ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు : మంత్రి మేకపాటి.


అమరావతి (ప్రజా అమరావతి);


ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు : మంత్రి మేకపాటి.పవిత్ర పర్వదినమైన రంజాన్ పండుగ సందర్భంగా సోదర, సోదరీమణులకు  *రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* శుభాకాంక్షలు తెలిపారు. ధర్మబద్దమైన జీవితం, సమాజంలో  బాధ్యత కలిగిన పౌరుడిగా ఎలా మెలాగాలి, ఉన్నంతలో పరులకు దానం, సాటి మనుషులపట్ల మానవత్వం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సహా ఎన్నో సుగుణాలను  రంజాన్ ఉపవాస మాసం నేర్పిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూనే ప్రతి ఒక్కరూ సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని కాంక్షిస్తున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కరోనా వైరస్ ఉధృతమవుతున్న వేళ ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని, కరోనా వైరస్ అంతమయ్యేలా ప్రార్థనల ద్వారా అల్లాహ్ ను ప్రార్థించాలని ఆయన ఆకాంక్షించారు.