ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*కొత్తగా 14 మెడికల్ కాలేజీలకు శంకుస్ధాపన కార్యక్రమం*


*క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా మెడికల్‌ కాలేజీల నిర్మాణ శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాలలకు శంకుస్ధాపన.*


ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



*కృష్ణవేణి, విజయనగరం జిల్లా.* 


*ఆంధ్రప్రదేశ్‌ మహిళలందరి తరుపున మీకు చెప్తున్నాను. వైద్య రంగానికి మీరు చెప్తున్న మాటలు విన్నాను... ఇంతవరకు వైద్యో నారాయణో హరీ అనేవాళ్లం.. ఇప్పుడు జగనన్న నారాయణో హరీ అంటాం.*

 

ఈ రెండు సంవత్సరాలు మంచి పాలన అందించినందుకు మా విజయనగరం జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదములు. విజయనగర ప్రజల చిరకాల వాంఛ అనేది మీ రూపంగా తీరుతుంది. ప్రభుత్వ మెడికల్‌ హాస్పిటల్‌ అనేది కేవలం జగనన్న వల్ల మాత్రమే సాధ్యమైంది. అందుకు మా విజయనగర ప్రజల తరపున మీకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను. మా విజయనగరం జిల్లాలో ఎక్కువగా పేద ప్రజలకు ఉండటం వల్ల, వైద్యం అందక పొరుగురాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. వైద్యం అందక చనిపోయేవారు. అలాంటిది ఇప్పుడు  కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉన్న ఆధునిక సదుపాయాలు మీరు చేకూర్చడం వల్ల మీరు పేదలందరికీ ప్రాణం పోసిన దాతలవుతున్నారు. ఇప్పుడు పాడేరులో మీరు మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నారు. మూడు జిల్లాల్లో సుమారు 10 లక్షలకు పైగా గిరిజనుల ఉన్నారు. అలాంటి వారికి, కొండల్లో అనారోగ్యం వచ్చినప్పుడు డోలీలు కట్టి తీసుకురావాలి. మధ్య దారిలో చనిపోయే పరిస్ధితులు ఉన్నాయి. అలాంటి పరిస్ధితులు గట్టెక్కించి మా గురించి ఇంతలాఆలోచించినందుకు మీకు మరొక్కసారి శిరస్సువంచి అభినందనలు తెలియజేస్తున్నాను. 

మా పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివించాలంటే సరైన సదుపాయం లేక, అలాగే ప్రైవేటు స్కూల్లో చదివించే స్టోమత లేక చాలా బాధపడేవాళ్లం. ఈ రోజు మా బాధలు తీర్చడానికి మీరు వచ్చారు. మీరు ఎల్లకాలం మా ముఖ్యమంత్రిగా ఉండాలి.  ఆంధ్రప్రదేశ్‌ మహిళలందరి తరుపున మీకు చెప్తున్నాను. వైద్య రంగానికి మీరు చెప్తున్న మాటలు విన్నాను... ఇంతవరకు వైద్యో నారాయణో హరీ అనేవాళ్లం.. ఇప్పుడు జగనన్న నారాయణో హరీ అంటాం. మిమ్నల్నే దేవుడిగా కొలిచే అవకాశం మాకు ఇస్తున్నారు. మీరు సచివాలయ వ్యవస్ధను ఏర్పాటు చేయడం వల్ల, కరోనా కష్టకాలంలో జ్వరం వచ్చి ఇరుగుపొరుగు వారు ఆదరించలేని పరిస్ధితి ఉంటే... వలంటీర్‌ని నేరుగా ఇంటికి పంపించి ఫీవర్‌ సర్వే చేయించి కరోనా వస్తే వాళ్లకి కిట్‌లు పంపించారు అన్న. ఎందుకంటే కరోనా వచ్చిందని చెప్తే.. పక్కవాళ్లు మాట్లాడని పరిస్ధితి. అలాంటిది వలీంటర్లను పంపించి ఎంతో ధైర్యం చెప్పారు. ఈ వ్యవస్ధ చాలా గొప్పది. అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు.. అలాంటిది అడగకుండానే ఇచ్చేది జగనన్నే. కరోనా టైంలో పనుల్లేక ఇబ్బందుల్లో ఉన్న మేం.. మీరిచ్చిన పథకాల వల్ల బ్యాంకుల్లో పడిన డబ్బులతో మేం ఆవసరాలు తీర్చుకోగలుగుతున్నాం. ఐటీసీ, అమూల్‌ వంటి సంస్ధలతో టైఅప్‌ చేసి మమ్మల్ని లక్షాధికారులు కమ్మన్నారు.. కచ్చితంగా మేం వ్యాపారాలు చేసి కోటీశ్వరులం అవుతాం అన్నా. 


*డాక్టర్‌ శరత్‌ చంద్ర, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా.*


*మెడికల్స్‌ హబ్స్‌ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, అభివృద్ధిని వికేంద్రీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. ప్రైమరీ హెల్త్‌ కేర్‌ దగ్గర నుంచి టెరిషియరీ హెల్త్‌ కేర్‌ వరకు కూడా మీకున్న విజన్‌ చాలా అద్భుతం.*

*ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం.* 


ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. జొన్నన్నం, రాగన్నం తినే స్ధాయి నుంచి ఎంతో కాలం వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి నాగార్జున సాగర్‌ తర్వాత ఏర్పడిన అతిపెద్ద ప్రాజెక్టు మెడికల్‌ కళాశాల. నాగార్జున సాగర్‌ ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మార్పు తీసుకొచ్చింది. ఆ తర్వాత అంత పెద్ద స్ధాయిలో మార్పు చేయగలిగే ప్రాజెక్టు టీచింగ్‌ హాస్పిటల్‌. 

