ప్రస్థుతము దేశములో కరోనా తీవ్రత ఉదృతముగా ఉన్నకారణముగా దేవదాయ ధర్మదాయ శాఖ,

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);

ప్రస్థుతము  దేశములో కరోనా తీవ్రత ఉదృతముగా ఉన్నకారణముగా దేవదాయ ధర్మదాయ శాఖ, ఆం


ధ్రప్రదేశ్ వారి ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు లోకకళ్యాణార్ధం మరియు ప్రజలు అందరు  ఆయురాగ్యములతో సుభిక్షముగా ఉండుటకు గాను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ది:09-05-2021 నుండి నిర్వహించు  దన్వంతరి , గణపతి, మహా మృత్యుంజయ హోమము లు తేది:15-5-2021 న ఉదయం 11 గం.లకు మహా పూర్ణాహుతి తో సమాప్తి అగునని తెలియజేయడమైనది. 

భక్తులు కోరిక మేరకు ది:16-5-2021 నుండి  ప్రతి రోజు దన్వంతరి హోమము మరియు గణపతి హోమము లు ఆర్జిత సేవగా నిర్వహించుటకు మరియు పూజకు రూ.1000/- లు చొప్పున రుసుము చెల్లించి భక్తులు పారోక్షసేవగా పాల్గొను విధముగాను జరిపించబడునని దేవస్థాన పాలకమండలి చైర్మెన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి డి.భ్రమరాంబ గారు తెలియజేసియున్నారు. సదరు హోమముల నందు పరోక్షముగా పాల్గొనుటకు మీ ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్ధన. పై సేవలు మరియు దేవస్థానము నందు జరుగు అన్నిప్రరోక్ష సేవలు  www.kanakadurgamma.org, https://www.onlinesbi.com/ sbicollect/icollecthome.htm ద్వారా భక్తులు బుక్ చేసుకొనవచ్చును మరియు విరాళములు పంపుటకు కూడా అవకాశము కలదు. 

ప్రస్థుతము దేవస్థానము నందు 1) చండీహోమము , 2) లక్షకుంకుమార్చన, 3) శాంతి కళ్యాణం , 4) రుద్రహొమం, 5) నవగ్రహ శాంతి హోమం, 6) ఖడ్గమాలార్చన,                 7) శ్రీచక్రనవావర్ణార్చన , 8) రాహుకేతుపూజ ఆర్జిత సేవలు పరోక్షముగా నిర్వహింపబడుచున్నవి  వీటితో పాటు 9) మహా మృత్యుంజయ హోమం , 10) గణపతి హోమం కూడా ది:16-5-2021 నుండి పరోక్షముగా నిర్వహించబడును.


కార్యనిర్వహణాధికారి

Comments