చంద్రబాబును చూసుకుని తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు

 


- చంద్రబాబును చూసుకుని తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు 


- మిడతలు, పనికిమాలిన పార్టీలు ఏమీ చేయలేవు 

- పతనం చేయాలని చూసే తుప్పు, పప్పులకు అదే గతి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాడేపల్లి, మే 30 (ప్రజా అమరావతి): గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని తప్పులు చేసిన వారు వైసీపీ ప్రభుత్వంలో శిక్ష అనుభవించక తప్పదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఒక వెన్నుపోటుదారుడని , ఆయన గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతుంటాడని, అవసరం ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తాడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అనేక అరాచకాలు చేశారని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును లూటీ చేసిన లుచ్చాగాళ్ళను వదిలి పెట్టే ప్రసక్తి ఉండదన్నారు. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బాబు ఖర్జూరనాయుడు, వాళ్ళ తాత, తండ్రులు లవంగంనాయుడు, కిస్మిస్ నాయుడులు ఎవరైనా కావచ్చన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును చూసుకుని ఎవరైతే విర్రవీగి అవినీతికి పాల్పడ్డారో, తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీగాని, ఇంకే ఇతర పార్టీలు గాని మాకు ప్రత్యర్ధులు కారని అన్నారు. గతంలో ఒక పార్టీ నాయకుడు సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు రాస్కోవాలని, ఇది శాసనం అని చెప్పాడన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహనరెడ్డిని అనేక మంది అవహేళన చేశారన్నారు. జగన్ పగటి కలలు కంటున్నాడని, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేడని విమర్శలు చేశారన్నారు. కొంత మంది వ్యక్తులు, కొన్ని పార్టీలు కలిసినా జగన్మోహనరెడ్డిని సీఎం కాకుండా ఆపే శక్తి ఉండదన్నారు. రాష్ట్రంలో ప్రజలు, దేవుడు ఆశీస్సులు ఉండగా చిన్న చిన్న మిడతలు, పనికిమాలిన పార్టీలు జగన్ ను ఏం చేయగల్గుతాయని ప్రశ్నించారు. సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించిక తప్పదన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు జీవితకాలం సమయం ఇస్తున్నామని, సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని వారు బతికుండగా దించలేరన్నారు. చంద్రబాబు, లోకేష్ లు టీడీపీ నుండి వెళ్ళిపోతున్న వారిని ఆపేందుకు 2024 లో అధికారంలోకి వచ్చేస్తామని, మీరంతా మాతోనే ఉండండంటూ అమాయకులను సొల్లు కబుర్లతో మభ్య పెడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదన్నారు. పప్పునాయుడు లోకేష్ ఎమ్మెల్యే కూడా అవడని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వెధవ లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందంటే ఎవరైనా వింటారా అని అన్నారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చంద్రబాబు భజన చేసుకుంటూ తలకాయ లేని వ్యక్తులు కొంత మంది తిరుగుతుంటారని, వీరంతా ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకుంటారన్నారు. అటువంటి బుర్ర తక్కువ వాళ్ళకు పప్పు, తుప్పునాయుడులు అధికారంలోకి వచ్చేస్తామని, ఆ తర్వాత వేధిస్తామని ప్రగల్భాలు పలుకుతుంటారని, వీరు జగన్ చిటికిన వేలు మీద బొచ్చు కూడా పీకలేరన్నారు. సోనియాగాంధీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు జగనను ఏమీ చేయలేక ఇక్కడ దుకాణం సర్దుకుని, డిపాజిట్లు పోగొట్టుకుని వెళ్ళిపోయారన్నారు. జగన్ కు ఎదురొచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితులను అందరం చూశామన్నారు. జగనను అంతం చేయాలని, పతనం కావాలని చూసిన వ్యక్తులు ఈ రోజు అలోలక్షణా అంటూ అడుక్కు తినే పరిస్థితుల్లో జీవశ్చవాల్లా బతుకుతున్నారన్నారు. జగన్ ను పతనం చేయాలనే చూసే తుప్పు, పప్పు నాయుడులకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు.