*పుత్తూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆనకట్ట కొంత మేర క్షయం కావడంతో పుత్తూరు మరియు ఈశ్వరాపురంలో స్టోరేజ్ ట్యాంక్ కు సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశాం*
ఇరిగేషన్ మరియు పబ్లిక్ హెల్త్ శాఖ సిబ్బందితో మరమత్తు పనులు ప్రారంభం
ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దు.
: జిల్లా కలెక్టర్
పుత్తూరు, మే 18 (ప్రజా అమరావతి); పుత్తూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆనకట్ట కొంత మేర క్షయం కావడంతో పుత్తూరు మరియు ఈశ్వరాపురంలో స్టోరేజ్ ట్యాంక్ కు సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుత్తూరు మరియు ఈశ్వరాపురం వైపు ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క ఆనకట్ట కొంత మేర క్షయం కావడం జరిగిందని, దీని కరణంగా ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా ట్రాక్టర్లతో మట్టిని తీసుకువచ్చి క్షయం అయిన ఆనకట్టను తాత్కాలిక మరమత్తు చేయాలని ఇరిగేషన్ శాఖ మరియు పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖల ఎస్ఈ లను ఆదేశించడం జరిగిందని తెలిపారు. పుత్తూరు తహశీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తమై ఇక్కడ ఉదయం వాకింగ్ కి వెళ్ళే వారిని అప్రమత్తం చేసి వారిని తిరిగి ఇళ్లకు పంపడం జరిగిందని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ల సమన్వయంతో సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారంకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెరువు కట్ట తెగడం ద్వారా ప్రస్తుతం నీటి వరద వంటి ప్రమాదం ఏమి లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగా పుత్తూరు మరియు ఈశ్వరాపురం వైపు ఉన్న ప్రజలను అప్రమత్తం చేయవలసినదిగా రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తక్షణ చర్యలో భాగంగా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ వారు మరమత్తు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో చిత్తూరు ఆర్ డి ఓ రేణుక, ఇరిగేషన్ ఎస్ ఇ విజయ్ కుమార్, ఎస్ఇ పబ్లిక్ హెల్త్ వెంకటేష్, ఇరిగేషన్ ఇఇ వెంకట శివారెడ్డి, పుత్తూరు తహశీల్దార్ రవి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment