కరువు పనులు కల్పించడం వల్ల పేదల ప్రాణాలు కాపాడతాయి*

 సోమవారం నాటికి 5 లక్షలకు పైగా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి.


*: కరువు పనులు కల్పించడం వల్ల పేదల ప్రాణాలు కాపాడతాయి*


*: ఉపాధి పనుల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు*


*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*


అనంతపురం, మే 14  (ప్రజా అమరావతి):


*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే సోమవారం నాటికి 5 లక్షలకు పైగా  కూలీలకు ఉపాధి పనులు కల్పించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం ఉపాధి హామీ పథకంపై జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 6 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించే వారమని, ప్రస్తుతం 4 లక్షల మందికిపైగా కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నామని, వచ్చే సోమవారంలోగా 5 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు ఖచ్చితంగా కల్పించాలన్నారు. ఇందుకోసం ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, ఇంజనీరింగ్ ఈసీలు ఉపాధి పనుల కల్పనలో పురోగతి కనిపించేలా పనిచేయాలని ఆదేశించారు.*


*కరువు పనులు కల్పించడం వల్ల పేదల ప్రాణాలు కాపాడతాయి :*


*ఉపాధి హామీ పథకం పేదలకు లైఫ్ లైన్ లాంటిదని, కరువు పని కల్పించడం వల్ల జీవితాలను కాపాడవచ్చని, కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో పనులను చూపించడం ద్వారా పేదల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఉపాధి పనులు కల్పించడం ద్వారా  ఒకవైపు పేదల జీవితాన్ని కాపాడడంతో పాటు మరోవైపు  మెటీరియల్ కంపోనెంట్ వల్ల రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ భవనాలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణాల ద్వారా పిల్లల భవిష్యత్తు ఉపయోగపడే విధంగా ఆస్తులు సమకూరుతాయన్నారు.  బత్తల పల్లి మండలంలోని ఒక గ్రామంలో జాబ్  కార్డు వున్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించారని, కరువు కాలంలో కూలీలకు పనులు కల్పించడం  వల్ల సంతోషంగా పనులకు వెళ్తూ, వారి ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ఇలా అన్ని గ్రామాల్లో పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనుల కల్పన పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.*


*పనులు బాగా కల్పిస్తున్న ఏపీడిలు, ఎంపీడీవో లు, ఏపి వొలు, ఫీల్డ్ అసిస్టెంట్ లకు అభినందనలు :*


*జిల్లాలో ఉపాధి పనులు బాగా కల్పిస్తున్న తాడిపత్రి క్లస్టర్, గుత్తి క్లస్టర్, కదిరి క్లస్టర్ ఏపీడీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. తాడిపత్రి క్లస్టర్ 72 శాతం లక్ష్యాలను చేరుకోగా ఏపీ లావణ్య కుమారిని అభినందించారు. ఇంకా ఎక్కువ మందికి ఉపాధి పనులు కల్పించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. గుత్తి క్లస్టర్ ఏపీడీ అయేషా ఉపాధి పనులను బాగా కల్పించారని అభినందించారు. కదిరి క్లస్టర్ ఏపిడి కూడా బాగా పని చేశారని జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.క్షేత్ర స్థాయి  వరకు సమావేశాలు నిర్వహించి మంచి ఫలితాలు సాధించారన్నారు.  ఇదే స్పూర్తితో పని చేసి పెద్ద సంఖ్యలో   కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు.


*ముదిగుబ్బ మండలం, చెన్నేకొత్తపల్లి, నార్పల, సింగనమల, బుక్కపట్నం ఏపీఓ, ఎంపీడీవో లు ఉపాధి పనుల కల్పనలో బాగా పని చేశారని జిల్లా కలెక్టర్ అభినందించారు. పుట్టపర్తి, పెద్దవడుగూరు మండలాలు ఉపాధి పనుల కల్పనలో బాగా పని చేశారన్నారు. అలాగే పుట్టపర్తి మండలం అమగొండపాలెం ఫీల్డ్ అసిస్టెంట్ కళ్యాణ్ , గాండ్లపెంట మండలం తుమ్మలబైలు గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ హీరా నాయక్, గోరంట్ల మండలం మందలపల్లి గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్లు రామాంజినమ్మ, వాసుదేవ నాయక్ లు, బుక్కపట్నం గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు బాగా పని చేశారని జిల్లా కలెక్టర్ అభినందించారు. వీరంతా మరింత మెరుగ్గా పని చేయాలని సూచించారు.*


*సక్రమంగా పని చేయని వారిపై చర్యలు :*


*జిల్లాలోని మడకశిర క్లస్టర్ ఉపాధి పనుల కల్పనలో వెనకబడిందని, ఏపీడి లక్ష్మీ నారాయణ కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం లోగా పనుల కల్పన మెరుగు పడకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యంగా ఉన్న ఉరవకొండ ఎంపీడీవో, ఏపీడీ లకు ,కొత్తచెరువు ఎంపీడీవోకు , ఏపీఓ లపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు*


*పామిడి మండలం వంకరాజు కాలవ, ధర్మవరం మండలం చిగిచెర్ల, ఉరవకొండ మండలం నింబగల్లు, విడపనకల్లు మండలం పాల్తూరు ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు బాగాలేదని,  ఉపాధి పనుల కల్పన లో చివరిలో ఉన్న ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేయాలని డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*


*. జిల్లాలోని గ్రామాల్లో శనివారం, ఆదివారం సమావేశాలు నిర్వహించి కూలీలకు ఉపాధి పనుల కల్పనపై విస్తృతంగా అవగాహన కల్పించి  సోమవారం నాటికి 5 లక్షల మందికి పైగా పనులు కల్పించాలని  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*