కోవిడ్ నియంత్రణకు అందరూ కలిసి కట్టుగా పని చేద్దాం

 కోవిడ్ నియంత్రణకు అందరూ కలిసి కట్టుగా పని చేద్దాం *ప్రతి ఆసుపత్రి నందు హెల్ప్ డెస్క్  ద్వారా కోవిడ్ బాధితు ల సమాచారం ను అందించండి* 


 *మాస్కులు,పిపిఈ కిట్ లకు ఎటువంటి కొరత లేదు* 


 *రెమిడెసివర్ ఇంజె క్షన్ ను ప్రభుత్వ ఆసు పత్రు లలో అందు బాటు లో ఉండేలా బ్లాక్ మార్కెట్ ని కట్టడి చేస్తాం* 


 *వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా సేవలంది స్తున్న ప్రైవేట్ ఆసుప త్రులలో తప్పని సరి గా 50 శాతం పడ క లు కోవిడ్ బాధితు లకు కేటాయిoచాలి* 


 *ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందు కు అదనపు సిబ్బంది నియామకం నకు చర్యలు చేపట్టండి* 


 *ప్రజలు తప్పని సరి గా కోవిడ్ నియమ నిబంధనలు పాటిం చి.. పాక్షిక కర్ఫ్యూ కు ప్రభుత్వా నికి సహ కరించండి:రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరి యు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి* 


 *ప్రజలు తప్పనిసరి గా మాస్కు ధరించి భౌతిక దూరం పాటి స్తూ... కోవిడ్ కట్టడిలో లో భాగస్వాముల మవుతాం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు శాఖ మాత్యులు*  *కరోనా విపత్కర పరిస్థితుల నుండి బయటపడేందుకు అందరూ సమిష్టి కృషితో పనిచేద్దాం: రాష్ట్ర పంచా యతీ  రాజ్ గ్రామీణాభివృద్ధి  శాఖ మాత్యులు* 


తిరుపతి, మే8 (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లాలో కోవిడ్ నియంత్రణకు  ప్రజా ప్రతి నిధులు, అధికారు లు అందరూ సమిష్టి కృషి...చిత్తశుద్ధితో పని చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అభినందిం చారు...


శనివారం ఉదయం తిరుపతి ఎస్.వి యూని వర్సిటీ సెనెట్ హాల్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్ను ల శాఖ మాత్యులు కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లతో కలసి కోవిడ్ నియంత్ర ణ చర్యలు, వ్యాక్సి నేషన్ ఇతర సంబంధిత అంశాలపై మంత్రి సమీక్ష సమా వేశం నిర్వ హించారు..


