివిటీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి.


ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ రంగంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న సంస్థలు.


ఐ.టీ కాన్సెప్ట్ సిటీలపై ప్రపంచస్థాయి నిపుణుల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్  (EOI) కోరిన ఐ.టీ శాఖ.


పరిశ్రమలు, ఐ.టీ శాఖలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళిక , కార్యాచరణ.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాలుష్యం లేని విధంగా, వాక్ టు వర్క్ వంటి ఉన్నత స్థాయి ప్రమాణాలకు పెద్దపీట.


కాన్సెప్ట్ సిటీల నిర్మాణంలో అంతర్జాతీయ విధివిధానాలను ఇనుమడింపజేయాలి, తదనుగుణంగా నమూనాల పరిశీలన, పరిశోధన అవసరం.


వీటన్నిటిని పరిశీలించి ఒక కొలిక్కి తీసుకురావడానికి మేధోమధనం జరగాలి.


అందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.


పూర్తిస్థాయిలో  దష్టి పెట్టి బిడ్డర్లను తీసుకువచ్చే బాధ్యత ఏర్పాటు చేసిన కమిటీకి ఇవ్వాలి.


స్మార్ట్ సిటీలకు మించి..అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక శైలి కాన్సెప్ట్ సిటీల నిర్మాణం.


కొప్పర్తిలో ఈఎంసీలో ముందు ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు ఉదా:ఉండడానికి చోటు, ఇస్తే ఉద్యోగాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది.


ఈఎంసీలలో డార్మెంటరీల నిర్మాణం అనివార్యం


వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, తదితరులు.


Comments