సకాలంలో రాష్ట్ర్రానికి ఆక్సిజన్ వచ్చేలా ముగ్గురు సీనియర్ అధికారుల నియామకం...

 సకాలంలో రాష్ట్ర్రానికి ఆక్సిజన్ వచ్చేలా

ముగ్గురు సీనియర్ అధికారుల నియామకం...


రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

రోజుకు 15 వేల వరకూ టెలీ మెడిసిన్ సేవలు అందేలా ఏర్పాట్లు

భవిష్యత్తులో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత రానివ్వకుండా చర్యలు

మరో 50 వేల ఇంజక్షన్ల కొనుగోలుకు నిర్ణయం

వ్యాక్సిన్ పంపిణీలో రద్దీ నివారణకు పటిష్ట చర్యలు : రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

అమరావతి, మే 11 (ప్రజా అమరావతి) : ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సకాలంలో రాష్ట్రానికి వచ్చేలా ముగ్గురు సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశాలో ఈ ముగ్గురు అధికారులు రెండు వారాల పాటు ఉండి, ఆక్సిజన్ ను ఏపీకి అనుకున్న సమయానికే ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటారన్నారు. భవిష్యత్తులో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత రాకుండా ఉండేలా మరో 50 ఇంజక్షన్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 86,878 కరోనా టెస్టులు చేయగా, 20,345 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయని, 108 మంది మృతి చెందారని తెలిపారు. చిత్తూరులో సంభవించిన 18 మరణాల వల్ల ఈ సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో కరోనా వైద్య సేవలకు అనుమతి పొందిన 636 ఆసుపత్రుల్లో 6,792 ఐసీయూ బెడ్లు ఉండగా, 6,304 నిండిపోయాయన్నారు అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు 23,358 ఉండగా, 22,266 బెడ్లు నిండి ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 కొవిడ్ కేర్ సెంటర్లలో 15,553 మంది పేషంట్లు చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో పూర్తి అవసరాలకు తగ్గట్టుగా గడిచిన 24 గంటల్లో 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. తన వాటాగా వచ్చిన 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడిపించుని, అన్ని ఆసుపత్రులకు అందజేసిందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆక్సిజన్ కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వినియోగించాలని జిల్ల కలెక్టక్లరకు ఆదేశించామన్నారు. 

సకాలంలో ఆక్సిజన్ సరఫరాలో ముగ్గురు అధికారుల నియామకం...

ఆక్సిజన్ రవాణాలో ఆటంకాలు తలెత్తకుండా, సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా ముగ్గురు సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య  కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తమిళనాడు కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికళ వలవన్ ను, మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములను కర్నాటకకు, ఒడిశాకు మాజీ ఐఏఎస్ అధికారి ఏకె ఫరిదార్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారన్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడా ఆలస్యం, సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఆ ముగ్గురు సీనియర్ అధికారులు... ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్లాంట్లతో సమన్వయం చేసుకుంటారన్నారు.  రెండు వారాల పాటు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఉండి, ఆక్సిజన్ సరఫరాకు కృషి చేస్తారన్నారు. ప్లాంట్ తో పాటు మార్గంలో కూడా ఇబ్బందుల తలెత్తకుండా చర్యలు తీసుకుంటారన్నారు. 

రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత రానివ్వం...

అనుమతులు పొందని ప్రైవేటు ఆసుపత్రులకు 10,201 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందజేశామన్నారు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం 7,754 ఇంజక్షన్లు అందజేయగా, మిగిలినవి ఆయా ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 22,399 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత నివారణకు మరో 50 ఇంజక్షన్లు ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఇంజక్షన్లు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయన్నారు. 

రోజుకు 15 వేల మందికి టెలీ సేవలు అందించేలా ఏర్పాట్లు..

టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు సేవలందించడానికి 3,496 మంది డాక్లర్లు సేవలందిస్తున్నారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారంతా కరోనా బాధితులకు ఫోన్ చేసి, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ మందుల వినియోగం, ఇతర సలహాలు సూచనలు అందేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 9,796 హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులకు వైద్యులు ఫోన్ చేసి సలహాలు సూచనలు అందజేశారన్నారు. బుధవారం(12.5.2021) నుంచి 15 వేల మందికి ఫోన్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. గడిచిన 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 16,002 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ సమాచారాలకు 6,492 ఫోన్లు, అడ్మిషన్ల కోసం 3,652, కరోనా టెస్టుల కోసం 3,146, టెస్టు రిజల్ట్ కోసం 2,076 ఫోన్లు వచ్చాయన్నారు. 

బెడ్ల కొరత రానీయొద్దంటూ సీఎం జగన్ ఆదేశం..

స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారని ఆయన తెలిపారు. బెడ్ల కొరత రానీయకుండా ఆసుపత్రుల ఆవరణలో జర్మన్ హ్యాంగర్లతో బెడ్లను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లనను వైద్యపరంగా వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్ధేశం చేశారన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా, మోనటరింగ్ కు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిర్వహణకు తూర్పు నావికా దళం ఏర్పాటు  చేసిన నాలుగు బృందాలు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించి, సలహాలు సూచనలు అందజేశాయన్నారు. 

వ్యాక్సిన్ పంపిణీలో రద్దీ నివారణకు పకడ్బందీ చర్యలు...

వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తలిపారు. 100 మందికి సెకండ్ డోస్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. సెకండ్ డోస్ తీసుకునే వారికి ఎస్ఎంఎస్ లు, వలంటీర్ల ద్వారా  సమాచార మిస్తున్నామన్నారు. దీనివల్ల కేంద్రాల్లో రద్దీ నివారణ సాధ్యమవుతుందన్నారు.  తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ఇప్పటికే ఎక్స్ గ్రేషియాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు.  

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image