రెవెన్యూశాఖ లో అక్రమ బదిలీల కారణంగా,


 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, విజయవాడ (ప్రజా అమరావతి);

           

రెవెన్యూశాఖ లో అక్రమ బదిలీల కారణంగా, గత సంవత్సరం అక్టోబర్ నుండి జీత భత్యాలు రాక సతమతమవుతున్న *167 మంది తహశీల్దార్ల, 183 మంది ఇతర రెవెన్యూ ఉద్యోగుల జీతాలు* ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే.


ఈ విషయన్నీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా తీసుకుని గౌరవ సి.సి.ఎల్.ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ మరియు రెవిన్యూ శాఖామాత్యులు, అదేవిధంగా గౌ11ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి  నిరంతరము తీసుకు రావడము వలన నేడు గౌ11ముఖ్యమంత్రి గారి ఆమోదంతో నేడు ప్రభుత్వం Memo No. LANAOMISC/1126/2020 ఆ Revenue (Ser. II) Dept, తేదీ 12.5.2021 ద్వారా ఉత్తర్వులు వెలువడినవి. 


దాదాపు 7 మాసములు గా ఈ సమస్యపై ఏ.పి.ఆర్.ఎస్.ఏ. పలుమార్లు అటు ఉన్నతాధికారులు ఇటు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ వినతి పత్రములు సమర్పిస్తూ నిరంతరము అధికారులను, సి.ఎమ్.ఓ అధికారులను సంప్రదిస్తూ ఉండగా బదిలీ చేసిన కలెక్టర్లు మాత్రం అస్సలు తమకెమి పట్టనట్టు ఉండిపోయారు.

                    

గత సంవత్సరము 2020 అక్టోబర్ మాసములో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) గారు తహసీల్దార్ల పదోన్నతులకు సంబంధించి శాఖాపరమైన పదోన్నతులు కమిటీ (డీ.పీ.సి) జరిపి 167 మంది తహసీల్దార్లను వారి వారి జిల్లాలలో ఖాళీగా వున్నా స్థానాలలో వారిని నియమించమని జిల్లా కలెక్టర్లను ఆదేశించగా, అందరు జిల్లా కలెక్టర్లు దానికి విరుద్ధముగా బదిలీలపై నిషేధము ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిడితో మరియు వారి స్వంత నిర్ణయాలతో 167 మంది తహసీల్దారులను, వారితో పాటు 183 మంది ఇతర రెవిన్యూ సిబ్బందిని బదిలీలు చేసారు.


నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన *350 మంది రెవెన్యూ ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులను ratify చేస్తూ, అడ్డగోలుగా బదిలీలు చేసి మిన్నకుండిపోయిన జిల్లా కలెక్టర్ల గురించి నేడు ప్రభుత్వము తన ఉత్తర్వుల లో CCLA గారి ద్వారా అందరూ కలెక్టర్లకు భవిష్యత్ లో ముందస్తు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎలాంటి బదిలీలు చేపట్టారదని హెచ్చరిక జారీ చేయడము జరిగింది.* 


 *బొప్పరాజు* 

 *చేబ్రోలు కృష్ణమూర్తి* 

 *V. గిరి కుమార్ రెడ్డి.*

Comments