ఈ సమీక్ష లో తిరుపతి ఎం.పి గౌ.డా.గురుమూర్తి, గౌ.ప్రభుత్వ విప్ మరియు తుడా చైర్మన్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, గౌ. ఎం.ఎల్.సీ లు యం డవల్లి శ్రీనివాసులు రెడ్డి, గౌనివారి శ్రీనివాసు లు,దొర బాబు, గౌ.తిరుపతి, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి,చిత్తూరు,తంబల్లపల్లి, మదనపల్లి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,చింతల రామ చంద్రా రెడ్డి,ఆది మూలం, బియ్యపు మధు సూదన్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి,నవాజ్ భాష, జిల్లా కలెక్టర్ యం.హరి నారా యణన్, తిరుపతి, చిత్తూరు ఎస్.పి లు  వెంకట అప్పల నాయు డు,సెంథిల్ కుమార్, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా.శిరీ షా, జిల్లా జాయింట్ కలె క్టర్లు (అభివృద్ధి, సంక్షే మం)వి.వీర బ్రహ్మo, ఎన్. రాజశేఖర్,తిరుపతి నగర పాలక సంస్థ  కమీషనర్ గిరీష, మదన పల్లి సబ్ కలెక్టర్ జాహ్న వి,ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్,స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ,రుయా సూపరెండేంట్ డా.భా రతి,డి ఎం &హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్.డా.పెంచలయ్య, డా.సరళమ్మ, నోడల్ అధికారులు, సంబంధింత అధికా రులు పాల్గొ న్నారు...ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు సమర్ధ వంతంగా అవసరమైన అన్ని చర్యలు చేపడు తున్నారని తెలిపారు.. కోవిడ్ నియంత్రణకు ప్రజా ప్రతినిధులు, అధి కారులు, ప్రజలు అంద రూ భాగస్వాములై కలిసికట్టుగా చేద్దామని తెలిపారు.. గతంలో కన్నా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిం చాలని కోవిడ్  నియమ నిబంధన లను తప్పక పాటించాలని ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొ నేందుకు ప్రణా ళికాబద్ధంగా ముందు కు వెళ్తున్నామని తెలి పారు ఆక్సిజన్ కొరతను అధిగ మిం చేందుకు అనవసరమైన ఆక్సిజన్ వాడకం ను తగ్గించి అవసరమైన చోట వినియోగిం చేలా వైద్య సిబ్బంది తగు జాగ్ర త్తలు పాటించాలని, జిల్లాలో  ఆక్సిజన్ కొరత ను  తగ్గించేం దుకు 200 ఆక్సిజన్  కాన్సెం ట్రటర్స్(oxygen Concentrators) ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలి పారు.. కేసులు పెరుగు తున్నం దున అందుకు అనుగుణంగా పడకల సామర్థ్యాన్ని పెంచాలని, కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా బాధితు లకు వైద్య సేవలు అందించాలని సూచిం చారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా సేవలందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిలో తప్పనిసరిగా 50 శాతం పడగలను బాధితులకు కేటాయించాలని సూచిoచారు.. ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిం చేందు కు అదనపు సిబ్బంది నియా మకం నకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఆస్ప త్రి  లో హెల్ప్ డెస్క్ ద్వారా కోవిడ్ బాధి తుల సమాచారాన్ని వారి బంధు వులకు అందించాలని తెలిపారు.. పరీక్షల ఫలి తాలు సత్వరమే అందే విధంగా చర్యలు చేపట్ట నున్నట్లు వెల్లడించారు..రెమి డెసివర్ ఇంజక్షన్ ను ప్రభుత్వాసు పత్రుల్లో అందుబాటులో ఉండే లా... బ్లాక్ మార్కెట్ లో అమ్మకాల ను నియంత్రణ కు చర్యలు చేపడ తామని తెలిపారు..చంద్ర గిరి నియోజక వర్గంలో ఏర్పాటుచేసిన వంద పడకల ఆసుపత్రికి అవస రమైన సిబ్బంది నియామకం మరియు సత్యవేడు నియోజక వర్గంలో  ఆసుపత్రి ఏర్పాటుకు  కల  పరిస్థితులను పరిశీలించా లని, తిరుపతిలో మరణించిన కోవిడ్ మృతదేహా లను ఖననం చేసేందుకు అటవీ ప్రాంతంలో గల సమస్యను పరిష్క రించా లని, రుయా ఆసు పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాలేదని మంత్రిగారి దృష్టికి రాగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వా లని జిల్లా కలెక్టర్  ను  ఆదేశించారు.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు చేపట్టిన పాక్షిక కర్ఫ్యూను పటి ష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు


రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు మాట్లాడు తూ కోవిడ్ నియంత్రణ కు ప్రజలు సహకరించా లని, కోవిడ్ నియమ నిబంధనలు  ప్రజలు తప్పనిసరిగా పాటిం చేలా పోలీస్ అధికారు లు చర్యలు చేపట్టాలని తెలిపారు..


రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ మాత్యులు మాట్లాడు తూ ఈ విపత్కర పరి స్థితుల నుండి అందరూ కలిసి కట్టుగా పనిచేసి బయట పడేందుకు కృషి చేయాలని తెలి పారు.. జిల్లాలో కోవిడ్ పరీక్ష ఫలితాలు సత్వ రమే వచ్చేలా చర్యలు చేపట్టాలని తెలి పారు.. 


జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగు తున్నందున అందుకు అనుగు ణంగా పడకల సామర్థ్యం కూడా పెంచడం జరుగుతున్నదని, ప్రస్తు తం ఉన్న 10  కోవిడ్ కేర్ కేంద్రాల తో పాటు అదనంగా  ఏడు కేంద్రా లు ఏర్పాటుకు చర్యలు తీసుకుం టు న్నట్లు, పరీక్ష ఫలితాలను గతం కంటే త్వరగా వెల్లడించడం జరుగు తున్నదని, ప్రైవేట్ ఆస్పత్రిలో అధి క ఫీజులు వసూలు నియంత్రణకు సంబం ధించి టాస్క్ఫోర్స్ కమిటీ పని చేయడం జరుగుతుందని, 9 ప్రభుత్వాసుపత్రిలో జిల్లా వ్యాప్తం గా 2874 పడకల సామర్థ్యం కలదని, 294 వెంటిలేటర్లు అందుబాటులో కలవని, 37 ప్రైవేటు ఆసుపత్రిలో 2275 పడకల సామర్థ్యం తో  వైద్య సేవలు అందిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిం చడం జరుగుతుందని, 17 ట్రయేజ్ సెంటర్ల ద్వారా కోవిడ్ బాధితులకు పరీ క్షలు నిర్వహించడం జరుగు తున్నదని, జిల్లాలో 2021 జనవరి నుండి మే ఏడో తేదీ వరకు 5,43, 135 పరీక్షలు నిర్వహించగా అందు లో 50,456 పాజిటివ్ కేసులు రాగా 9.29 పాజిటివ్ గా కలదని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ న్ సమీక్షలో వివరించారు..Comments