అన్నదాతలకు అండగా.. “బరోసా” నిండుగా
ధీమా నింపిన పంటల బీమా
రైతు కార్యాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు
రెండేళ్లలో వ్యవసాయంలో మెండుగా సాయం
విజయనగరం, మే 31 (ప్రజా అమరావతి): రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వ్యవసాయంతో ఆహార భద్రత రావడమే కాక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పధకాలను అమలు చేసి రెండేళ్ల లోనే రైతు గుండెల్లో నిలిచి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నారు . రైతులకు బహుళ ప్రయోజనాలను కలిగించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా గ్రామాలలోనే విత్తనం నుండి పంట అమ్మకం వరకు సేవలు అందేలా చూస్తున్నారు.
రైతుకు అండగా - వైఎస్సార్ రైతు భరోసా :
సన్న చిన్న కారు రైతుల పంటల కాలం ప్రారంభం నుండి చివర వరకు సాగు పెట్టుబడికి అవసరమయ్యే ఖర్చులను సకాలంలో చెల్లిస్తేనే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని భావించిన ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందిస్తోంది . జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా - పి.యం. కిసాన్ క్రింద ఇప్పటివరకు 3 లక్షల 12 వేల మంది రైతులకు రూ. 961.68 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా "వైఎస్సార్ రైతు భరోసా" క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. మొదటి విడతగా ఖరీఫ్ పంటకు మే నెలలోపే రూ.7,500 రైతుభరోసా పెట్టుబడిసాయం, రెండవ విడతగా ఖరీఫ్ పంట కోత సమయం అక్టోబర్ నెలలోపే రబీ అవసరాల కోసం మరో రూ.4,000, మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో మరో రూ.2,000 రైతుల ఖాతాలో రైతు భరోసా సాయం జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ధీమా నింపిన వైఎస్సార్ ఉచిత పంటల బీమా:
రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులు 1 రూపాయి కూడా భారం పడకుండా రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 26,708 మందికి రూ.35.45 కోట్ల మేర లబ్ది చేకూర్చింది ప్రభుత్వం. 2020 ఖరీఫ్ కు సంబంధించిన పంటకోత ప్రయోగాలు మార్చిలో అయిపోయిన వెంటనే ఏప్రిల్ నెలలో ప్రణాళిక శాఖ నుండి నివేదికలు తీసుకొని బీమా పరిహారం చెల్లించడం చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. అంతే కాకుండా గత రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పోయిన 10 వేల 886 మంది రైతులకు 3.84 కోట్ల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది.
రైతు కార్యాలయాలుగా- రైతు భరోసా కేంద్రాలు: రైతులు
రైతు భరోసా కేంద్రం తమకు ఒక కార్యాలయంగా ఉందని రైతులు గర్వంగా భావిస్తున్నారు. విజ్ఞానాన్ని, వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోడానికి , ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు , సబ్సిడీ వంటి సౌకర్యాలను ఒకే దగ్గర పొందడానికి రైతు భరోసా కేంద్రమే ప్రధాన వనరుగా మారిపోయింది రైతుకు. రైతన్నకు అండగా రైతు గడప వద్దనే సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 634 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా గ్రామాలలోనే విత్తనం నుండి పంట అమ్మకం వరకు అన్నివేళలా సహాయంగా ఉండే విధంగా ప్రభుత్వం సేవలు అందిస్తోంది. ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 1 లక్ష 74 వేల 813 మంది రైతులకు 1 లక్ష 25 వేల 603 క్వింటాళ్ళ విత్తన, 2,31,558 క్వింటాల్ల ఎరువులు సరఫరా చేయడం జరిగింది. నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వంచే ధృవీకరించబడిన కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు, ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, పంట కొనుగోలు కేంద్రాల సేవలు, భూసార పరీక్షలు, వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాలు, గ్రామస్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు ఇలా అన్ని రకాల సదుపాయాలు అందించబడుతున్నాయి. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో, ఈ కేంద్రాల ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే సదుపాయం కల్పించాం. రైతులకు ఏ ఇబ్బందులు, నష్టాలు లేకుండా తమ పంటలను అమ్ముకోవడానికి ఈ ఆర్బీకేల ప్రక్కనే జనతా బజార్లు ఏర్పాటు. ఆర్బీకేలలో సేవలందించడానికి ఫిషరీస్ అసిస్టెంట్స్ ను నియమించింది. ఆర్బీకేల ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ అందిస్తోంది. పశువులు, కోళ్లు, మత్స్యరంగానికి అవసరమైన నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ ఫుట్స్ కూడా సరఫరా చేసింది. ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు. అమూల్ ద్వారా పాడి రైతులు లీటర్ పాలకు గతంలో కంటే రూ.5 నుండి రూ.15 వరకు అదనంగా అందుకుంటున్నారు. గొర్రెలు, మేకలు పెంపకందార్లకు ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞానబడి ద్వారా శిక్షణ అందిస్తోంది.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం:
రైతులకు వడ్డీ భారం తప్పించాలనే ఉదాత్త లక్ష్యంతో పంటల సాగు కోసం లక్ష రూపాయలలోపు తీసుకున్న పంట రుణాలపై రైతులకు పూర్తిగా వడ్డీ రాయితీ కల్పిస్తూ ఈ - క్రాప్ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడం జరుగుతోంది. నిర్ణీత వ్యవధిలో ఆ రుణాలు చెల్లించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా, ఇప్పటివరకు గత ప్రభుత్వ బకాయిలతో సహా 46,576 మంది రైతులకు 6.21 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది.
రైతుకు గిట్టుబాటు ధర:
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి మద్దతు ధరల ప్రకటనలో భాగంగా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది.
రైతు పండించిన ప్రతిగింజను కొంటామని చెప్పిన విధంగా రైతులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసి వెంట వెంటనే చెల్లింపులు చేయడం జరిగింది. 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను రూ. 2,769 కోట్లతో 13,08,999 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 1,40,796 మంది రైతులకు లబ్ధి చేకూర్చడమైంది. అదే విధంగా మొక్క జొన్న పంటను56, 526 మెట్రిక్ తన్నులను 210 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి 26వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా చెల్లించింది.
వైఎస్సార్ మత్స్యకార భరోస:
వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు 4,000 రూపాయలు చెల్లించేది గత ప్రభుత్వం. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ మరపడవలతో పాటు సంప్రదాయ పడవలు నడిపే వారికి కూడా వర్తింపజేశారు. . ఈ పధకం క్రింద ఈ రెండేళ్లలో జిల్లాకు చెందిన సుమారు3వేల మంది మత్స్యకారులకు 572.50 లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పంట నష్టపరిహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం.. డిసెంబర్, 2020 వరకు పంటలు నష్టపోయిన రైతులకు విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఉచిత విద్యుత్ సబ్సిడీ, నాణ్యత పెంచేందుకు విద్యుత్ ఫీడర్లకు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతోంది.
నైరాశ్యంలో ఉన్న రైతాంగంలో జవజీవాలు నింపేందుకు, వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయం కోసం, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు విధివిధానాల ఖరారుకు రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటు. పంటల సాగుపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లా స్థాయి రైతుల సలహా మండళ్లను ఏర్పాటుచేసి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది ప్రభుత్వం.
addComments
Post a Comment