తిరుపతి ఎంపీ గురుమూర్తికి శుభాభినందనలు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
*గురుమూర్తి గెలుపులో సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు అందించిన మెజారిటీ ప్రత్యేకం*
*ముఖ్యమంత్రి, వైసిపి పట్ల చెక్కుచెదరని అభిమానాన్ని మరొకసారి చాటిన సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నియోజకవర్గ ప్రజలకు, ఇంచార్జ్ లకు కృతజ్ఞతాభినందనలు*
అమరావతి (ప్రజా అమరావతి) : తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘనవిజయం సాధించడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి, తిరుపతి ఉప ఎన్నిక సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ అందించిన సుళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్చార్జి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, వైసిపి పట్ల చెక్కుచెదరని అభిమానాన్ని మరొకసారి చాటిన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల ప్రేమానురాగాలు వెలకట్టలేనివి అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన మంచి వైద్యులు, సౌమ్యుడు, మనసున్న మనిషి గురుమూర్తి 2 లక్షల 70వేలపై చిలుకు ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించడంపై మంత్రి అభినందనలు వెల్లడించారు. తిరుపతిలో ‘ఫ్యాన్’ జోరు మరింత పెరగడం.. సామాన్య వైద్యులుగా అందరికీ పరిచితులైన గురుమూర్తి..పార్లమెంటు సభ్యులుగా ఈ స్థాయి మెజారిటీతో గెలుపొందడం ద్వారా మరింత ప్రజా సేవలోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
addComments
Post a Comment