కృష్ణా జిల్లా మత్స్యశాఖ రెండేళ్ళ ప్రగతి
మత్స్యకారుల చేపల వేట నిషేద కాల జీవన భృతిని పెంచి వారిని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోన్ రెడ్డి
మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధకాల భృతిగా జిల్లాలో 11946 మందికి రూ. 10 వేలు చోప్పున 1194.60 లక్షల ఆర్థిక సహాయం..
చేపల వేట సమయంలో ప్రమాద వశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు..
వైఎస్ఆర్ మత్స్య భరోసాగా 2231 మోటారు బోట్లకు లీటరుకు రూ. 9 చొప్పున సబ్సిడీ..
జిల్లాలో ఆక్వా సాగు రైతులకు విద్యుత్ ఛార్జీలు రాయితీతో 26 వేల మంది రైతులకు రూ. 285 కోట్లు ప్రయోజనం..
విజయవాడ,మే 31(ప్రజా అమరావతి):- దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మత్స్యఉత్పత్తుల్లో ప్రధమ స్థానంలో ఉంది. 2020-21 సంవత్సరంలో 13,83,110 టన్నులు మత్స్య ఉత్పత్తులు కృష్ణా జిల్లా నుండి ఎగుమతి అయ్యి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో మత్య్సకారులకు పడుతున్న కష్టనష్టాలను దగ్గరగా చూచి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో నవరత్నాలను అమలు చేస్తూ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారు. కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల తీర ప్రాంతము ఉంది. సుమారు 1,12,977 మంది మత్య్సకారులు చేపల వృత్తినే జీవనాధరాముగా సాగుతున్నారు.
వై.ఎస్ ఆర్ మత్స్యకార భరోసా : -
సముద్రం పై చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం రూ.4 వేలు మాత్రమే భృతిని అందించగా నేటి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా రూ .10 వేలకు పెంచి అందిస్తుంది. జిల్లాలో ఈ పథకం క్రింద 2019-20 సంవత్సరంలో 1,02,332 మంది లబ్దిదారులకు, రూ.102.33 కోట్లు, 2020 - 2021సం.రంలో 1,09,237 మంది కి రూ . 109.23 కోట్లు, 2021-2022 సం.రంలో 1,19,875 కుటుంబాలకు రూ.119.875 కోట్లను నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసి ఆదుకుంది.
చేపల వేట చేయు మత్య్సకారుల నావలకు ముందస్తు సబ్సిడీ పై ఆయిల సరఫరా :-
గతంలో లీటర్ డీజిల్ పై రూ.6.03 పై ఉన్న సబ్సిడీని ఈ ప్రభుత్వం రూ.9 /- లకు పెంచి జిల్లాలో రిజిస్టర్ కాబడిన 2231 మెక నైజ్డ్ మోటా రైజ్ నాన్ మోటా రైజ్డ్ బోట్లకు రాయితీని అందించడం జరుగుతుంది.
వైఎస్ భరోసా ఎక్స్ గ్రేషియా పెంపు :-
సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఇప్పటివరకు వారి కుటుంబానికి ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచటం జరిగింది. జిల్లాలో చేపల వేటనే జీవన వృత్తిగా చేసుకుని జీవిస్తున్న 1,12,977 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం పర్తిస్తుంది. 2020-21సం.రంలో ఈ పథకం కింద ప్రమాద వశాత్తు మరణించిన 8 మంది మత్స్యకార కుటుంబాలకు శాఖా పరంగా రూ. 5 లక్షలు, వైఎస్ఆర్ బీమా నుండి మరో రూ. 5 లక్షలు చెల్లించడం జరిగింది.
ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు : -
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీలు యూనిట్ ధరను రూ 1.50.కే సరఫరా చేస్తున్నందున జిల్లాలోని 53,550 మంది ఆక్వా రైతులకు ఏడాదికి రూ.720 కోట్ల రాయితీ ప్రయోజనం చేకూరింది. కోవిడ్- 19 విపత్కర పరిస్థితుల్లో కర్ప్యూవలన ఆక్వా రైతుల సాగుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసి ఆక్వా సాగుకు భరోసా కల్పించింది.
ఆక్వా రైతుల కోసం తీసుకున్న సంస్థాగత సహాయ చర్యలు :-
ఆక్వా రంగాన్ని క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ద్వారా ఆక్వారైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ తో పాటు నాణ్యమైన ఫీడ్ , సీడ్ ను సరఫరా చేయండ జరుతుంది. ఆక్వా ఉత్పత్తులను సరైన గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ ఫిష్ విదానాన్ని అమలు చేస్తుంది.
ఆక్వా వైయస్ఆర్ మత్స్య సాగుబడి :-
రాష్ట్రంలో 9 తీరప్రాంత జిల్లాల్లో 35 ఆక్వాలాబ్స్ స్థాపించడానికి రూ.50.30 కోట్లు కేటాయించగా, జిల్లాలో కైకలూరు, గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, కంకిపాడు ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఈ ల్యాబ్ లు ద్వారా చేపలు, రొయ్యల సీడ్ మరియు ఫీడ్ నాణ్యత పరీక్షలు పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాటు ఆక్వా రైతులకు సాంకేతిక పరమైన పలు సూచనలు సలహాలు అందించేందుకు సమీకృత కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
చేపల హార్బర్ల నిర్మాణం :-
974 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ లో సముద్రంలోని లోతు జలాల్లోఉన్న అపార మత్స్య సంపదను తెచ్చుకుని నిల్వ చేసుకునే సామర్థాన్ని గత ప్రభుత్వం కల్పించలేదు. తత్ఫలితంగా మత్స్యకారులకు తగిన తగిన ఆదాయం లేక ఇతర రాష్ట్రాల్లో ఫిషింగ్ బోట్ల పై పనిచేసేందుకు వలసలు వెళుతున్నారు. మత్స్యకారుల స్థితి గతులను గుర్తించి మూడు అనుకూలమైన ప్రదేశాలలో రూ. 8 వేల కోట్ల తో ప్రపంచ స్థాయిలో వసలు ఉండే విధంగా సమీకృత చేపల రేవులు ఫిషింగ్ హార్బర్ లను మూడేళ్లలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాగరమాల పేజ్ -2 కింద రూ. 348 కోట్లతో మచిలీపట్నం ఫిషింగ్ హార్భర్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
addComments
Post a Comment