2007లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యానికి గుంటూరు వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజు ఈ మెడికల్‌ కాలేజీ రావడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్య జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడతాయి. ఈ మెడికల్‌ కాలేజీ అత్యంత ఉన్నత ప్రమాణాలతో, అత్యంత ఉన్నత స్ధాయి వైద్యం అన్నిరకాల జబ్బులకు అందించబోతుంది. ఈ పల్నాడు ప్రాంత ఆరోగ్య ఆవసరాలు ఈమెడికల్‌ కాలేజీ ద్వారా తీరుతాయి. సీఎం గారికి ఒక విషయం తెలియజేయదల్చుకున్నాను. మెడికల్‌ కాలేజీ స్ధాపన వల్ల కేవలం అభివృద్ధిగా కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. మెడికల్స్‌ హబ్స్‌ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, అభివృద్ధిని వికేంద్రీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. ప్రైమరీ హెల్త్‌ కేర్‌ దగ్గర నుంచి టెరిషియరీ హెల్త్‌ కేర్‌ వరకు కూడా మీకున్న విజన్‌ చాలా అద్భుతం. ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. 


*జయలక్ష్మి, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లా*


*మా ఆయన కరోనా బారిన పడ్డారు.*

*104 కి కాల్ చేస్తే... నా భర్త వివరాలు తీసుకుని ఆసుపత్రిలో తీసుకెళ్లి చికిత్స అందించారు. నా మాంగళ్యం నిలబడింది అంటే మీ వల్లే అన్నా.*


మీ వల్ల, మా అనకాపల్లిలో ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మా ఆయనకు కరోనా వల్ల ఇబ్బంది ఎదురై తను బతకడం కష్టమన్నారు, నేను విశాఖ ఆసుపత్రికి వెళ్ళడానికి 104 కి కాల్‌ చేశాను, వాళ్ళు నా భర్త వివరాలు తీసుకున్నారు, పావుగంట తర్వాత కలెక్టర్‌ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, నాకు చాలా ధైర్యం వచ్చింది, నా మాంగళ్యం నిలబడింది అంటే నువ్వే అన్నా, నా పసుపుకుంకుమలు నిలబెట్టారు మీరు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి, మా ఆయన తిరిగి వస్తారనుకోలేదు, 22 రోజులు విమ్స్‌ హాస్పిటల్‌ దగ్గర ఉన్నాను మా ఆయన కోసం, అప్పుడు రోజూ మీరే గుర్తుకొచ్చారు. కోవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు, ప్రతీ రోజూ కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి ఆరా తీసేవారు, ఎవరైనా డబ్బలు అడుగుతున్నారా అని అడిగేవారు. ఇంతగా ఎవరూ చేయలేదు. మా ఆయన బతికున్నారంటే మీరే కారణం, ఎక్కడా నయా పైసా చెల్లించలేదు, నాకు వేరే పధకాలు కూడా వచ్చాయి, మీరు ఎప్పుడూ మా పేదల గురించే ఆలోచిస్తారు, మీరు కలకాలం చల్లగా ఉండాలి


*రాధ, ఎర్రమంచి గ్రామం, పెనుకొండ, అనంతపురం జిల్లా*


సార్‌ మా ఆయనకు వెన్నెముక సమస్య, మేం రైతులం, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితులు ఉన్న సమయంలో మా ఏరియా వలంటీర్‌ వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి అన్ని సలహాలు ఇచ్చారు, ఆరోగ్యమిత్రని కలిసి అన్ని చెప్తే మాకు అనంతపురం ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేసి అన్నీ ఫ్రీగా ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా బెడ్‌రెస్ట్‌ తీసుకునే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ. 8,300 ఇచ్చారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి స్కూలు కూడా చాలా బాగా చేశారు, మాలాంటి పేదలకు మీరు చాలా సాయం చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు సార్‌.


*ఎల్‌.లక్ష్మి, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా.* 


*మా కోనసీమ చూసి అందరూ బాగుంది, బాగుంది అంటారు కానీ, ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. మీకు ఆ ఆలోచన వచ్చి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం.*


బడుగు, బలహీన వర్గాల కోసం మీరు ఆసుపత్రి నిర్మిస్తున్నారు. మాకు ఎంతో ఆనందకరమైన విషయం. మా కోనసీమ చూసి అందరూ బాగుంది, బాగుంది అంటారు కానీ, ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. మీకు వచ్చి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం. ఆసుపత్రి అంటే అందులో మా పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మాకు ఆరోగ్య పరంగానూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ప్రజలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నవరత్నాలు ద్వారా ఇన్ని రకాల ప్రయోజనాలు మీరు మాకు అందిస్తున్నారు. గతంలో ఆసుపత్రికి వెళ్లాలంటే రాజమండ్రి, కాకినాడ వెళ్లాలి. అలా వెళ్లలేక ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. ఇక్కడే ఆసుపత్రి పెట్టడం వల్ల పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది.  కరోనా టైంలో మీరు పెట్టిన క్వారంటైన్‌ సెంటర్లు పెట్టడం వల్ల, అది ఇతరులకు అంటుకోకుండా చూడ్డమే కాకుండా.. మంచి భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎప్పటికీ కూడా మీరే మాకు సీఎంగా ఉండాలి. ఈ రోజు ఏపీలో ప్రతి ఒక్కరూ కూడా మా జగనన్న బాగుండాలి అని కోరుకుంటున్నారు. మీరు ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకులా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని అన్నా అని పిలుస్తున్నారు. తండ్రి తర్వాత పెద్ద కొడుకులా మీరు మా కుటుంబాల బాధ్యత తీసుకున్నారు.

Comments