*పత్రికా ప్రకటన*
అమరావతి (ప్రజా అమరావతి);
తిరుపతిలో సోమవారం రాత్రి జరిగిన రుయా సంఘటనపై చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.
ఆక్సిజన్ సరఫరా సమయంలో నిమిషాల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం.
నిల్వలు తగ్గుతున్న సమయంలో ముందుగానే అప్రమత్తమై ఆక్సిజన్ తెచ్చుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం.
మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటాం : పరిశ్రమల శాఖ మంత్రి.
ఇప్పటికే ముఖ్యమంత్రి వైగస్ జగన్ మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
ముగ్గురు సీనియర్ అధికారులతో ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ కమిటీ నియమించారు.
జరిగిన ఘటనపై పూర్తి నివేదిక రాగానే తగిన చర్యలు చేపడతాం.
ఆక్సిజన్ ను వెంటనే పునరుద్ధరించి వందల మంది ప్రాణాలు కాపాడిన వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు: మంత్రి మేకపాటి.
addComments
Post a Comment