శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి) :
ప్రస్థుత వర్ధమాన కాలములో కరోనా తీవ్రత ఉదృతముగా ఉన్నకారణముగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ మతి వాణీ మోహన్, ఐ. ఏ. ఎస్ గారు, కమీషనరు శ్రీ పి.అర్జున రావు, ఐ. ఏ. ఎస్ గారు దేవాదాయశాఖ అధికారులు మరియు రాష్ట్రంలోని దేవాలయముల కార్యనిర్వహణాధికారి వార్లతో ప్రతి 2 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించు సమీక్ష సమావేశం నందు ప్రజలు ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సంకల్పించి అన్ని దేవస్థానం ల యందు జరుగు కార్యక్రమములు యందు భక్తులు ప్రత్యక్షంగా పాల్గొను అవకాశం లేనందున, గూగుల్ meet మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సదరు కార్యక్రమములును భక్తులకు చేరువ చేయవలసిందిగా ఆదేశించిన మేరకు గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు దేవస్థానం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు ప్రజలు అందరు ఆయురాగ్యములతో సుభిక్షముగా ఉండాలని సంకల్పించి ది.27-05 -2021 నుండి ప్రతిరోజు ఉదయం 08.30 గం. ల నుండి 09.గం. ల వరకు శ్రీ అమ్మవారి నామ, వేద మంత్రోచ్ఛరణలు వేదపండితులు మరియు అర్చక సిబ్బందిచే జరిపించుటకు ఏర్పాట్లు చేసియున్నారు. ఈ కార్యక్రమం జరుగుచున్న సమయంలో భక్తులు(ఇంటి వద్ద నుండి మాత్రమే) google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc) ద్వారా పాల్గొని, వేదపండితుల వారితో గళము కలిపి మానసిక ప్రశాంతత, సంపూర్ణ శరీర ఆరోగ్యత మరియు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కృప పొందుటకు గాను కార్యనిర్వహణాధికారి వారు భక్తులకు అవకాశం కల్పించడమైనది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ లింక్ ద్వారా ఈ కార్యక్రమం నందు పాల్గొని, శ్రీ అమ్మవారి నామ మంత్రోచ్ఛరణ కార్యక్రమం నందు పాల్గొని, భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారి నామ స్మరణ చేయడం జరిగినది.
addComments
Post a Comment