ఈ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు
.
*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ప్రజలకు సుపరిపాలన ను అందిస్తోంది*
*ఎన్నికల మేనిఫెస్టో లోని అంశాలను 96.8 శాతం అమలు చేసిన ఘనత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది*
*గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభు త్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకే అందిస్తూ.. గ్రామ స్వరాజ్యం ని తీసు కొని వచ్చాం*
*హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలోని పడ మటి ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి*
*జిల్లాకు కేటాయించి న మూడు రిజర్వాయ ర్ లను ఒక సంవత్స రం లోపు పూర్తి చేస్తాం*
*వాటర్ గ్రిడ్ పథకం ద్వారా వినూత్నంగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్*
*గ్రామాలు, పట్టణాల లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి :రాష్ట్ర పంచా యతీరాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి*
పుంగనూరు, మే 30 (ప్రజా అమరావతి);
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రెండేళ్లుపూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి చిత్తూరు ఎం.పి ఎన్. రెడ్డప్ప తో కలసి ఆదివారం ఉదయం పుంగనూరు లో దివం గత నేత వై.ఎస్. రాజ శేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివా ళులు అర్పించిన అనం తరం మంత్రి మీడియా తో మాట్లాడు తూ ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలు సుకుని ఎన్నికల మేని ఫెస్టోను రూపొందించ డం జరిగిందని,అధి కారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు సంవత్సరాల కాలంలో 96.8 శాతం ఎన్నికల మేనిఫెస్టో లోని అంశా లను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కు తుంద న్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు గ్రామ సచివా లయవ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ని తీసుకొని రావడం ద్వారా ప్రభు త్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకే అందిస్తున్నామని.. ప్రభుత్వ పథకాలలబ్ధి ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందించడం ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.... ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హంద్రీనీవా కాలువ ద్వారా పడమటి ప్రాంతానికి నీరు అందించే అంశంలో అనంతపురం నుండి నీటిని ని తరలించే అంశంలో ఉన్న ఇబ్బంది ని ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకొని వెళ్ళి అభ్య ర్థించడం తో హంద్రీనీవా కాలువ ను వెడల్పు చేయడానికి అంగీక రించారని, టెండర్లు పిలుస్తారని తద్వారా పడమటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అవకాశం కలదన్నారు.. గండికోట రిజర్వాయర్ నుండి గాలేరు-నగరి కాలువను హంద్రీ నీవా కాలువ కలిపి రూ.4,400 కోట్ల పైచిలుతో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతూ సర్వే పను లు చేసేందుకు చర్యలు చేపడు తున్నట్లు ఇందు కు అవసరమైన టెండ ర్లు పిలుస్తారని తెలిపా రు..జిల్లాకు కేటాయిం చిన మూడు రిజర్వా యర్ లో భాగంగా కురబలకోట ముదివేడు వద్ద, సుగాలి మిట్ట వద్ద నేతి గుంట పల్లి వద్ద, సోమల మండలం ఆవుల పల్లి వద్ద రిజర్వాయర్లను ఒక సంవత్సరం లోపు పూర్తి చేస్తామని, కరువు కాట కాలు లేకుండా ప్రజలు వలసలు పోకుండా పం టలు పండించేందుకు అవకాశం ఏర్పడు తుం దని సుభిక్షమైన పాలన అందించడం జరుగు తుందని తెలిపారు .. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించేందుకు నాబార్డ్ అనుమతితో టెండర్లు పిలిచి పూర్తిచేస్తామని తెలిపారు... 10 సంవత్సరాల క్రితం పుంగనూరు లో నిర్మిం చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీరు అందిం చిన ఘనత మరియు ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో ఆర్టీసీ డిపో లేక ఇబ్బందులు పడ్డామని ముఖ్యమంత్రి డిపో ను మంజూరు చేసి వర్చువల్ విధానం లో ప్రారంభించాలని, త్వరలో బైపాస్ రోడ్డు పనులు కూడా పూర్తి కానున్నాయని... ఈ విషయంలో మిథున్ రెడ్డి ని ఎంపీ ను చేసి ఢిల్లీకి పంపి బైపాస్ రోడ్డు ను మంజూరు చేయించిన ఘనత ముఖ్యమంత్రి దేనన్నా రు. సాగు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద మౌలిక వసతుల కల్పన కు సంబంధించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడం జరుగుతున్నదనన్నారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్ట డం జరుగుతున్నదని, అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాల అమలు ఇలా ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.. కరోనా వల్ల ఇబ్బందులు పడిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించే విధంగా సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో గత రెండేళ్లు లో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుం దని... రానున్న మూడు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తారని తెలిపారు.. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాల కాలంలో 15 లక్షల 60 వేల ఇం డ్లు గత మార్చి కి ముం దు మంజూరు చేసి మిగిలిన ఇళ్లను కూడా ఈ సంవత్సరం మంజూ రు చేసి పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని... పేదవారి సొంతింటి కల సాకారం చేసే ఈ పథకం ముఖ్య మంత్రికి మనసుకు హత్తుకునే పథకం అని తెలిపారు..ఈ పథకం ద్వారా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 13,600 ఇండ్లు మంజూరు చేసి 1435 లే అవుట్ లు వేయడం జరిగిందని గృహనిర్మాణానికి 2,600 కోట్లు పుంగునూరు నియోజకవర్గానికి కేటాయించారని తెలిపారు....
ఈ విలేకరుల సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం. విశ్వనాథం,పుంగ నూరు మున్సిపల్ చైర్మన్ ఆలిం భాష, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కె.ఎల్.వర్మ, ప్రజా ప్రతినిధులు పోక ల అశోక్ కుమార్ తది తరులు పాల్గొన్నారు
addComments
Post a Comment