అమరావతి (ప్రజా అమరావతి);
కరోనా విపత్తుకు తగ్గట్లుగా ముందస్తు ప్రణాళిక, కార్యాచరణ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
*మంగళవారం సాయంత్రం నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖపై మంత్రి మేకపాటి అధ్యక్షతన సమీక్ష సమావేశం*
*శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి*
జులై నుంచి నైపుణ్యశాఖ ఆధ్వర్యంలో మొదలవనున్న శిక్షణ కార్యక్రమాల గురించి మంత్రి మేకపాటికి తెలిపిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు
మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్.ఆర్ పాలసీని పునరుద్ధరించేందుకు అవసరమైన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఎండీ
కమిటీకి షార్ట్ లిస్ట్ అయిన పేర్లు ఒకసారి పంపిస్తే పరిశీలించి ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి దిశానిర్దేశం
నైపుణ్య కళాశాలలకు సంబంధించిన నమూనాలు, ఆకృతుల ఖరారుపైనా చర్చ
జూలై 8 కల్లా..వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 30 కళాశాలల శంకుస్థాసన జరిగేలా మంత్రి గౌతమ్ రెడ్డి మార్గనిర్దేశం
పాలనా అనుమతులు పూర్తయితే లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి
నిధులు సమకూర్చడంపైనా కసరత్తు పూర్తికి కృషి చేయాలని మంత్రి ఆదేశం
గత, ప్రస్తుత సంవత్సరాలలో విడుదలైన బడ్జెట్, సీఎఫ్ఎంఎస్ లో క్లియర్ అయిన బడ్జెట్ లపై చర్చించిన మంత్రి గౌతమ్ రెడ్డి
నైపుణ్య వికాసం, గిరిజన విద్యార్థులకు అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపైనా మంత్రి మేకపాటి ఆరా
నైపుణ్య శాఖకు సంబంధించిన స్కిల్లింగ్ పోర్టల్, సోషల్ ఆడిట్ పైనా వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
కొప్పర్తిలో మొబైల్ మానుఫాక్చరింగ్ సహా రాబోతున్న పరిశ్రమలకు అనుగుణంగా అందించవలసిన శిక్షణపై ముందస్తు చర్యలు చేపట్టాలన్న మంత్రి ఆదేశం
ఉద్యోగ అవకాశాలను పెంచే అత్యాధునిక కోర్సులను రాష్ట్ర యువతకు అందుబాటులోకి తీసుకురావడంపై కసరత్తు చేయాలన్న మంత్రి గౌతమ్ రెడ్డి
ఐ.టీ సలహాదారుల సహకారంతో పరిశ్రమలకు అవసరమైన కోర్సుల ఎంపిక, శిక్షణపై నిర్ణయం తీసుకునే దిశగా కృషి
ఆగస్ట్ 15 కల్లా ఏ ఏ కోర్సులు ఖరారు, శిక్షణ అందించబోతున్నామన్నదానిపై స్పష్టతనిస్తామని వెల్లడించిన ఏపీఎస్ఎస్ డీసి ఎండి బంగారు రాజు
దస్సాల్ట్, సీమెన్ ల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిని పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనా ప్రత్యేక చొరవ చూపాలన్న నైపుణ్యశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి
84 పాలిటెక్నిక్ కాలేజీలలో ఐ.టీ, సీసీఎన్ఏ కోర్సుల గురించి మంత్రి మేకపాటికి వివరించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నాయక్
పాలిటెక్నిక్ కాలేజీలలో జరుగుతున్ప పనులు, పూర్తవుతున్న దశలో ఉన్నవి, టెండర్ల దశలో ఉన్నవాటిపై మంత్రికి వివరించిన నైపుణ్యశాఖ అధికారులు
పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి టెండర్ల దశలో ఉన్న 12 కాలేజీల జాబితాను పంపాలన్న మంత్రి
ఐ.టీ.ఐ, పాలిటెక్నిక్ కాలేజీలలో అత్యాధునికతకు పెద్దపీట వేయాలని మంత్రి మేకపాటి ఆదేశం
మౌలికసదుపాయాలు, తరగతులు, వనరులు, కోర్సుల వంటి అంశాలపై సమగ్ర నివేదికను కోరిన మంత్రి మేకపాటి
ఐ.టీ.ఐ కాలేజీలలో అందిస్తున్న శిక్షణ సహా టెక్నాలజీ అంశాలను మంత్రి దష్టికి తీసుకువెళ్లిన ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి
ఇప్పటికే ఐ.టీ.ఐ కాలేజీలలో పనిచేసే 430 మంది ఒప్పంద అధ్యాపకుల గడువు పెంపు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్య వేణి
ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల కొనసాగింపు, కొత్తగా 230 ఏ.టీ.ఓల నియామకానికి సంబంధించిన ఫైలుపై మంత్రికి వివరించిన లావణ్య వేణి
మంత్రి ఆదేశాల మేరకు అధ్యాపకుల పోస్టుల మంజూరుకోసం ఇప్పటికే ఫైల్ పంపామని, ఆర్థిక శాఖలో అనుమతులు రాగానే భర్తీ చేస్తామని మంత్రి మేకపాటి వెల్లడి
ఈ సందర్భంగా మంత్రి మేకపాటి చొరవతో పెండింగ్ లో ఉన్న ఒప్పంద అధ్యాపకుల జీతాలపై క్లారిటీ వచ్చినట్లు ప్రస్తావించిన ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి
ఈ వారంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో సమావేశమై ఆర్థికంగా ముడిపడిన వాటిపై అంశాలవారీగా స్పష్టత దిశగా చర్చిస్తామన్న మంత్రి మేకపాటి
సీడాప్ లో ఎక్కువ శాతం ప్రాక్టికల్ గా శిక్షణ అందిస్తామని మంత్రికి తెలిపిన సీడాప్ సీఈవో
ఎక్కువ శాతం భౌతికంగా నేర్చుకునేందుకే అవకాశం ఉన్న నేపథ్యంలో 3డీ టెక్నాలజీతో వర్చువల్ రియాలిటీపై శ్రద్ధ పెట్టాలని మంత్రి మేకపాటి దిశానిర్దేశం
మల్టీ స్కిల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాటికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్న నైపుణ్య శాఖ అధికారులు
2020-2021 మార్చి నుంచి కోవిడ్ కారణంగా 3070 మందికి శిక్షణ ఇచ్చాం. 1169 మందికి ఉద్యోగాలు లభించాయి : సీఈవో మహేశ్వర్ రెడ్డి
ముందస్తు ప్రణాళికతోనే ఏదైనా సాధ్యం, కోవిడ్ ప్రభావం పడకుండా 2,3 రకాల కార్యాచరణకు సిద్ధం కావాలన్న మంత్రి మేకపాటి
సమీక్షకు హాజరైన నైపుణ్యాభివద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఉపాధి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ బంగార్రాజు, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, సీడాప్ సీఈవో మహేశ్వర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.హనుమ నాయక్ తదితరులు.
addComments
Post a Comment