దయచేసి ఇళ్లలోనే ఉండండి.
*అనవసరంగా బయటకు రావొద్దు*
*ప్రజలకు ఎమ్మెల్యే విడదల రజిని విజ్ఞప్తి*
*చిలకలూరిపేటలో కర్ఫ్యూ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని సూచించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కర్ఫ్యూ అమలు తీరును ఎమ్మెల్యే విడదల రజిని మంగళవారం సబ్‌కలెక్టర్ శ్రీవాస్ నపూర్ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయ్‌భాస్కర్, చిలకలూరిపేట పట్టణ, రూరల్ సీఐలు బిలాలుద్దీన్, సుబ్బారావులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ఫ్యూ పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. దుకాణాలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడానికి వీల్లేదని తెలిపారు. ప్రభుత్వం మినహాయించిన షాపులు తప్ప ఇతర దుకాణాలేవీ తెరిచి ఉంచడానికి వీల్లేదన్నారు. భౌతిక దూరం పాటించడం ఎంతో అవసరమన్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగొద్దని తాను విన్నవించుకుంటున్నానని, నియోజకవర్గాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. చిలకలూరిపేట పట్ణంలోని పలు కూడళ్లను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కళామందిర్ సెంటర్‌లో జనసంచారం ఉండటాన్ని చూసి... అధికారులు ఉదాసీనంగా వ్యవహరించొద్దని చెప్పారు. కార్యక్రమంలో ఇంచార్జి కమిషనర్ ఫణీంద్ర, డీఈఈ అబ్దుల్ రహీం, అర్బన్ యస్.ఐ అజయ్,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,కౌన్సిలర్లు విడదల గోపి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,మస్తాన్ వలి,బేరింగ్ మౌలాలి, పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు నాయకులు సాపా సైదా వలి,నకిరికంటి శ్రీకాంత్, మొహమ్మద్,ఖలీల్, మరియు పలువురు ఉన్నారు.
addComments
Post a Comment